ఎస్‌సి, ఎస్‌టి పదోన్నతుల అమలుపై సుప్రీంకోర్టు స్పష్టీకరణ
న్యూఢిల్లీ : షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలకు చెందిన ఉద్యోగులకు పదోన్నతులలో రిజర్వేషన్లు ఎలా అమలు చేయాలనే నిర్ణ యం రాష్ట్రాల ప్రభుత్వాలదేనని సుప్రీకోర్టు మంగళవారంనాడు స్పష్టం చేసింది. ఎస్‌సి, ఎస్‌టిలకు పదోన్నతులపై రిజర్వేషన్ల మం జూరుపై నిర్ణయాన్ని తామిక తిరగదోడబోమని పేర్కొంది. ఎస్‌సి, ఎస్‌టిలకు పదోన్నతులలో రిజర్వేషన్లు మంజూరు చేయడంలో అనేక ఆటంకాలు ఎదురవడంపై దాఖలైన అనేక విజ్ఞప్తులను జస్టిస్ నాగేశ్వరరావు సారథ్యంలోని ధర్మాసనం విచారణకు స్వీకరించింది. ఈ పదోన్నతుల మంజూరు విషయం లో రాష్ట్రాల ప్రభుత్వాలు అసాధారణ రీతిలో ఎదుర్కొంటున్న సమస్యలు ఏమున్నాయో గుర్తించి వాటిని రెండు వారాల్లోగా తమకు సమర్పించాలని ఈ కేసు విచారణకు హాజరైన న్యాయవాదికి జస్టిస్ నాగేశ్వరరావు ఆదేశాలు జారీ చేశారు. “మేం చాలా స్పష్టంగా చెబుతున్నాం, నాగరాజ్ లేదా జర్నైల్ సింగ్ కేసులను తిరిగదోడే ఉద్దేశం న్యాయస్థానానికి లేదు, ఎందుకంటే, ఆ కేసుల్లో చట్ట ప్రకారం న్యాయస్థానం నిర్ణయం తీసుకుందని జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ బి.ఆర్ గవాయ్‌లతో కూడిన జస్టిస్ నాగేశ్వరరావు సారథ్యంలోని ధర్మాసనం పేర్కొంది. ఈ పదోన్నతుల్లో రిజర్వేషన్ల అమలు చేయడంలో రాష్ట్రాల ప్రభుత్వాలకు ఏవైతే అసాధారణంగా, క్లిష్టంగా అనిపిస్తాయో అలాంటి సమస్యలను గుర్తించి తమ దృష్టికి తెస్తే వాటిని ధర్మాసనం పరిశీలిస్తుందని సుప్రీంకోర్టు తొలుత ఇచ్చిన ఉత్తర్వులలో తెలియజేసంది. నాగరాజ్ లేదా జర్నైల్‌సింగ్ కేసుల విషయంలో వాదనలకు ఇక తావివ్వబోమన్నది సుస్పష్టమైన అంశమని పేర్కొంది. రిజర్వేషన్లను పదోన్నతుల్లో ఎలా అమలు చేయాలనే విషయాలను రాష్ట్ర ప్రభుత్వాలకు సలహాలు ఇవ్వడానికి తాము ఇక్కడ లేమని, ఆ బాధ్యత ప్రభుత్వాలేదే కానీ తమది కాదని అటార్నీ జనరల్ వేణుగోపాల్, సీనియర్ న్యాయవాది ఇందిరా జైసింగ్‌లు చేసిన విజ్ఞప్తులపై ధర్మాసనం స్పష్టం చేసింది. అయితే మూడు హైకోర్టులు ఇచ్చిన తాత్కాలిక ఉత్తర్వులలో రెండు కోర్టుల ఉత్తర్వుల్లో పదోన్నతులను కొనసాగించమని, మరో ఉత్తర్వు యధాతథస్థితిని కొనసాగించమని పేర్కొన్నాయని, ఈ మూడు ఉత్తర్వులు రోజువారీ పాలనా ప్రాతిపదికకు సంబంధించినవేనని, అందువల్ల కేంద్ర ప్రభుత్వం సెక్రటేరియట్ స్థాయిలో ఉన్న 1400 పోస్టులకు నిర్ణీత సాధారణ పాలనా ప్రాతిపదికపై పదోన్నతులు ఇవ్వలేకపోతున్నామని అటార్నీ జనరల్ ధర్మాసనానికి తెలియజేశారు. మరో 2,500 పోస్టులు కూడా అనేక సంవత్సరాలుగా యధాతథ స్థితిలో స్తంభించిపోయి ఉన్నాయని వేణుగోపాల్ చెపారు. ఈ పోస్టులకు పదోన్నతులు కల్పించాలని ప్రభుత్వం కోరుకుంటోందని చెప్పారు. అయితే వెనుకబాటు తనం అనే అంశాన్ని ఎలా పరిగణనలోకి తీసుకోవాలో సర్వోన్నత న్యాయస్థానం ఇప్పటికే నిర్వచించిందని ధర్మాసనం పేర్కొంది.
నిర్ణయాధికారం రాష్ట్రాలదే
RELATED ARTICLES