ఆల్‌రౌండర్ విజయ్ శంకర్
నాగ్‌పూర్: నిదహాస్ ట్రోఫీ వైఫల్యం తనకెన్నో పా ఠాలు నేర్పిందని భారత స్టార్ ఆల్‌రౌండర్ విజయ్ శంకర్ అన్నాడు. నిదహాస్ ట్రోఫీలో ఘోరంగా విఫలమైన శంకర్ ఆ సమయంలో అభిమానుల నుంచి భారీ విమర్శలు ఎదుర్కొన్నాడు. అక్కడి నుంచి తన ఆటను మెరుగుపర్చుకుంటూ ఈ రోజు ఈస్థాయికి చేరాడు. ప్రస్తుతం టీమిండియాలో శంకర్ గొప్ప ప్రదర్శనలతో అందరిని ఆకర్షిస్తున్నాడు. ఆస్ట్రేలియాతో మంగళవారం జరిగిన రెండో వన్డేలో విజయ్ శంకర్ ఆల్‌రౌండ్ నైపుణ్యంతో అదరగొట్టిన విషయం తెలిసిందే. బ్యాటింగ్, బౌలింగ్ రెండు విభాగాల్లో రాణించి తన సత్తా చాటుకున్నాడు. విజయం ముంగిట నిలిచిన ఆసీస్‌ను ఓడించి భారత్‌కు గొప విజయాన్ని అందించాడు. క్లిష్ట సమయంలో బ్యాటింగ్‌కి వచ్చిన శంకర్ కెప్టెన్ కోహ్లీతో కలిసి గొప్ప భాగస్వామ్యాన్ని ఏర్పర్చాడు. బ్యాటింగ్‌లో దూకుడుగా ఆడి 46 పరుగులు చేశాడు. ఇక బౌలింగ్‌లో చివరి ఓవర్ వేసిన ఇతను ప్రమాదకరమైన బ్యాట్స్‌మన్, అప్పటికే హాఫ్ సెంచరీతో జోరుమీదున్న మార్కస్ స్టాయినిస్ (52)ను ఔట్ చేయడంతో పాటు ఆడమ్ జంపా వికెట్‌ను కూడా పడగొట్టి భారత జట్టుకు అద్భుత విజయాన్ని అందించాడు. కీలకమైన ఓవర్ వేసిన విజయ్ శంకర్ కెప్టెన్ నమ్మకాన్ని నిలబెట్టాడు. అప్పటికే ప్రధాన బౌలర్లు బుమ్రా, షమీ ఓవర్లు పూర్తవడంతో మిగిలిన ఆఖరి ఓవర్ శంకర్‌తో వేయించాల్సి వచ్చింది. కాగా, ఆ ఓవర్లో ఆసీస్‌కు విజయం కోసం 11 పరుగులే కావాలి. కీలక బ్యాట్స్‌మన్ క్రీజులో ఉన్నాడు. అయినా శంకర్ తెలివిగా బౌలింగ్ చేస్తూ తొలి బంతికే స్టోయినిస్‌ను, మూడో బంతికి జంపాను ఔట్ చేసి టీమిండియాకు చిరస్మరణీయ గెలుపును అందించాడు. ఇక వరల్డ్ కప్ జట్టులో ఇతని స్థానంపై ఇంకా స్పష్టత రాలేదు. ఇప్పటికే హార్దిక్ పాండ్యా ఆల్ రౌండర్ కోటాను పూర్తి చేసుకున్నాడు. ఇక రెండో ఆల్ రౌండర్‌గా జడేజా, శంకర్ మధ్య పోటీ ఉంది. మ్యాచ్ అనంతరం మాట్లాడిన విజయ్ శంకర్.. పపంచకప్ జట్టులో చోటు గురించి ఆలోచించడం లేదని అన్నాడు. ఇప్పటికింకా అది చాలా దూరంలో ఉందన్నాడు. తన దృష్టిలో ప్రతి మ్యాచ్ కీలకమేనని, జట్టు విజయం కోసం అత్యుత్తమ ప్రదర్శన చేయడంపైనే తన దృష్టి ఉందని వెల్లడించాడు.
నిదహాస్ ట్రోఫీ వల్లే..
RELATED ARTICLES