HomeNewsBreaking Newsనిజాలు వెల్లడయ్యేవరకు ప్రశ్నిస్తూనే ఉంటాం

నిజాలు వెల్లడయ్యేవరకు ప్రశ్నిస్తూనే ఉంటాం

గౌతమ్‌ అదానీ వ్యవహారంలో ప్రభుత్వాన్ని వదలబోం
అదానీ సామ్రాజ్యం బ్రిటిష్‌ ఈస్ట్‌ఇండియా కంపెనీ లాంటిదే
కాంగ్రెస్‌ 85వ ప్లీనరీ సమావేశంలో రాహుల్‌గాంధీ ఉద్ఘాటన

నవ రాయ్‌పూర్‌ : గౌతమ్‌ అదానీ వ్యవహారంలో నిజాలు వెల్లడయ్యే వరకూ ప్రభుత్వాన్ని తమ పార్టీవేలాదిసార్లు ప్రశ్నిస్తూనే ఉంటుందని కాంగ్రెస్‌పార్టీ నాయకుడు రాహుల్‌గాంధీ అన్నారు. ఓడరేవులతోసహా సకల సంపదనూ దోచుకెళ్ళిన ఒక కంపెనీ కంబంధ హస్తాల నుండి దేశాన్ని విముక్తి చేసేందుకే ఈ యుద్ధం అని బ్రిటీష్‌ తూర్పు ఇండియా కంపెనీ అరాచకాలను గుర్తుచేస్తూ రాహుల్‌ అన్నారు. చత్తీస్‌గఢ్‌ నవరాయ్‌పూర్‌లో మూడోరోజు ఆదివారం జరిగిన 85 వ ప్లీనరీ సమావేశంలో రాహుల్‌గాంధీ మాట్లాడుతూ, అదానీ సామ్రాజ్యాన్ని బ్రిటీష్‌ తూర్పు ఇండియా కంపెనీతో సరిపోల్చారు. దేశ ఆస్తులు, మౌలిక సదుపాయాలు తన సొంతం చేసుకున అదానీ కంపెనీకి వ్యతిరేకంగా యావత్‌ దేశం పోరాటం చేస్తుందన్నారు. భారత్‌ జోడో యాత్ర ద్వారా పార్టీ చేపట్టిన ‘తపస్య’నుముందుకు తీసుకువెళ్ళేందుకు, యావత్‌ భారతదేశం ఈ కార్యక్రమంలో పాల్గొనేవిధంగా సరికొత్త ప్రణాళిక రూపొందిస్తామని రాహుల్‌గాంధీ అన్నారు. కేంద్ర ప్రభుత్వంపై పెద్ద ఎత్తున రాహుల్‌గాంధీ ప్లీనరీలో విమర్శల దాడి చేశారు. అదానీ దేశానికి వ్యతిరేకంగా పనిచేస్తున్నాడని, యావత్‌ దేశ సంపదపైనా కన్నేశాడని విమర్శించారు. “ప్రధానమంత్రితో అదానీకి ఉన్న సంబంధాలు ఏమిటని పార్లమెంటులో మేం ఈ ప్రభుత్వాన్ని నిలదీసినప్పుడు నా యావత్‌ ప్రసంగాన్నీ రికార్డుల నుండి తొలగించి నామరూపాలులేకుండా చేశారు, ఇలాంటి పరిస్థితుల్లో ఇక మేం ఈ విషయాన్ని పార్లమెంటు లోపలా వెలుపలా వేలసార్లు ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తాం, నిలదీస్తాం, దీన్ని ఆపేది లేదు” అని కరతాళ ధ్వనులమధ్య రాహుల్‌గాంధీ అన్నారు. “నేను అదానీనికి చెప్పదలచుకున్నాను, అతడి గ్రూపు కంపెనీలు దేశాన్ని తీవ్రంగా గాయపరచాయి, దేశంలో ఉన్న యావత్‌ మౌలికసదుపాయాలన్నింటినీ ఎత్తుకుపోయాయి, దేశంలో ఉన్న యావత్‌ సంపదనీ, ఓడ రేవులను తన సొంతం చేసుకున్న అదానీ కంపెనీ నుండి విముక్తి చేయడం కోసం దేశం ఆ కంపెనీ వ్యతిరేక పోరాటం చేస్తుంది, చరిత్ర పునరావృతం అవుతోంది, వాళ్ళు చేసేదంతా దేశ వ్యతిరేక చర్యలే, అదే అలా కొనసాగితే యావత్‌ కాంగ్రెస్‌పార్టీ దానికి వ్యతిరేకంగా పోరాటం చేస్తుంది” అన్నారు. ప్రధానమంత్రి