ప్రభుత్వాన్ని ప్రశ్నించిన హైకోర్టు
13 లోపు సమర్పించకుంటే కమిటీ రద్దు చేస్తాం
కోకాపేట భూముల వేలం వ్యవహారంలో జిఒ 111పై విచారణ
ప్రజాపక్షం/హైదరాబాద్ జిఒ 111 విషయంలో 2016లో సర్కార్ నియమించిన హైపవర్ కమిటీ సెప్టెంబర్ 13 నాటికి ప్రభుత్వానికి రిపోర్టు ఇవ్వాలని, ఆ రిపోర్టుపై సెప్టెంబర్ నెలాఖరులోగా ఎందుకు ఇవ్వడం లేదని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ హిమా కోహ్లి, జస్టిస్ విజయ్‌సేన్ రెడ్డి ధర్మాసనం రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. కరోనా, తదితర కారణాలతో ఆలస్యమైందని ప్రభుత్వం తరఫున అదనపు ఎజి రామచంద్రరావు సమాధానమిచ్చారు. అనంతరం హైకోర్టు స్పందిస్తూ సెప్టెంబర్ 13లోపు ఉన్నతస్థాయి కమిటీ నివేదిక సమర్పించాలని ఆదేశించింది. నివేదిక సమర్పించకపోతే ఆరోజుతో కమిటీ రద్దు చేస్తామని హెచ్చరించింది. ఇపిటిఆర్‌ఐ నివేదికపై కూడా అభిప్రాయాలు తెలపాలని కమిటీకి ఉన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. నివేదికను వెబ్‌సైట్‌లో పెట్టాలని కమిటీని హైకోర్టు ఆదేశించింది. అనంతరం తదుపరి విచారణను అక్టోబర్ 4కి వాయిదా వేసింది.
నాలుగేళ్లు దాటినా నివేదికివ్వరా?
RELATED ARTICLES