నిధులు విడుదల చేయని కేంద్రం?
ముందుకు సాగని పనులు
ప్రజాపక్షం/హైదరాబాద్; తెలంగాణ రాష్ట్రానికి మంజూరైన ప్రతిష్టాత్మక ప్రాజెక్టుగా భావిస్తున్న మెదక్ నిమ్జ్ పనులు అటకెక్కాయి. జాతీయ పెట్టుబడులు, ఉత్పాదక మండళ్ల(నిమ్జ్)కు కేంద్ర ప్రభుత్వం నుండి నిధులు విడుదల కాక పోవడంతో ఈ పనులు నిలిచిపోయినట్లు పరిశ్రమ శాఖ ఉన్నతాధికార వర్గాలు చెబుతున్నాయి. మెదక్ నిమ్జ్‌కు నిధుల సేకరణ విషయంలో గత మూడేళ్లుగా ఇటు రాష్ట్ర రాష్ట్ర ప్రభుత్వం అటు కేంద్రం ఒకరిపై మరొకరు నెపం వేసుకుంటున్నారు. రాష్ట్ర పరిశ్రమల శాఖ మాత్రం ఇప్పటికే మెదక్ నిమ్జ్‌కు రాష్ట్ర ప్రభుత్వం తరఫున చేయాల్సినవన్నీ చేశామని, కేంద్రమే సహకరించడం లేదని చెబుతోంది. అటు కేంద్ర ప్రభుత్వ వర్గాలు మాత్రం ఈ ప్రాజెక్టు ఏర్పాటుకు అంగీకారం తెలపడంతో పాటు అనుమతులు కూడా ఇచ్చామని అంటున్నాయి. అంతే కాకుండా ఈ ప్రాజెక్టు పూర్తి చేయించేందుకు పూర్తి సహకారం కూడా అందజేస్తామని చెబుతోంది. మెదక్ నిమ్జ్‌ను గత ఏడాదిలోనే ప్రారంభించాలని రాష్ట్ర ప్రభుత్వం భావించింది. ఇందులో భాగంగానే ఈ ప్రాజెక్టు ఏర్పాటుకు అవసరమైన నిధుల్లో కనీసం 25 శాతం నిధులను అయినా ఇవ్వాలని కోరింది. ఇందుకోసం కేంద్ర ప్రభుత్వానికి నిమ్జ్ ప్రాజెక్టు ప్రతిపాదనలను కూడా పంపించింది. భారీ పెట్టుబడులు, ఉపాధి కల్పన, వనరుల వినియోగం లక్ష్యాలుగా తెలంగాణ రాష్ట్రానికి నిమ్జ్‌ను మంజూరి చేసినట్లు కేంద్ర ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతం నిమ్జ్ ఇంకా భూసేకరణ దశలోనే ఉంది. కేంద్ర ప్రభుత్వ సూచనల ఆధారంగానే రాష్ట్ర ప్రభుత్వం నిమ్జ్‌కు సంబంధించిన డిజైన్లు రూపొందించినట్లు టిఎస్‌ఐఐసి ఉన్నతాధికారులు చెబుతున్నారు. పర్యావరణ ప్రభావిత అధ్యయనాలు కూడా పూర్తి అయ్యాయని వారు చెబుతున్నారు.
నిమ్జ్‌కు అనుమతులతోనే సరి!
RELATED ARTICLES