కరోనా వైరస్‌తో మరణించిన పంజాబ్‌కు చెందిన 70ఏళ్ల వృద్ధుడు
మార్చి 22 నుంచి అంతర్జాతీయ విమానాలపై భారత్ నిషేధం
న్యూఢిల్లీ: భారత్‌లో గురువారం 4వ కరోనా మృతి చోటుచేసుకుంది. కరోనా వైరస్ (కొవిడ్ కేసులు దేశంలో 173కు పెరిగింది. పాక్షిక మూసివేత (పార్షియల్ షట్‌డౌన్) దిశగా భారత్ అడుగులేస్తోంది. మార్చి 22 నుంచి వారంపాటు అన్ని అంతర్జాతీయ విమానాలపై నిషేధం కూడా విధించింది. పంజాబ్‌కు చెందిన 70ఏళ్ల వృద్ధుడు కరోనావైరస్‌తో చనిపోయాడని ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. అతడికి మధుమేహం, గుండెకు సంబంధించిన వ్యాధులు కూడా ఉండేవని తెలిపింది. చండీగఢ్, ఛత్తీస్‌గఢ్‌లో గత 24 గంటల్లో కొత్తగా 20 కొత్త కేసులు వెలుగుచూశాయి. భారత్‌లోని అన్ని ప్రాంతాలకు కరోనా విస్తరించింది. కశ్మీర్ అయితే దాదాపు మూసివేసిన స్థితి (వర్చువల్ షట్‌డౌన్)ని ఎదుర్కొంటోంది. శ్రీనగర్‌లో అధికారులు అన్ని ప్రజా రవాణాలు ఆపేశారు. ప్రజల రాకపోకలపై ఆంక్షలు విధించారు. పంజాబ్, ఢిల్లీ కూడా వర్చువల్ షట్‌డౌన్ స్థితిని ఎదుర్కొంటున్నాయి. శుక్రవారం అర్ధరాత్రి నుంచి ప్రజా రవాణా సేవలు రద్దు, 20 కంటే ఎక్కువ మంది సమావేశం కావొద్దన్న ఆంక్షలను పంజాబ్ విధించింది. మ్యారేజ్ హాళ్లు, హోటళ్లు, రెస్టారెంట్లు, బ్యాంక్వెట్లు వంటివి మూసేసింది. ఢిల్లీలో రెస్టారెంట్లను మూసేస్తున్నట్లు కేజ్రీవాల్ ప్రకటించారు. అయితే రాష్ట్రంలో హోమ్ డెలివరీ, టేక్ ఎవే వంటివి కొనసాగుతాయన్నారు. ఢిల్లీలో శుక్రవారం నుంచి అత్యవసరేతర ప్రభుత్వ సేవలను ఆపేస్తున్నట్లు గవర్నర్ అనిల్ బైజల్ తెలిపారు. ప్రైవేట్ రంగంలోని ఉద్యోగులు కూడా ఇంటి నుంచే పనిచేసుకునేలా చూడాలని, 65 ఏళ్లకుపైబడ్డ వారు ఇంటిపట్టునే ఉండేలా మార్గదర్శకాలను జారీచేయాలని కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలను కోరింది. ఇదే విధంగా 10 ఏళ్ల లోపు బాలలు కూడా ఇంటిపట్టునే ఉండేలా చూడాలంది. దేశంలో ఇప్పటివరకు కర్నాటక, ఢిల్లీ, మహారాష్ట్ర, పంజాబ్‌లో నాలుగు కరోనా మృతులు వెలుగుచూశాయి. మహారాష్ట్రలో 45, కేరళలో 27, హర్యానాలో 17, ఢిల్లీలో 12, కర్నాటకలో 14, లడఖ్‌లో 8, జమ్మూకశ్మీర్‌లో 4, తెలంగాణలో 6, రాజస్థాన్‌లో 7, తమిళనాడులో 2, ఆంధ్ర ప్రదేశ్, ఒడిశా, ఉత్తరాఖండ్, పశ్చిమబెంగాల్, పుదుచ్చేరి, చండీగఢ్, పంజాబ్‌లలో ఒక్కో కేసు వెలుగుచూశాయి.