HomeNewsBreaking Newsనవజోత్‌ సింగ్‌ సిద్ధూకు ఏడాది జైలు

నవజోత్‌ సింగ్‌ సిద్ధూకు ఏడాది జైలు

రివ్యూ పిటిషన్‌పై సుప్రీం తీర్పు
న్యూఢిల్లీ : నడిరోడ్డుపై ఒక పౌరుడితో ఘర్షణ పెట్టుకుని అతడి మరణానికి కారకుడైన మాజీ క్రికెటర్‌, పంజాబ్‌ కాంగ్రెస్‌పార్టీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు నవజోత్‌సింగ్‌ సిద్ధూకు సుప్రీంకోర్టు గురువారంనాడు ఏడాది జైలు శిక్ష విధించింది. 1988 డిసెంబరు 27న పటియాలాలలో సిద్దూ తన జిప్సీ వాహనాన్ని రోడ్డుకు అడ్డంగా పార్కుచేసి కూర్చున్నాడు. అటుగా బ్యాంకు లో డబ్బు విత్‌ డ్రా చేసే పనిమీద అర్జంటుగా మారుతీకారులో వెళుతున్న గుర్నామ్‌ సింగ్‌ (65) అనే పౌరుడు షెరన్‌వాలా గేట్‌ క్రాసింగ్‌ వద్ద అడ్డంగా ఉన్న సిద్ధూ వాహనాన్ని అడ్డుతీయమని అడిగాడు. దాంతో సిద్ధూ ఆగ్రహించి అతడితో ఘర్షణకు దిగాడు. అతడిపై సిద్ధూ దాడి చేశాడు. ఈ ఘటనలో ఆ తరువాత గుర్నామ్‌ సింగ్‌ మరణించాడు. 1999 సెప్టెంబరులో ట్రయల్‌ కోర్డు విచారణలో సిద్ధూ, అతడి స్నేహితుడు నిర్దోషిగా విడుదలయ్యారు. కానీ 2006లో పంజాబ్‌ హైకోర్టు వారిద్దరికీ మూడేళ్ళు జైలుశిక్ష, ఇద్దరికీ చెరో లక్షరూపాయలు జరిమానా విధిస్తూ తీర్పు ఇచ్చింది. ఈ తీర్పును సిద్ధూ, అతడి స్నేహితుడు రూపిందర్‌ సింగ్‌ సంధూ సుప్రీంకోర్టులో సవాలు చేశారు. 2018 మే 15న సుప్రీంకోర్టు పంజాబ్‌ హైకోర్టు విధించిన శిక్షను పక్కకునెట్టింది. సిద్ధూతోపాటు ఆరోజు సిద్ధూ వెంట ఉన్న అతడి స్నేహితుడు రూపిందర్‌ సింగ్‌ కూడా అక్కడ ఉన్నారనడానికి నమ్మదగిన సాక్ష్యాలు లేవంటూ వారిద్దరినీ సుప్రీంకోర్టు రూ.1,000 లు జరిమానా వేసి వదిలేసింది. అయితే గుర్నామ్‌ సింగ్‌ కుటుంబం తమకు తీరని అన్యాయం జరిగిందని, నేరస్తుణ్ణి సర్వోన్నత న్యాయస్థానం వదిలలేసిందని తీవ్ర ఆవేదనకు గురైంది. తరువాత ఈ కేసులో గుర్నామ్‌సింగ్‌ కుటుంబీకులు సుప్రీంకోర్టులో 2018 సెప్టెంబరులో రివ్యూ పిటిషన్‌ దాఖలు చేయగా, ఈ కేసు పునః విచారణకు సుప్రీంకోర్టు అంగీకరించి సిద్ధూ నేరస్తుడా? కాదా? అనే విషయంపై ఈసారి పలు కోణాల్లో కేసు విచారణ జరిపి సిద్ధూ నేరస్తుడే అని సుప్రీంకోర్టు తేల్చింది. దీంతో గురువారంనాడు సిద్ధూకు ఏడాది జైలు శిక్ష పడింది. జస్టిస్‌ ఎ.ఎం.ఖన్విల్కర్‌, జస్టిస్‌ ఎస్‌.కె.కౌల్‌లతో కూడిన ధర్మాసనం ఈ రివ్యూ పిటిషన్‌ను క్షుణ్ణంగా పరిశీలించి విచారణ జరిపింది. 2018 మే నెలలో సిద్ధూ 65 ఏళ్ళ వృద్ధుడు గాయపడటానికి కారకుడయ్యాడని పేర్కొంటూ వెయ్యిరూపాయలు జరిమానాతో వదిలేసింది. అయితే అదే ఏడాది సెప్టెంబలో బాధితుడు గుర్నామ్‌ సింగ్‌ కుటుంబీకులు మరోసారి సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్‌ దాఖలు చేసి న్యాయం కోరడంతో వారికి ఈ సారి న్యాయం జరిగింది. “అప్పట్లో కేసు రికార్డు చేసే సమయంలో ఏదో తప్పు జరిగిందని మేం భావిస్తున్నాం,అందువల్ల మరోసారి ఈ రివ్యూ పిటిషన్‌కు అనుమతించాం, అప్పట్లో జరిమానాతో వదిలేశాం, ఇప్పుడు జరిమానాతోపాటు ఏడాది జైలు శిక్ష కూడా విధిస్తున్నాం” అని ధర్మాసనం పేర్కొంది. తొలుత రివ్యూ పిటిషన్‌పై తన అభిప్రాయం ఏమిటో తెలియజేయాలని సిద్ధూను సుప్రీంకోర్టు కోరింది. కేవలం ఒక్క దెబ్బ కొట్టినంతమాత్రాన మనిషి చనిపోతాడనడానికి ఆధారాలు లేవని సిద్ధూ 2018 మార్చినెలలో తన సమాధానంగా చెప్పారు.అయితే అసలు ఆ సంఘటనే జరగలేదని ఆనాడు సిద్ధూ పేర్కొన్నాడు.

DO YOU LIKE THIS ARTICLE?
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments