HomeNewsBreaking News‘నాటు అంతర్జాతీయ గోల్డెన్‌ గ్లోబ్‌ పురస్కారం

‘నాటు అంతర్జాతీయ గోల్డెన్‌ గ్లోబ్‌ పురస్కారం

న్యూఢిల్లీ: టాలీవుడ్‌ జక్కన్న రాజమౌళి దర్శకత్వంలో గత ఏడాది ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమా మరో అంతర్జాతీయ పురస్కారాన్ని సొంతం చేసుకుంది. ఆస్కార్‌ తర్వాత అ త్యంత గౌరవప్రదమైన అంతర్జాతీయ పురస్కారం గా పేరు దక్కించుకున్న గోల్డెన్‌ గ్లోబ్‌ అవార్డు వేడుకలో మన కీరవాణి స్వరపరిచిన నాటు నాటు సాం గ్‌కి బెస్ట్‌ ఒరిజినల్‌ స్కోర్‌ అవార్డు సొంతమయిం ది. దక్కడమే గొప్ప విషయం అనుకుంటే ఏకంగా గోల్డెన్‌ గ్లోబ్‌ అవార్డు దక్కడం అద్భుతం అన్నట్లుగా సినీ ప్రేక్షకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అంతర్జాతీయ వేదికపై మరోసారి మన నాటు నాటు సాంగ్‌ రికార్డు సృష్టించింది. టాలీవుడ్‌ జక్కన్న సృష్టించిన ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమాలో వచ్చే ఇద్దరు హీరోల సాంగ్‌ నాటు నాటుకి ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. స్థాయి థియేటర్స్‌లో స్క్రీనింగ్‌ అయిన సమయంలో నాటు నాటు సాంగ్‌ వచ్చినప్పుడు విదేశీయులు డాన్స్‌ చేసిన సంగతి తెలిసిందే. అవార్డు దక్క డం పట్ల కీరవాణి సంతోషం వ్యక్తం చేశారు. ‘నాటు అవార్డు వచ్చిందంటూ ప్రకటించిన వెంటనే రాజమౌళితో పాటు ఎన్‌టిఆర్‌ చరణ్‌ అంతా కూడా చప్పట్లు కొడుతూ సందడి చేశారు. అవార్డు తీసుకున్న తర్వాత కీరవాణి మాట్లాడుతూ.. గోల్డెన్‌ గ్లోబ్‌ అవార్డు అందుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఈ సంతోష సమయాన్ని నా సతీమణితో పంచుకోవడం మరింత ఆనందంగా ఉంది. నా సోదరుడు రాజమౌళి అవార్డు దక్కాలి.ఈ పాటలో భాగస్వామ్యమైన రాహుల్‌ సిప్లిగంజ్‌కి ధన్యవాదాలు. నాకు మద్దతు ఇచ్చిన వారందరికీ కూడా కృతజ్ఞతలు. ఈ పాట విషయంలో నా కుమారుడు కాలభైరవ కూడా అద్భుతమైన సహకారం అందించడానికి పేర్కొన్నారు. కీరవాణి పురస్కారం పొందడం పట్ల తెలుగు మరియు ఇండియన్‌ సినీ ప్రముఖులు శుభాకాంక్షలు తెలియజేశారు.
‘ఆర్‌ఆర్‌ఆర్‌’కు ప్రధాని ప్రశంస
ఆర్‌ఆర్‌ఆర్‌ చిత్రబృందంపై ప్రధాని నరేంద్ర మోడీ ప్రశంసల వర్షం కురిపించారు. చలన చిత్ర రంగంలో ప్రతిష్ఠాత్మకంగా భావించే గోల్డెన్‌ గ్లోబ్‌ అవార్డును ఈ చిత్రం సొంతం చేసుకోవడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు. చిత్ర బృందానికి అభినందనలు తెలుపుతూ తాజాగా ప్రధాని ట్వీట్‌ చేశారు. ‘ఇదొక విశేషమైన విజయం!! కీరవాణి, ప్రేమ్‌ రక్షిత్‌, కాలభైరవ, చంద్రబోస్‌ తోపాటు రాజమౌళి, ఎన్‌టిఆర్‌, రామ్‌ చరణ్‌, ఇతర చిత్రబృందానికి నా అభినందనలు. ఈ ప్రతిష్ఠాత్మక విజయంతో ప్రతి ఒక్క భారతీయుడు గర్వపడేలా చేశారు’ అని ఆయన పేర్కొన్నారు. మరోవైపు ప్రముఖ పారిశ్రామిక వేత్త ఆనంద్‌ మహీంద్రా సైతం ఆర్‌ఆర్‌ఆర్‌ టీమ్‌కు శుభాకాంక్షలు చెప్పారు.

DO YOU LIKE THIS ARTICLE?
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments