ఛత్తీస్‌గఢ్ రాజనందగాన్ జిల్లాలో ఎదురు కాల్పులు
ఆయుధాలు స్వాధీనం
ఒక సబ్ ఇన్‌స్పెక్టర్ మృతి
ప్రజాపక్షం/ భద్రాచలం : ఛత్తీస్‌గఢ్‌లో మరోసారి తుపాకుల మోత వినిపించింది. రాజనందగాన్ జిల్లాలో పోలీసులు, నక్సల్స్‌కు మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. ఈ ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు మహిళలు సహా అనే క కేసుల్లో నిందితులుగా ఉండి పోలీసులు గాలిస్తున్న నలుగురు నక్సల్స్ హతమయ్యారు. వీరందరి తలలపై రివార్డులు కూడా ఉన్నాయి. ఎదురు కాల్పుల్లో ఓ పోలీసు అధికారి కూడా ప్రాణాలు కోల్పోయినట్లు పోలీసులు పేర్కొన్నారు. ఎన్‌కౌంటర్‌లో నలుగురు మావోయిస్టులను ముట్టుబెట్టడం పోలీసుల భారీ విజయం గా వారు అభివర్ణించారు. ఛత్తీస్‌గఢ్ సరిహద్దుల్లో చురుకుగా ఉన్న నక్సల్స్‌ను అత్యంత ఉన్నత లక్ష్యాలతో ఏరివేశారని ఓ అధికారి చెప్పారు. రాయ్‌పూర్‌కు 150 కిలోమీటర్ల దూరంలో ఉన్న మన్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ప్రధౌని గ్రామంలో శుక్రవారం రాత్రి పోలీసులకు, నక్సల్స్‌కు మధ్య ఎదురు కాల్పులు చోటు చేసుకున్నాయని ఐజి (దుర్గ్ రేంజ్) వివేకనంద సిన్హా తెలిపారు. భద్రతా బలగాల బృందం నక్సల్స్ వ్యతిరేక ఆపరేషన్ నిర్వహిస్తుండగా ఈ ఎన్‌కౌంటర్ జరిగిందన్నారు. ప్రధౌని గ్రామంలో 7 మంది సాయుధులైన నక్సల్స్ శిబిరాలన్ని ఏర్పాటు చేసుకొని వంట వండుతున్నట్లు శుక్రవారం రాత్రి 7 గంటల ప్రాంతంలో తమకు సమాచారం అందిందని రాజనందగాన్ ఎస్‌పి జితేంద్ర శుక్లా పిటిఐకి వెల్లిడించారు. సమాచారం అందిన వెంటనే మదన్‌వాడ పోలీస్ స్టేషన్ ఎస్‌హెచ్‌ఒ శ్యామ్ కిషోర్ శర్మ, కోఖా పోలీస్ స్టేషన్ ఎస్‌హెచ్‌ఒ ప్రవీణ్ ద్వివేదీ నేతృత్వంలో 28 సిబ్బందిగల పోలీసు బృందం ఆపరేషన్‌ను ప్రారంభించినట్లు ఆయన చెప్పారు. రాత్రి 9.30 గంటల ప్రాంతంలో భద్రతా సిబ్బంది ప్రధౌని గ్రామ శివారు ప్రాంతాలను తమ ఆధీనంలోకి తీసుకున్నారని, ఇది గమనించిన నక్సల్స్ బలగాలపై విచక్షణారహితంగా కాల్పులు చేశారన్నారు. పోలీసులు కూడా ఎదురు కాల్పులు జరిపినట్లు ఎస్‌పి తెలిపారు. సుమారు 20 నిమిషాల పాటు ఇరు వర్గాల మధ్య హోరాహోరీ కాల్పులు జరగగా, చివరకు నక్సల్స్ పరారయ్యారన్నారు. ఆ తరువాత ఘటనాస్థలిలో గాలించగా, ఇద్దరు మహిళలు సహా యూనిఫారం ధరించిన నలుగురు నక్సల్స్ మృతదేహాలు పడి ఉండడంతో వాటిని స్వాధీనం చేసుకున్నామని, అదే విధంగా మృతదేహాల వద్ద ఎకె ఒక ఎస్‌ఎల్‌ఆర్ రైఫిల్, రెండు 12 బోర్ గన్స్ బయటపడినట్లు ఎస్‌పి శుక్లా చెప్పారు. అయితే ఎదురుకాల్పుల్లో సబ్ ఇన్‌స్పెక్టర్ శ్యామ్ కిషోర్ శర్మ (36)కు బుల్లెట్ గాయాలు కా గా, అతన్ని ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలోనే మృతి చెందాడన్నా రు. హతమైన నక్సల్స్‌లో రాజనందగాన్ సరిహద్దు డివిజన్ కమిటీ సభ్యుడు అశోక్ రైను(35) ఉన్నాడు.
నలుగురు నక్సల్స్ హతం
RELATED ARTICLES