ఐదో రోజుకు చేరిని నిరాహార దీక్ష
అహ్మద్‌నగర్-పుణె హైవేను దిగ్భందించిన సుప గ్రామస్థులు
న్యూఢిల్లీ: అవినీతిపై పోరాటం చేస్తున్న తనకు ఏమైనా అయితే ప్రధానమంత్రి నరేంద్రమోడీదే పూర్తి బాధ్యత వహించాల్సి ఉంటుందని సామాజిక ఉద్యమకారుడు అన్నా హజారే అన్నారు. ఈ విషయంలో ప్రధానిని ప్రజలు నిలదీస్తారని ఆయన ఉద్ఘాటించారు. జనవరి 30న మహారాష్ట్రలోని రాలేగావ్ సిద్ధిలో ‘జన్ ఆందోళన్ సత్యాగ్రహ’ పేరుతో లోక్‌పాల్, లోకాయుక్తలను నియామకాల్ని వెంటనే చెపట్టాలని హజారే నిరాహార దీక్ష చేపట్టారు. అయితే ఈ నిరాహార దీక్ష ఇప్పటికే ఐదో రోజుకు చేరుకుంది. ఆయనకు మద్దతుగా పర్నర్ తహసిల్‌లోని సుప గ్రామంలో గ్రామీణులు మహారాష్ట్రలోని అహ్మద్‌నగర్-పుణె హైవేను దిగ్భందించారు. దిగ్భంధాన్ని చెదరగొట్టేందుకు పోలీసులు 110 మంది నిరసనకారులను అదుపులోకి తీసుకున్నారు. అయితే తర్వాత వారిని మందలించి వదిలేశారు.
అన్నా హజారే ఈ సందర్భంగా మాట్లాడుతూ ‘దేశంలో నెలకొన్న ప్రతికూల పరిస్థితులకు వ్యతిరేకంగా పోరాడిన వ్యక్తిగా ప్రజలు నన్ను గుర్తుంచుకుంటారేగానీ.. అగ్నికి ఆజ్యం పోసిన నేతగా కాదు. నాకేమైనా జరిగితే ప్రజలు ప్రధాని మోడీని నిలదీస్తారు. లోక్‌పాల్ ఏర్పడితే సరైనా ఆధారాలు ఉంటే ప్రధానిని సైతం విచారించవచ్చు. ముఖ్యమంత్రి, మంత్రులు, ఎంఎల్ఎలకు వ్యతిరేకంగా ఎవరైనా ఆధారాలు చూపిస్తే వారిని సైతం లోకాయుక్త ద్వారా విచారించవచ్చు. అందువల్లే పార్టీలు ఈ వ్యవస్థను అమలులోకి తీసుకురావడానికి వెనకాడుతున్నాయి’ అన్నారు.
నాకేమైనా అయితే ప్రధానిదే బాధ్యత
RELATED ARTICLES