నరేంద్రమోడీ, అదానీ మధ్య ఉన్న సంబంధం ఏమిటో బయటపెట్టాలని ఈ ప్రశ్న తాము అడుగుతూనే ఉంటామని అన్నారు. కన్యాకుమారి నుండి కశ్మీరు వరకూ చేసిన భారత్‌ జోడో యాత్రను రాహుల్‌గాంధీ ప్రస్తావిస్తూ, లక్షలాదిమంది ప్రజలు ఈ పాదయాత్రలో పాల్గొన్నారని, అనేక అభిప్రాయాలను, ఆవేదనలను తనతో పంచుకున్నారని చెప్పారు. తానేదో రైతులకు చెప్పాలనుకున్నానని, కానీ తరువాత క్రమంతా తానే రైతుల సమస్యలన్నీ వినడం ప్రారంభించాననీ, వారి సమస్యలు క్షుణ్ణంగా తెలుసుకున్నానని అన్నారు. తాను జమ్మూకు చేరుకునే సమయానికి చివరకు తాను పెద్దగా ప్రసంగాలు చేయడం మానేసి ప్రజలు చెప్పే సమస్యలు, వారి బాధలు వినడం ప్రారంభించానని అన్నారు. కశ్మీరులో తన జోడో యాత్ర ప్రవేశించేనాటికి వేలాదిమంది తన పాదయాత్రలో జత కలిశారని అన్నారు. “కశ్మీరులో ప్రజలు ఎంతో వేదనతో ఉన్నారు, వారి మనసులకు గాయమైంది, మరి దేశంలో ఇతర ప్రాంతాల వారు ఎందుకు సంతోషంగా ఉన్నారు?” అని ఒక బాలుడు తనను ప్రశ్నించాడని రాహుల్‌ అన్నారు. కానీ అది నిజం కాదని, దేశంలో ప్రజలు అందరూ సమస్యలతో బాధపడుతున్నారని, వారి హృదయాలన్నీ తీవ్రంగా గాయపడ్డాయని తాను చెప్పానని రాహుల్‌ అనారు. తాను కశ్మీరు లోయలోకి వెళ్ళేకొద్దీ ఇక పోలీసులు తనకు కనిపించడం మానేశారని, వేలాదిమంది ప్రజలు తనవెంట వచ్చారని, తుదకు ఉగ్రవాదం తీవ్రంగా ప్రాంతాలలో కూడా తనకు వేలాదిమంది కశ్మీరీయులు పట్టుకున్న జాతీయ జెండా కనిపించిందని అన్నారు. కశ్మీరీ యువకులు చేతుల్లో భారత జాతీయ త్రివర్ణ పతాకాన్ని తాను చూశానని, తాము ఇంతకు మునుపు ఎప్పుడూ ఇలాంటి దృశ్యాలు చూడలేదని సిఆర్‌పిఎఫ్‌ జవానులు తనతో అన్నారని రాహుల్‌ ప్లీనరీలో చెప్పారు. కానీ ప్రధానమంత్రి నరేంద్రమోడీ పార్లమెంటులో ప్రసంగిస్తూ ను కూడా కశ్మీరులో జాతీయ పతాకాన్ని ఎగురవేశానని చెప్పారని, కానీ కేవలం ఏదో కొద్దిమంది బిజెపి కార్యకర్తల సమక్షంలో శ్రీనగర్‌ లాల్‌చౌక్‌లో జాతీయ జెండాను ఎగురవేయగలిగారని గుర్తు చేస్తూ, అసలు ప్రధానమంత్రికి ఉన్న సమస్య ఏమిటో తనకు అర్థం కాలేదని రాహుల్‌ అన్నారు. “జాతీయజెండాపట్ల తమకున్న ప్రేమాభిమానాలు తమ హృదయంలోంచి పుట్టాయని, వారిలో తాము ఆ చైతన్యం కల్పించిన తరువాత కశ్మీరీ ప్రజలు తమంతట తాముగా వేలాదిమంది జాతీయ త్రివర్ణ పతాకాలను చేబూని ఎగురవేశారని, అది కాంగ్రెస్‌పై తమకు ఉన్న ప్రేమాభిమానాలకు చిహ్నమని రాహుల్‌ ప్లీనరీ సభ్యుల హర్షధ్వానాలమధ్య అన్నారు.
కాంగ్రెస్‌ కార్యకర్తలకు పోరాడే
సత్తా ఉంది ః ప్రియాంకా గాంధీ

