భారతదేశ ప్రధాన భూభాగం చుట్టూ దాదాపు 1,500 కి.మీల దూరం నుంచి సేవలు
న్యూఢిల్లీ: భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో)లోని శాస్త్రవేత్తలు జిఎస్‌ఎల్‌వి రాకెట్లో నావిగేషన్ శాటిలైట్‌ను ప్రయోగించేందుకు 27.5 గంటల కౌంట్డౌన్‌ను ఆదివారం ఉదయం 7.12 గంటలకు ప్రారంభించారు. బెంగళూరు కేంద్రంగా ఉన్న అంతరిక్ష సంస్థ ఎన్‌ఎవి ఐసి (నావిగేషన్ విత్ ఇండియన్ కాన్‌స్టలేషన్) సేవల కొనసాగింపును నిర్ధారించే రెండవ తరం నావిగేషన్ శాటిలైట్ సిరీస్‌ను ప్రారంభించేందుకు ఇస్రో ప్రణాళికలను సిద్ధం చేసుకుంది. కాగా, ఈ ఉపగ్రహం భారతదేశ ప్రధాన భూభాగం చుట్టూ దాదాపు 1,500 కి.మీల దూరం నుంచి సేవలను అందిస్తుంది. 51.7 మీటర్ల పొడవైన జియోసింక్రోనస్ శాటిలైట్ లాంచ్ వెహికల్, దాని 15వ విమానంలో, 2,232 కిలోల బరువున్న నావిగేషన్ శాటిలైట్ ఎన్‌విఎస్-01ని కక్షలోకి పంపుతారు. ఈ ప్రయోగం జరిగిన దాదాపు 20 నిమిషాల తరువాత, రాకెట్ ఉపగ్రహాన్ని సుమారు 251 కి.మీ ఎత్తులో జియోసింక్రోనస్ ట్రాన్స్‌ఫర్ ఆర్బిట్ (జిటిఓ)లో ప్రవేశపెట్టనున్నట్టు ఇస్రో తెలిపింది. ఈ శాటిలైట్ పేలోడ్‌లో ఎల్ 1, ఎల్5, ఎస్ బ్యాండ్లు ఉంటాయి. గతంలో ప్రయోగించిన ఉపగ్రహాలతో పోలిస్తే, ఈ శాటిలైట్‌లో రెండవ తరం ఉపగ్రహ శ్రేణి దేశీయంగా అధివృద్ధి చేసిన రూబిడియం అటామిక్ క్లాక్ ఉంది.
నావిగేషన్ శాటిలైట్ ప్రయోగానికికౌంట్‌డౌన్ షురూ
RELATED ARTICLES