ఛత్తీస్‌గఢ్ సుక్మా జిల్లాలో ఎన్కౌంటర్
రాయ్‌పూర్: ఛత్తీస్‌గఢ్‌లోని సుక్మా జిల్లాలో బుధవారం ఉదయం భద్రతా దళాలతో జరిగిన ఎన్కౌంటర్లో నలుగురు మావోయిస్టులు మృతి చెందారని పోలీసులు తెలిపారు. ఉద యం 9.30 గంటల సమయంలో జాగర్గుండ పోలీస్ స్టేషన్ పరిధిలోని అడవిలో వివిధ భద్రతా దళాల సంయుక్త బృందాలు నక్సల్ వ్యతిరేక ఆపరేషన్ కోసం బయలుదేరినప్పుడు ఎన్కౌంటర్ చోటుచేసుకుందని ఐజి (బస్తర్ రేంజ్) సుందర్రాజ్.పి చెప్పారు. జాగర్గుండలోని మారుమూల ప్రాంతాల్లో మావోయిస్టులు సంచారిస్తున్నారన్న సమాచారం మేరకు జిల్లా రిజర్వ్ గార్డ్ (డిఆర్జి), సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (సిఆర్పిఎఫ్), దాని ఎలైట్ యూనిట్ కమాండో బెటాలియన్ ఫర్ రిజల్యూట్ యాక్షన్ (కోబ్రా) సహా వివిధ భద్రతా దళాల ఉమ్మడి బృందాలు వారి కోసం గాలింపు చేపట్టాయన్నారు. రాష్ట్ర రాజధాని రాయ్‌పూర్‌కు 450 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఫులాంపర్ గ్రామానికి సమీపంలో ఉన్న అడవిలో బృందాలు పెట్రోలింగ్ చేస్తుండగా ఇరువర్గాల మధ్య ఎదురుకాల్పులు జరిగాయన్నారు. కాల్పులు ఆగిన తరువాత, నలుగురు పురుష మావోయిస్టుల మృతదేహాలను. .303 రైఫిల్, దేశీయంగా తయారుచేసిన ఆయుధాలు, పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకున్నారన్నారు. నక్సల్స్ కోసం గాలింపు చర్యలు ఇంకా కొనసాగుతున్నాయన్నారు.
నలుగురు మావోయిస్టులు మృతి
RELATED ARTICLES