కాంగ్రెస్‌పార్టీ కార్యకర్తలకు పోరాడే సత్తా ఉందని ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంకాగాంధీ వాద్రా అన్నారు. లోక్‌సభ ఎన్నికలు దగ్గర పడుతున్నకొద్దీ ఐక్యత విషయంలో ప్రతిపక్షాల నుండి అంచనాలు పెరుగుతున్నాయని, ముఖ్యంగా కాంగ్రెస్‌పార్టీపైనే అందరూ ఎక్కువగా అంచనాలు పెట్టుకున్నారని అన్నారు. ప్లీనరీ సమావేశంలో మాట్లాడిన ప్రియాంకాగాంధీ అధికార బిజెపి ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల వద్దకు తీసుకువెళ్ళాలని, ఇంటింటి ప్రచారం చేయాలని కార్యకర్తలకు పిలుపు ఇచ్చారు. లోక్‌సభ ఎన్నికలకు ఇక మనకు కేవలం ఒకే ఒక్క ఏడాది గడువు ఉందని, బిజెపికి వ్యతిరేకంగా ఉన్న రాజకీయపార్టీలన్నీ అనివార్యంగా ఐక్య పోరాటం చేయాల్సిన అవసరం ఉందని అన్నారు. మనం అందరం ఐక్యం కావాల్సిన అవసరం ఉందని, ప్రతిపక్షం నుండి కాంగ్రెస్‌పై అంచనాలు ఆశలు ఉన్నాయని అన్నారు. కాంగ్రెస్‌ కార్యకర్తలకు పోరాట శక్తి ఉందని, సమయం వచ్చినప్పుడు ఆ పోరాట స్ఫూర్తి బయటకు వస్తుందని అన్నారు. మండలస్థాయి నుండి కాంగ్రెస్‌పార్టీని పటిష్టవంతం చేయడమే తమ లక్ష్యమని ప్రియాంకాగాంధీ అన్నారు.
సరికొత్త కాంగ్రెస్‌కు ఇది శ్రీకారం
మల్లికార్జున ఖర్గే

దేశంలో సరికొత్త కాంగ్రెస్‌కు ఇది శ్రీకారమని, ఇదొక ఆరంభమని కాంగ్రెస్‌పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అన్నారు. కాంగ్రెస్‌పార్టీ ఎన్నో సవాళ్ళు ఉన్నాయని, వాటన్నింటినీ కాంగ్రెస్‌ ఎదుర్కోగలదని, అయితే పార్టీకి ముఖ్యంగా కావాల్సింది క్రమశిక్షణ, ఐక్యత మాత్రమేనని అన్నారు. ప్లీనరీ ముగింపు సందర్భంగా ఆదివారం ఖర్గే సమావేశంలో మాట్లాడుతూ, ఈ సమావేశాలు ఇక్కడితో పూర్తికావచ్చుగానీ, ఒక సరికొత్త కాంగ్రెస్‌కు ఇది ఆరంభమని ఆయన అన్నారు. “ఈరోజు మన ముందు ఎన్నో సవాళ్ళు ఉన్నాయి, వాటన్నింటినీ కాంగ్రెస్‌ తప్ప ఎవ్వరూ ఎదుర్కోలేరు, వాటిని ఎదుర్కోవాలంటే ఐక్యత కావాలి, క్రమశిక్షణ ఉండాలి, కృతనిశ్చయం కావాలి, మన శక్తి మన పార్టీలోనే ఉంది” అని ఖర్గే అనారు. “మన ప్రవర్తన జాతీయస్థాయిలో, ప్రతి స్థాయీలోనూ కోట్లాదిమంది ప్రజలపై ప్రభావం చూపిస్తుంది, అంచనాలు మారిపోయాయి, కొత్త సవాళ్ళు రూపుదిద్దుకుంటున్నాయి, అందుకు అనుగుణంగా కొత్త మార్గాలను మనం కనుగొనాల్సి ఉంది, అందువల్ల రాజకీయమార్గంలో, సాంఘిక సేవా మార్గంలో అంతం అనేది ఉండదు, మనం అలా ప్రయాణిస్తూ వెళ్ళిపోవాలి, అనేక తరాలు మన వెంట ఇదే అడుగుజాడల్లో నడచవస్తాయి, ఆ దారి అలా కొనసాగుతూనే ఉంటుంది” అని ఖర్గే అన్నారు.

DO YOU LIKE THIS ARTICLE?
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments