సెమీస్‌లో పౌలీపై నొవాక్ గెలుపు, ఆస్ట్రేలియా ఓపెన్ టెన్నిస్
మెల్‌బోర్న్: ప్రతిష్టాత్మక గ్రాండ్‌శ్లామ్ ఆస్ట్రేలియా ఓపెన్ టెన్నిస్ టోర్నీ ఫైనల్లో టాప్ సీడ్ జొకోవిచ్ దూసుకెళ్లాడు. ఈ విజయంతో జొకోవిచ్ తన చిరకాల ప్రత్యర్థి రాఫెల్ నాదల్‌తో అమీతుమీకి సిద్ధమయ్యాడు. వీరిద్దరి మధ్య ఆదివారం టైటిల్ పోరు జరగనుంది. శుక్రవారం ఇక్కడ జరిగిన పురుషుల సింగిల్స్ రెండో సెమీఫైనల్లో టాప్ సీడ్ సెర్బియా స్టార్ నొవాక్ జొకోవిచ్ 6 6 6 తేడాతో 28వ సీడ్ ఫ్రాన్స్ ఆటగాడు లుకాస్ పౌలీపై ఘన విజయం సాధించి ఫైనల్లో అడుగుపెట్టాడు. గత ఏడాది చివరి రెండు గ్రాండ్‌శ్లామ్‌లు (వింబుల్డన్, యూఎస్ ఓపెన్) టోర్నీలను గెలుచుకున్న జొకోవిచ్ తాజాగా ఈ ఏడాది జరుగుతున్న తొలి ప్రతిష్టాత్మక టోర్నీ ఆస్ట్రేలియా ఓపెన్ ఫైనల్లో దూసుకెళ్లాడు. అంతకుముందు గురువారం జరిగిన పురుషుల తొలి సెమీస్‌లో రెండో సీడ్ స్పెయిన్ బుల్ నాదల్ గ్రీస్ యువ సంచలనం సిట్సిసాస్‌ను చిత్తు చేసి ఫైనల్ బెర్త్ ఖాయం చేసుకున్న విషయం తెలిసిందే. నాదల్ గత ఏడాది ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్ గెలుచుకున్నాడు. శుక్రవారం ఇక్కడ జరిగిన పురుషుల సింగిల్స్ సెమీఫైనల్లో టాప్ సీడ్ జొకోవిచ్ ఆరంభం నుంచే దూకుడుగా ఆడాడు. ఫ్రాన్స్ ప్రత్యర్థిపై పూర్తి ఆధిపత్యం చెలాయించి మ్యాచ్‌ను ఏకపక్షంగా కైవసం చేసుకున్నాడు. ఈ మ్యాచ్‌ను జొకోవిచ్ 1 గంట 23 నిమిషాల్లోనే ముగించాడు. ఇక శనివార ం జరిగే మహిళల సింగిల్స్ ఫైనల్లో నాలుగో సీడ్ ఒసాకా (జపాన్), పెట్రా క్విటోవా (చెక్ రిపబ్లిక్) తలపడనున్నారు.
సమంత స్టోసర్ జోడీకి డబుల్స్ టైటిల్..
సమంత స్టోసర్ (ఆస్ట్రేలియా), శుయ్ జాంగ్ (చైనా) జోడీ మహిళల డబు ల్స్ టైటిల్‌ను గెలుచుకుంది. శుక్రవా రం జరిగిన ఫైనల్స్‌లో సమంత స్టో సర్ (ఆస్ట్రేలియా), శుయ్ జాంగ్ (చై నా) దయం 6 6 తేడాతో రెండో సీడ్ టిమియ బాబొస్ (హంగేరి), క్రిస్టియాన (ఫ్రాన్స్) జంటను వరుస సెట్లలో ఓడించి టైటిల్ కైవసం చేసుకుంది.
నాదల్ X జొకోవిచ్
RELATED ARTICLES