విజయవంతంగా నిర్దేశిత కక్ష్యలోకి చంద్రయాన్ ౩
ఆగస్టు 23 సాయంత్రం 5.47 గంటలకు చంద్రుడిపై ల్యాండర్ అడుగులుశ్రీహరికోట : ఎలాంటి ఆటంకాలు లేకుండా చంద్రయాన్ అనుకున్నవిధంగా దూసుకువెళ్ళింది. 25.50 గంటలసేపు జరిగిన కౌంట్‌డౌన్ పూర్తయ్యాక ‘ఫ్యాట్ బోయ్’గా ప్రసిద్ధి చెందిన బాహుబలి వాహనం ఎల్‌విఎం3 (జిఎస్‌ఎల్‌విఎంకె చంద్రయాన్‌ను తీసుకుని నిప్పులు చిమ్ముకుంటూ నింగిలోకి దూసుకుపోయింది. ఫ్యాట్‌బోయ్ బయలుదేరిన 16 నిమిషాల తరువాత చంద్రయాన్ దాని నుండి వేరుపడింది. చంద్రయాన్‌కు వెళ్ళేదశగా భూమికి 36,500 కి.మీ దూరంలో ఇది సంక్షిప్త కక్ష్యలోకి చేరింది. 17 రోజులు ప్రయాణం తరువాత చంద్రుడి కక్ష్యలోకి ప్రవేశిస్తుంది. ఇస్రో నిర్దేశించిన ప్రకారం ఆగస్టు 23వ తేదీ సాయంత్రం 5.47 గంటలకు చంద్రయాన్ ల్యాండర్ జాబిల్లిమీద కాలు మోపుతుంది. మొత్తం 40 రోజుల ప్రయాణం తరువాత చంద్రుడిపై అడుగులు పడ్డాక నాలుగు చక్రాల రోవర్ శోధనా కార్యకలాపాలు ప్రారంభం అవుతాయి. వేలాదిమంది వీక్షకులు ఈ చారిత్రక ఘట్టాన్ని తిలకించి పులకించిపోయారు. ఉదయం నుండే వీక్షకులు ఆ ప్రాంతానికి చేరుకున్నారు. జాబిల్లి దిశగా ప్రయాణం చేసేందుకు 3,900 కేజీల బరువున్న చంద్రయాన్ ని ఎల్‌ఎంవి౩ శుక్రవారం మధ్యాహ్నం 2.35 గంటలకు సురక్షితంగా మోసుకువెళ్ళి, నిర్దిష్ట కక్ష్యలోకి ప్రవేశపెట్టింది. ఇప్పటివరకూ కేవలం అమెరికా, సోవియట్ యూనియన్, చైనా దేశాలు మాత్రమే సాధించిన ఘనత తానుకూడా సాధించి నాలుగోదేశంగా ఆ ఎలైట్‌గ్రూపులో చేరేందుకు భారత్ సమాయత్తమైంది. చంద్రయాన్ భూమిచుట్టూ వలయాకారంలో ఐదారు ప్రదక్షిణలు చేస్తూ గురుత్వాకర్షణశక్తి ప్రాతిపదికై తిరిగి వేగాన్ని ఎత్తునూ పెంచుకుంటూ చంద్రుడి కక్ష్యలోక ప్రవేశిస్తుంది. తర్వాత రివర్స్‌గేర్‌లో చంద్రుడి చుటూ పరిభ్రమిస్తూ క్రమంగా వచ్చే నెల 23 నాటికి ఉపరితలానికి చేరువ అవుతుంది. చంద్రుడిపై సున్నితంగా కాలు పెట్టలేకపోవడంవల్లనే చంద్రయాన్ 2019లో విఫలమైంది. ఇప్పుడు ఇస్రో పూర్తిగా తన శక్తిసామర్థ్యాలను చంద్రుడిపై చాలా సున్నితగా ల్యాండర్ కాలుమోసి రోవర్ విజయవంతంగా బయటకు దిగి పరుగులు తీయడంపైనే కేంద్రీకరించింది. ఈ రెండు చర్యలను ఇస్రో అత్యంత ప్రతిష్టాత్మకమైన సవాళ్ళుగా చేపట్టింది. చంద్రయాన్ ద్వారా చంద్రుడి కక్ష్యలోకి వెళ్ళిన ఆర్బిటార్ చాలా విజయవంతంగా ఇప్పటికీ పనిచేస్తూ ఉండటంతో ఆ సేవలను చంద్రయాన్ కి కూడా ఇస్రో భూ కేంద్రం ఉపయోగించుకుటుంది. అందుకే ‘ఫ్యాట్ బోయ్’ విక్రమ్ పేరుగల ల్యాండర్, రోవర్‌లను మాత్రమే తీసుకువెళ్ళాడు. 15 సంవత్సరాలుగా చంద్రయాన్‌ను విజయవంతం చేసేందుకు ఇస్రో గట్టి కృషి చేస్తూ వచ్చింది. ఈ మొత్తం మూన్ మిషన్‌కు రూ.613 కోట్లు ఖర్చు చేశారు. చంద్రయాన్ కోసం ఇంతకంటే ఎక్కువగా రూ.900 కోట్లుపైనే ఖర్చు చేశారు. ఈసారి ఖర్చు తగ్గించారు.
సంబురాలు చేసుకున్న ఇస్రో సిబ్బంది
చంద్రయాన్ తొలిదశ ఘన విజయం సాధించడంతో ఇస్రో కేంద్రంలో సిబ్బంది సంబురాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా ఇస్రో ఛైర్మన్ సోమనాథ్‌కు చంద్రయాన్ జ్ఞాపికనుఅందజేసి సిబ్బంది అభినందించారు. సంక్షిప్త కక్ష్యలోకి చంద్రయాన్ ప్రవేశించిందని సోమనాథ్ చెప్పారు. సిబ్బంది అందిరికీ ఆయన అభినందనలు తెలియజేశారు. తరాత ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ, చంద్రయాన్ ఆగస్టు 23 వ తేదీన భారత కాలమానం ప్రకారం సాయంత్రం 5.47 గంటలకు చంద్రుడిపై కాలు పెడుతుందని హరధ్వానాలమధ్య ప్రకటించారు. ఆగస్టు 1వ తేదీన చంద్రుడి కక్ష్యలోకి ప్రవేశిస్తుందని ఆయన చెప్పారు. మనకు తెలియని అంతర్గత సమస్యలు ఏమైనా ఉంటే క్షుణ్ణంగా పరిశీలించి దిద్దుబాట్లు చేస్తామని అన్నారు. మూన్ మిషన్ డైరెక్టర్ ఎస్.మోహన కుమార్ మాట్లాడుతూ ఎల్‌విఎం3 రాకెట్ భారీ బరువులను మోసుకెళ్ళగల తన సామర్థ్యాన్ని మరోసారి రుజువు చేసుకుందని చెప్పారు. రాకెట్ నుండి చంద్రయాన్ విజయవంతంగా వేరుపడిందని చెప్పారు. ఇప్పటివరకూ ఎవరూ అన్వేషించని లోతుల్లోకి, ప్రాంతాల్లోకి వెళ్ళి చంద్రయాన్ అన్వేషణలు కొనసాగిస్తుందని, చంద్రయాన్‌కు పరిమితులే లేవని అన్నారు. రోవర్ చంద్రుడిమీద పరుగులు తీసేటప్పుడు ల్యాండర్ నియంత్రణలో ఉంటుందని చెప్పారు.
నిప్పులు చిమ్ముతూ ..నింగిలోకి
RELATED ARTICLES