ప్రజాపక్షం/ నిజామాబాద్ : నిజామాబాద్ జిల్లాలోని ఇందల్వాయి మండల కేంద్రంలో గురువారం రోడ్డు ప్రమాదం జరిగిం ది. ఓ కారు అదుపు తప్పి చెట్టుకు ఢీ కొట్టిం ది. ప్రమాదం జరిగిన సమయంలో కారులో ఆరుగురు వ్యక్తులు ఉన్నారు. ఈ ఘటనలో ముగ్గురు బిటెక్ విద్యార్థులు మృతిచెందగా, మరో ముగ్గురికి తీవ్ర గాయాలు కావడంతో నిజామాబాద్ ఆస్పత్రికి తరలించారు. మృతులను నిజామాబాద్ జిల్లాకు చెందిన గౌతమ్‌రెడ్డి, నిఖిల్, బాలకృష్ణగా గుర్తించారు. గాయపడినవారిలో నిజామాబాద్ జిల్లా కు చెందిన సాయి సాకేత్, హరీష్, శ్రవణ్‌లు ఉన్నారు. వీరంతా హైదరాబాద్‌లో చదవుకుంటున్నట్టుగా తెలుస్తోంది. హైదరాబాద్ నుంచి దర్పల్లికి వచ్చి పెళ్లి వేడుక చూసుకుని నిజామాబాద్ వైపు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది.
నిజామాబాద్ జిల్లాలో రోడ్డు ప్రమాదం ముగ్గురు మృతి
RELATED ARTICLES