కేంద్రంలో బిజెపి అనుసరిస్తున్న వ్యతిరేక విధానాలపై పోరాటానికి సన్నద్ధం కావాలి:కూనంనేని
ప్రజాపక్షం/మణుగూరు బిజెపి ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాటానికి నడుం బిగించాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు పిలుపు నిచ్చారు. పినపాక నియోజకవర్గం జనరల్ బాడీ సమావేశం మణుగూరు మండలంలో వాసవినగర్‌లోని గిరిజన భవన్‌లో కామ్రేడ్ సరెడ్డి పుల్లారెడ్డి అధ్యక్షతన జరిగింది. ఈసమావేశానికి ముఖ్యఅతిథిగా ఆయన హాజరై మాట్లాడుతూ కేంద్రంలో బిజెపి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ రంగ సంస్ధలను ప్రైవేటు పరం చేస్తూ కార్పొరేట్ శక్తులకు ఊడిగం చేస్తున్నారని దుయబడ్డారు. నేడు పేద, మధ్యతరగతి బ్రతుకు భారంగా మారిందని పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్ నిత్యావసర ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయన్నారు. అరవై రూపాయలు ఉన్నటువంటి పెట్రోలు నేడు 115 రూపాయలకు పెంచారు, గతంలో వంట గ్యాస్ 400 రూపాయలు ఉంటే నేడు 1150 రూపాయలు పెంచారని, ఇది ఈ విధంగా పేదవానిపై మోయలేని భారం మోపుతున్నారని ఆరోపించారు. కార్మిక చట్టాలను తుంగలో తొక్కుతూ కార్పొరేట్ అనుకూలంగా చట్టాలను తయారు చేస్తూ, చివరకు లాభాల్లో ఉన్న బొగ్గు బావులను కూడా ప్రైవేట్ పరం చేయడానికి బ్లాకులుగా అమ్మేస్తుందని ఆరోపించారు. ఎవరెన్ని మాటలు చెప్పినా అధికారం ఉన్నా లేకున్నా పేద ప్రజల పక్షాన కార్మిక వర్గం పక్షాన నిత్యం పోరాటాలు కొనసాగించేది కమ్యూనిస్టు పార్టీ అని, దీనిని కార్యకర్తలు ప్రతి ఒక్కరూ గ్రహించాలని ఈఎర్రజెండా పార్టీని ఎరుపు ఎక్కించే దానిలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని భవిష్యత్తులో పోత్తులు ఉన్నా లేకున్నా సిపిఐ ఎన్నికల బరిలో నిలుస్తుందని, దీనికి మీరందరూ సైనికుల్లా పని చేయాలని పిలుపు నిచ్చారు. అనంతరం సిపిఐ పార్టీ సీనియర్ నాయకులు పాకాల పాటి వెంకటేశ్వరరావు, సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బి.అయోధ్య, సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్‌కే సాబీర్ పాషాలు మాట్లాడుతూ ప్రభుత్వాలు ఏ నాడు ఎన్నికల ముందు ఇస్తున్నటువంటి హామీలు అమలుకు నోచుకోవడం లేదని, అనేక సంవత్సరాలుగా పోడు భూములకు పట్టాలు ఇవ్వాలని సిపిఐ పార్టీ అనేక పోరాటాల నిర్వహించిందని పోరాటాల ఫలితంగానే నేడు పోడు భూములకు పట్టాలు ఇస్తామని ప్రభుత్వం హామీ ఇవ్వడం జరిగిందన్నారు. భూములు కోల్పోయిన సీతమ్మ సాగర్ ప్రాజెక్ట్ నిర్వాసితులకు పరిహారం వెంటనే అందించాలని, దళితులకు మూడు ఎకరాల భూమి, దళిత బంధు స్కీం అర్హులైన అందరికీ వర్తింపజేయాలని, సొంత స్ధలం ఉన్న ప్రతి పేదవాడికి రూ.5లక్షల ఇవ్వాలని, ఎస్‌టిలకు గిరిజన బంధు అమలు చేయాలని, నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి వెంటనే ఇవ్వాలని, పేద కార్మిక, కర్షక వర్గాల ప్రజలకు అండగా సిపిఐ నిలుస్తుందన్నారు. ఈకార్యక్రమంలో భాగంగా ప్రజానాట్యమండలి జిల్లా నాయకులు ఆదర్ల సురేందర్, రాము, రాయల భిక్షం వారి బృందంతో ఆట పాటలతో కార్యకర్తలు ఉత్తేజపరిచి అలరించారు. ఈకార్యక్రమంలో మహిళా సమైక్య సీనియర్ నాయకురాలు పాకాలపాటి లలితమ్మ, పాకాలపాటి చందు, జిల్లా కార్యవర్గ సభ్యులు కమటం వెంకటేశ్వరరావు, మున్నా లక్ష్మీకుమారి, రేసు ఎల్లయ్య, జిల్లా సమితి సభ్యులు ఆర్.లక్ష్మీనారాయణ, తదితరులు పాల్గొన్నారు.
నిత్యావసరాలపెంపుతో పేదలపై మోయలేని భారం
RELATED ARTICLES