నేషనల్ కాన్ఫరెన్స్ చీఫ్ ఫరూక్ అబ్దుల్లా ఆవేదన
శ్రీనగర్/న్యూఢిల్లీ: తనను గృహ నిర్బంధం చేసినట్లు నేషనల్ కాన్ఫరెన్స్ చీఫ్ ఫరూక్ అబ్దు ల్లా భావోద్వేగానికి గురయ్యారు. ప్రభుత్వం జమ్మూకశ్మీర్‌ను ముక్కలు చేసిన విధంగానే మా హృదయాలను కూడా విభజిస్తుందా అని ప్రశ్నించారు. జమ్మూకశ్మీర్‌కు ప్రత్యేక స్వ యం ప్రతిపత్తి హోదా కల్పిస్తున్న ఆర్టికల్ 370ను కేంద్రం సోమవారం రద్దు చేసి రాష్ట్రాన్ని విభజిస్తూ రెండు కేంద్రపాలిత ప్రాం తాలుగా ఏర్పాటు చేస్తూ ప్రతిపాదించిన తరు వాత ఫరూక్ అబ్దుల్లా మొదటిసారిగా స్పం దించారు. జమ్మూకశ్మీర్‌ను ప్రజాస్వామ్యయు తంగా కాకుండా నియతృత్వంగా విభజించా రని మండిపడ్డారు. శ్రీనగర్‌లో ఫరూక్ మంగ ళవారం ఓ టివి చానెల్‌తో మాట్లాడారు. నేష నల్ కాన్ఫరెన్స్ అధినేత ఫరూఖ్ అబ్దుల్లా ఆయన ఇష్టప్రకారమే ఇంటివద్ద ఉన్నారని కేంద్ర హోంమంత్రి అమిత్ షా లోక్‌సభలో వెల్లడించారు. ఆయన్ను అదుపులోకి తీసు కోలేదని, పోలీసులు అరెస్ట్ చేయలేదని షా మంగళవారం స్పష్టం చేశారు. ఫరూఖ్ ఎక్క డున్నారో చెప్పాలని, అరెస్టు చేసిన కశ్మీర్ నేతలను విడుదల చేయాలని విపక్షాల డిమాండ్ చేస్తోన్న నేపథ్యంలో ఈ అంశంపై అమిత్ షా పై విధంగా వ్యాఖ్యలు చేశారు. కాగా, ప్రధాన నాయకుడు, నేషనల్ కాన్ఫ రెన్స్ అధినేత ఫరూఖ్ అబ్దుల్లా సోమవారం నుంచి సభకు రాకపోవడం సభ్యులను ఆశ్చ ర్యానికి గురిచేసింది. దీనిపై ఎన్‌సిపి నేత సుప్రియా సూలే మాట్లాడుతూ ఎప్పుడు తన పక్క సీట్లో కూర్చొనే అబ్దుల్లా సభలో లేరని, ఆయన గళం వినిపించడం లేదని చర్చా సమయంలో ఈ అంశాన్ని లేవెనెత్తారు. ‘ఆయన్ను అరెస్టు చేయలేదు. అదుపులోకి తీసుకోలేదు. ఆయన ఇష్ట ప్రకారమే ఇంట్లో ఉన్నారు’ అని అమిత్ షా సమాధానం ఇచ్చారు. ఆయన అనారోగ్యంతో ఉన్నారా అని ఆమె అడగ్గా.. ‘నేను వైద్యం చేయట్లేదు. అది వైద్యులు చెప్పాల్సిన విషయం’ అని వెల్లడించారు. ఇదిలా ఉండగా, తనను అదుపులోకి తీసుకొని ఇంట్లోనే నిర్బంధించారని, దీనిపై హోంమంత్రి అబద్ధం చెప్పారని ఫరూఖ్ అబ్దుల్లా మండిపడ్డారు. ఇంట్లో నిర్బంబధిస్తే తలుపులు విరుగగొట్టుకొని బయటకు వచ్చి మీడియాతో మాట్లాడుతున్నానని స్పష్టం చేశారు. తనను అరెస్టు చేయలేదని, తన ఇష్ట ప్రకారమే ఇంట్లో ఉన్నట్లు హోంమంత్రి చేసిన ప్రకటనను తాను విన్నానన్నారు. అమిత్ షా అబద్ధాలు చెబుతున్నారన్నారు. డిఎస్‌పి తన ఇంటి బయటే ఉంటి ఏ ఒక్కరిని కూడా ఇంట్లోని బయటకు వెళ్లనీయడం గానీ, బయటి వ్యక్తులు ఇంట్లోకి రానీయడంగానీ చేలేదని చెప్పారు. జమ్మూకశ్మీర్‌కు సంబంధించి ప్రభుత్వ తీసుకున్న నిర్ణయంపై ఫరూక్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ప్రాంతాలను విభజించారని, తమ హృదయాలను కూడా విభజిస్తారా అని ఆయన ప్రశ్నించారు. హిందులను, ముస్లింలను కూడా విభజిస్తారా అని నిలదీశారు. భారత్ అందరిదని, లౌకిక, ఔక్యతను విశ్వసిస్తున్న ప్రతి ఒక్కరిదని ఆయన చెప్పారు. గత 70 ఏళ్లుగా పోరాటం చేసిన తమను నేడు నేరస్థులుగా పరిగణిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.ఆర్టికల్ 370, 35ఎపై భారత ప్రభుత్వం తమకు హామీనిచ్చిందన్నారు. కాగా, ఎంత మంది నాయకులను అరెస్టు చేశారో తనకు తెలియదని చెప్పారు. తమను గృహ నిర్బంధం చేశారని, ఎవరిని కూడా ఇంట్లోకి రానీయం లేదని ఫరూక్ వివరించారు.