HomeNewsBreaking Newsనిబంధనలకు పాతర

నిబంధనలకు పాతర

బినామీల పేర్లతో మెడికల్‌ షాపుల నిర్వహణ
బిల్లులు ఇవ్వకుండానే మందుల విక్రయాలు
వైద్యుల చిట్టీలు లేకపోయినా ఔషధాల అమ్మకం
కానరాని ఫార్మసిస్టులు
ప్రజాపక్షం/వైరా
మెడికల్‌ షాపులు అంటే నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండి మందులు అందించే విధంగా ఉం టాయి. అలాంటి మెడికల్‌ షాపులు లాభసాటి వ్యా పారంగా మారాయి. ధనార్జనే ధ్యేయంగా మందులపై అవగాహన లేకున్నా ప్రతి ఊరిలో పుట్టగొడుగుల్లా ఏర్పడుతున్నాయి. ‘మెడికల్‌ షాపు పెట్టు.. డబ్బులు దండుకో’ అనే విధంగా ప్రస్తుతం మెడికల్‌ వ్యాపారుల తీరు కన్పిస్తుంది. ఖమ్మం జిల్లాలో పెద్ద ఎత్తున మెడికల్‌ షాపులు వెలిశాయి. నిత్యం ప్రతి గ్రామంలో ఏదో ఒక చోట ఒక షాపు ఏర్పడుతోంది. అమయాక ప్రజల ప్రాణాలతో మెడికల్‌ షా పుల నిర్వాహకులు ఆటలాడుకుంటున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. కొన్ని చోట్ల కొంత మంది వైద్యులతో ముందస్తు ఒప్పందాలు కుదుర్చుకుని ఎక్కువ మందులు రాయించుకుని డబ్బులు దండుకుంటున్నారనే విమర్శలు లేకపోలేదు. జ్వరానికి వైద్యం కోసం వెళ్తే సంబంధం లేని టాబ్లెట్లు రాసి అమాయకకులను మోసం చేస్తున్నారని ఆరోపణ లు వినిపిస్తున్నాయి. షాపు యజమానులు వైద్యుల సంబంధాలతో ప్రజలు కుదేలవుతున్నారు.
పుట్టగొడుగుల్లా ఏర్పాటు…ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పలు మండలాల్లో పుట్ట గోడుగుల్లా మెడికల్‌ షాపులు వెలుస్తున్నాయి. మెడికల్‌ నిబంధనలకు పాతర వేసి షాపులను బినామీల పేరుతో నడుపుతున్నారు. మెడికల్‌ నిబంధన ల ప్రకారం ఫార్మసిస్టులే మెడికల్‌ షాపులను నిర్వహించాల్సి ఉంది. కానీ అలా కాకుండా సంబంధం లేని వ్యక్తులు

బినామీలతో షాపులు నిర్వహిస్తున్నారు. బినామీ మెడికల్‌ షాపు నిర్వాహకులు పార్మసిస్టులకు పలు రూపాలలో ఆశలు చూపి వారి పేరు మీద దర్జాగా మెడికల్‌ షాపులు తీసుకుని కొనసాగిస్తున్నారు. కొంతమంది మెడికల్‌ షాపుల నిర్వహకులు డాక్టర్లను ఏర్పాటు చేసుకుని, ఇతర డాక్టర్‌లతో ఒప్పందాలు కుదుర్చుకుని కమీషన్లు ఇస్తూ మందులు విక్రయాలు కొనసాగిస్తున్నారు. గ్రామాల్లో ఉండే పిఎంపిలతో, ఆర్‌ఎంపిలతో సంబంధాలు ఏర్పాటు చేసుకుని నాసిరకమైన మందులను ప్రజలకు అంటగడుతున్నారు. ఔషధ నియంత్రణ అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో ప్రజలు వారిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాగా, ప్రభుత్వ, మెడికల్‌ నిబంధనల ప్రకారం మెడికల్‌ షాపుల్లో మందులు విక్రయించే ముందు వాటికి బిల్లులు ఇవ్వాల్సి ఉంటుంది. కానీ బిల్లులు ఇవ్వకుండా, చిట్టీలు లేకుండా వారి ఇష్టానుసారంగా విక్రయిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ప్రజలు అడిగిన వెంటనే మెడికల్‌ షాపుల నిర్వహకులు వారికి తెలిసిన మందులను ఇచ్చి ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. కొన్ని మెడికల్‌ షాపుల్లో ఫిజీషియన్‌ శాంపిల్స్‌ సైతం అమ్ముతూ సొమ్ము చేసుకుంటున్నారని పలువురు పేర్కొంటున్నారు. ఇంత తతంగం జరుగుతున్నా ఔషధ నియంత్రణ అధికారులు మాత్రం తూతుమంత్రం వారికి తోచినట్లు నామమాత్రంగా తనిఖీలు చేస్తున్నారనే ఆరోపణలు వెలువడుతున్నాయి.
మందులు విక్రయాలపై కొరవడిన నిఘా…
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పెద్ద ఎత్తున మెడికల్‌ షాపులు ఉన్నాయి. మందుల విక్రయాల తీరును ఔషధ నియంత్రణ అధికారులు పరిశీలించకపోవడంతో పలు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ప్రజలు ఆసుపత్రికి వెళితే చాటంత వైద్యుడు రాసిన డిస్క్రిప్షిన్‌ బయటికి వస్తుంది. అది తీసుకుని రోగులు మెడికల్‌ షాపుకు వెళితే వారి ఇష్టానుసారంగా ధరలతో ప్రజలు జేబులకు చిల్లులు పెడుతున్నారు. తనిఖీలు చేసి మెడికల్‌ షాపులు సీజ్‌ చేసి కొన్ని రోజులకే మరల ఆ మెడికల్‌ షాపులు తెరుచుకుంటున్నాయి. గ్రామాల్లోని కిరాణా షాపుల్లోని సైతం మందులు విక్రయిస్తున్నారు. అధికారుల నిఘా కొరవడటం వల్లే ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని ఆరోపిస్తున్నారు.

DO YOU LIKE THIS ARTICLE?
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments