నాథన్ లియాన్
మెల్‌బోర్న్: టెస్ట్ ఫార్మాట్‌కు ఆదరణ పెంచేందుకు దేశవాళీ తరహాలోనే టెస్టులను నాలుగు రోజులకు పరిమితి చేసే ఆలోచనలో ఐసీసీ ఉందని వార్తలపై ఆస్ట్రేలియా ఆఫ్ స్పిన్నర్ నాథన్ లియోన్ స్పందించాడు. మీరు ప్రపంచంలోని అన్ని పెద్ద ఆటలను, కొన్ని ఉత్తమ టెస్ట్ మ్యాచ్‌లను చూస్తే అవి చివరి రోజు వరకు ఆడటం జరిగిందని నాథన్ లియోన్ క్రికెట్ ఆస్ట్రేలియా వెబ్‌సైట్‌కి ఇచ్చిన ఇంటర్యూలో అన్నాడు. ‘2014లో అడిల్్ైడ వేదికగా ఇండియాతో జరిగిన టెస్టు గనుక చూస్తే ఐదో రోజు చివరి అరగంట వరకు జరిగింది. ఇక, అదే ఏడాది కేప్‌టౌన్ వేదికగా జరిగిన టెస్టు మ్యాచ్‌లో మరో రెండు ఓవర్లు మిగిలి ఉన్న సమయంలో సఫారీ బ్యాట్స్‌మన్ మోర్న్ మోర్కెల్‌ను రేయాన్ హ్యారిస్ బౌల్డ్ చేశాడు. ఇది కూడా ఐదో రోజు చివరి 10 నిమిషాల వరకు సాగింది‘ అని అన్నాడు. ‘నాలుగు రోజుల టెస్టు మ్యాచ్‌లకు నేను ఫ్యాన్‌ని కాదు. ఐదో రోజు ఎంతో కీలకం… ఇక్కడ ఆఖరి రోజున మీరు చాలా ఎక్కువ డ్రాలు చేస్తారని నేను నమ్ముతున్నాను. ఇందులో ఒకటి వాతావరణం. గతంతో పోలిస్తే ఈ రోజుల్లో వికెట్లు చాలా ప్లాట్‌గా ఉంటాయి. ఫలితంగా జట్లు ఎక్కువసేపు బ్యాటింగ్ చేయడానికి అనుకూలం‘ అని లియోన్ చెప్పుకొచ్చాడు. ‘మరోవైపు ఒత్తిడి తెచ్చేలా చేస్తుంది. పిచ్ క్షీణించి స్పిన్నర్లకు అనుకూలంగా మారేందుకు గాను ఐదో రోజు అవసరం. దీనికి నేను పూర్తిగా వ్యతిరేకం. ఐసీసీ కూడా దీనిని పరిగణనలోకి తీసుకోలేదని నేను నమ్ముతున్నాను. ఐదు రోజుల టెస్టు అనేది ఓ ఛాలెంజ్. మీరు మిమ్మల్ని వివిధ మార్గాల్లో సవాల్ చేస్తారు – శారీరకంగా, మానసికంగా‘ అని నాథన్ లియోన్ అన్నాడు.
అసలేం జరుగుతుంది?
సంప్రదాయ క్రికెట్‌పై అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) సంచలన నిర్ణయం తీసుకునేందుకు కసరత్తు చేస్తోంది. టెస్టులను నాలుగు రోజులకు పరిమితి చేసే ఆలోచనలో ఐసీసీ ఉంది. 2023 షె డ్యూల్ నుంచి ఈ మార్పులు చేయనుంది. దీంతో బిజీగా ఉండే అంతర్జాతీయ క్రికెట్ షెడ్యూల్‌లో ఆయా బోర్డులకు విరామం దొరుకుతుంది. ఈ సమయంలో మరిన్ని గ్లోబల్ ఈవెంట్స్ నిర్వహణకు వీలవుతుందని ఐసీసీ ఆలోచన. 2023లో ముగియనున్న ప్రస్తుత భవిష్యత్ పర్యటనల ప్రణాళిక (ఎఫ్‌టీపీ) అనంతరం నాలుగు రోజుల మ్యాచ్‌లు అమల్లోకి వచ్చే అవకాశముంది. కాగా, అంతర్జాతీయ క్రికెట్‌లో నాలుగు రోజుల టెస్టులు కొత్తేం కాదు. ఇప్పటికే ఇలాంటి మ్యాచ్‌లు ఇంగ్లండ్-ఐర్లాండ్, దక్షిణాఫ్రికా-జింబాబ్వే మధ్య జరిగాయి.
నాలుగు రోజుల టెస్టుకు మేం వ్యతిరేకం
RELATED ARTICLES