8 వికెట్లతో సౌతాఫ్రికా ఓటమి, 2 సిరీస్ సమం
జొహన్నెస్‌బర్గ్: సౌతాఫ్రికాతో జరిగిన నాలుగో వన్డేలో పాకిస్థాన్ 8 వికెట్లతో జయభేరీ మోగించింది. దీంతో ఐదు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ను పాక్ 2 సమం చేసింది. ఆదివారం జరిగిన కీలక మ్యాచ్‌లో పాక్ బౌలర్లు అద్భుతంగా రాణించారు. తొలుత బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికాను 164 పరుగులకే కుప్పకూల్చారు. పాక్ బౌలర్ ఉస్మాన్ శిన్వారీ (4/35) విజృంభించడంతో సఫారీ జట్టు తక్కువ స్కోరుకే కట్టడి అయింది. అనంతరం లక్ష్యఛేదనలో పాక్ కేవలం రెండు వికెట్లు కోల్పోయి మరో 111 బంతులు మిగిలుండగానే భారీ విజయాన్ని అందుకుంది. స్వల్ప ల క్ష్యంతో బ్యాటింగ్‌కు దిగిన పాక్‌కు ఓపెనర్లు శుభారంభాన్నిచ్చారు. వీ రు తొలి వికెట్‌కు 70 పరుగులు జోడించారు. అనంతరం దూకుడుగా ఆ డుతున్న ఫకర్ జమాన్ (44) ఔటయ్యాడు. తర్వాత మరో ఓపెనర్ ఇ మామ్ ఉల్ హక్, బాబార్ ఆజమ్ ధాటిగా ఆడుతూ పాక్‌ను విజయానికి చేరువచేశారు. చివర్లో కీలక ఇన్నింగ్స్ ఆడిన ఇమామ్ ఉల్ హక్ (91 బం తుల్లో 71) పరుగులు చేసి వెనుదిరిగాడు. ఇక మిగిలిన స్వల్ప లక్ష్యాన్ని బాబార్ ఆజమ్ (41 నాటౌట్) అజేయంగా ఉండి పూర్తి చేశాడు. దీంతో పాక్ 31.3 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 168 పరుగులు చేసి సునాయాస విజయం సాధించింది. అంతకుముందు బ్యాటింగ్ చేసిన సఫారీ జట్టుపై పాక్ బౌలర్లు విరుచుకుపడ్డారు. దీంతో సౌతాఫ్రికా జట్టు ఆరంభంలోనే వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. తర్వాత హాషిమ్ ఆమ్లా (59), కెప్టెన్ డుప్లెసీస్ (57) అర్ధ శతకాలతో తమ జట్టును ఆదుకునే ప్రయత్నం చేశారు. కానీ పాక్ బౌలర్లు ధాటికి వీరు కూడా వెనుదిరిగారు. తర్వాత మరింతగా పుంజుకున్న పాక్ బౌలర్లు వరుసక్రమాల్లో వికెట్లు తీస్తూ సఫారీ జట్టును 41 ఓవర్లలో 164 పరుగులకే ఆలౌట్ చేశారు. చెలరేగి బౌలింగ్ చేసిన ఉస్మాన్ శిన్వారీ నాలుగు వికెట్లు పడగొట్టగా.. షహీన్ అఫ్రిదీ, షాదాబ్ ఖాన్ చెరో వికెట్లు దక్కించుకున్నారు. ఉస్మాన్‌కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది.
నాలుగో వన్డేలో పాక్ జయభేరీ
RELATED ARTICLES