హైదరాబాద్ : కరోనా లాక్‌డౌన్ వల్ల కూరగాయలు,నిత్యావసర వస్తువులు, మాంసం వంటి వాటి ధరలు పెరగలేదని, గత ఏడాది ధరలతో పోలిస్తే 6 శాతం రేట్లు తగ్గాయని ప్రభుత్వం హైకోర్టుకు తెలిపింది. నిత్యావసర వస్తువుల రేట్లు పెరిగాయని పిటిషనర్ల లాయర్లు చెప్పారు. దీంతో వాస్తవ ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుని 29 నాటికి రిపోర్టు ఇవ్వాలని రాష్ట్ర న్యాయసేవాధికార సంస్థ మెంబర్ సెక్రటరీని హైకోర్టు ఆదేశించింది. విచారణను వచ్చే నెల 6కి వాయిదా వేస్తున్నట్లు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆర్‌ఎస్ చౌహాన్, న్యాయమూర్తి జస్టిస్ అభిషేక్‌రెడ్డిలతో కూడిన ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది.
నిత్యావసరాల ధరలపై నివేదికివ్వండి
RELATED ARTICLES