పెంచిన పెన్షన్లు జూన్ నుంచే అమల్లోకి
ఆగస్టు 15 నాటికి 4 లక్షల ఉద్యోగాలు
అక్టోబరు 2 కల్లా మరో 1.60 లక్షల కొలువులు
జ్యుడిషియల్ అనుమతితో కాంట్రాక్టులు అప్పగిస్తాం
ఆంధ్రద్రేశ్ సిఎంగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. “వైఎస్ జగన్ అను నేను మీ అందరికీ ఒకే మాట చెబుతున్నా.. నేను ఉన్నానని గట్టిగా చెబుతున్నా. ఆకాశమంతటి విజయాన్ని అందించిన మీ అందరికీ కృతజ్ఞతలు. పదేళ్లుగా నా రాజకీయ జీవితంలో 3,648 కి.మీ పాదయాత్ర చేశా. పాదయాత్రలో పేదలు పడిన కష్టాలు చూశా’ అని చెప్పారు. వృద్ధాప్య పింఛను రూ.3వేలకు పెంచుతామని హామీ ఇచ్చానిచ్చామని, మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు వృద్ధులకు జూన్ నెల నుంచి రూ.2,250 ఫించను ఇస్తాం, వచ్చే ఏడాది రూ.2,500, ఆతర్వాత ఏడాది రూ.2750, ఆ ఎపి సిఎంగా తొలి సంతకం చేశారు.
నాలుగు లక్షల ఉద్యోగాలు..
‘ఆగస్టు 15 నాటికి గ్రామాల్లో వలంటీర్లుగా నాలుగు లక్షల మంది యువతకు ఉద్యోగవకాశం కల్పిస్తాం. ప్రతి 50 ఇళ్లకు ఒక గ్రామ వలంటీర్‌ను నియమిస్తాం. గ్రామాలలో చదువుకున్న పిల్లలు.. సేవ చేయాలన్న ఆరాటం ఉన్న వారిని రూ.5వేల వేతనంతో వలంటీరుగా నియమిస్తాం. ప్రభుత్వ పథకాల్లో అవీనితి పారదోలేందుకు వలంటీర్లను నియమిస్తాం. వారికి మెరుగైన ఉద్యోగం వచ్చే వరకూ పనిచేయవచ్చు. గ్రామ సచివాలయం ద్వారా అక్టోబర్ 2 గాంధీ జయంతి నాటికి మరో లక్షా 60వేల ఉద్యోగాలు కల్పిస్తాం. ప్రభుత్వ సేవలు ఎవరికి అందకపోయినా, లంచాలు కనిపించినా కాల్ సెంటర్ ద్వారా నేరుగా సిఎం ఆఫీసుకు ఫిర్యాదు చేయవచ్చు. సిఎం ఆఫీసు నంబరు మీ అందరికీ అందుబాటులో ఉంటుంది. పరిపాలనలో విప్లవాత్మక మార్పులు తెచ్చేందుకు గ్రామ సచివాలయాలను తీసుకొస్తున్నాం. నవరత్నాల్లో ఏ పథకం కావాలన్నా నేరుగా గ్రామ సచివాలయానికి వెళ్లి దరఖాస్తు చేసుకుంటే 72 గంటల్లో పరిష్కరిస్తాం. అవినీతికి ఆస్కారం లేకుండా ప్రభుత్వ పథకాలను అందిస్తాం. నవరత్నాల్లో ప్రతి ఒక్కటి తూ.చ తప్పకుండా అమలు చేస్తాం’ అని వివరించారు.