ప్రజాపక్షం / హైదరాబాద్ : అసెంబ్లీ నామినేటెడ్ సభ్యుడిగా క్రిస్టియన్ మతానికి చెందిన ఆంగ్లో ఇండియన్ ఎల్విస్ స్టీఫెన్‌సన్‌ను మరోసారి నియమించాలని సోమవారం జరిగిన కేబినెట్ నిర్ణయించింది. దీనికి సంబంధించి గవర్నర్‌కు ప్రతిపాదనలు పంపింది. మంత్రివర్గ సమావేశం ముఖ్యమం త్రి కె.చంద్రశేఖర్ రావు అధ్యక్షతన ప్రగతి భవన్ లో సోమవారం జరిగింది. చరిత్రలో గతంలో ఎన్నడూ లేని విధంగా ఇతర సభ్యులతో పాటుగానే ప్రమాణ స్వీకారం చేయడానికి వీలుగా అసెంబ్లీలో నామినేటెడ్ సభ్యుడి నియామకం జరపాలని నిర్ణయించారు. సాధారణంగా నామినేటెడ్ సభ్యుడి నియామకంలో జాప్యం జరుగుతుంది. దీనివల్ల నామినేటెడ్ మెంబర్ ఇతర సభ్యులతో కలిసి ప్రమాణ స్వీకారం చేయడం సాధ్యపడదు. ఫలితంగా విలువైన పదవీ కాలాన్ని కోల్పోతారు. ఈ సమస్యను నివారించడానికి తెలంగాణ ప్రభుత్వం తన మొదటి కేబినెట్ సమావేశంలోనే అసెంబ్లీలో నామినేటెడ్ సభ్యుడి నియామకానికి నిర్ణ యం తీసుకుంది. తెలంగాణలో గంగా జమునా తహజీబ్‌ను కొనసాగించడానికి ప్రభుత్వం అసెంబ్లీకి సంబంధించిన వ్యవహారాల్లో నిర్ణయాలు తీసుకుంటున్నది. ప్రొటెం స్పీకర్‌గా ముస్లిం వర్గానికి చెం దిన ముంతాజ్ అహ్మద్ ఖాన్‌ను నియమించింది. చట్టసభల్లో ఆంగ్లో ఇండియన్ల ప్రాతినిధ్యం ఉండాలనే రాజ్యాంగ నిబంధన మేరకు తెలంగాణ అసెంబ్లీలో ఈ నియామకానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంది.
నామినేటెడ్ ఎంఎల్‌ఎగా స్టీఫెన్‌సన్
RELATED ARTICLES