గ్రహ శకలాన్ని ముద్దాడిన నాసా నౌక
వాషింగ్టన్: నాలుగేళ్ల సుదీర్ఘ ప్రయాణం తర్వాత నాసా అంతరిక్ష నౌక ఒసైరిస్ రెక్స్ భూమికి 32.1 కోట్ల కిలోమీటర్ల దూరంలో ఉన్నబెన్ను గ్రహశకలం ఉపరితలాన్ని మంగళవారం నాడు విజయవంతంగా ముద్దాడింది. తన రొబోటిక్ చేయితో సౌర కుటుంబం ఏర్పడ్డ నాటివైన రాళ్లను, ధూళిని తీసుకుని 2023లో భూమికి రానుంది ఒసైరిస్. సౌర కుటుంబం రూపొందిన క్రమం గురించి, భూమి మీద జీవం పుట్టుకకు కారణమైన పదార్థాల ఆనవాళ్లను తెలుసుకునేందుకు ఈ ప్రయోగం శాస్త్రవేత్తలకు గవాక్షంలా నిలుస్తుంది. మంగళవారం నాడు ఒసైరిస్ బెన్ను నుంచి రాళ్లను తీసుకున్న సంఘటనకు నాసా ‘టచ్ అండ్ గో’ అని, నమూనాను సేకరించిన ప్రాంతానికి ‘నైటింగేల్’ అనే పేర్లను పెట్టింది. ఇది బెన్ను ఉత్తర అర్ధగోళంలో ఉంది. ఫ్లోరిడాలోని కేప్ కెనావెరాల్ వైమానిక దళ స్థావరం నుంచి 2016 సెప్టెంబర్ 8న ఒసైరిస్ రెక్స్ (ఆరిజిన్స్, స్పెక్ట్రల్ ఇంట్రప్రిటేషన్, రీసోర్స్ ఐడెంటిఫికేషన్, సెక్యూరిటీ, రెగోలిత్ ఎక్స్‌ప్లోరర్ ఒసైరిస్ రెక్స్) తన యాత్ర మొదలుపెట్టింది. 2018 డిసెంబర్ 3న బెన్ను కక్ష్యలోకి చేరుకుంది. ఇది వచ్చే మార్చిలో తిరుగుముఖం పడుతుంది. 2023 సెప్టెంబర్ 24న భూమికి చేరుకుంటుంది. అమెరికాలోని ఉటా ఎడారి ప్రాంతంలో దిగుతుంది. ఒకవేళ రాళ్లను సేకరించినట్లు తేలకపోతే జనవరిలో మరోసారి ప్రయత్నిస్తారు.
నిరీక్షణ ఫలించింది!
RELATED ARTICLES