పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ముగిసేంత వరకు వేటు
ప్రజాసమస్యలపై చర్చించాల్సిందేనని ప్రతిపక్షాల పట్టు
న్యూఢిల్లీ : పార్లమెంటులో ప్రజాసమ్యలపై చర్చంచడానికి ఇష్టపడని ప్రభుత్వానికి, ససేమిరా చర్చించాలంటూ పట్టుపడుతున్న ప్రతిపక్షాలకూ మధ్య వాగ్వాదం కొనసాగుతూనే ఉంది. ఈ వాగ్వాదంతో లోక్‌సభ నుండి నలుగురు ఎంపీలు సస్పెండ్ అయ్యారు. సమావేశాలు పూర్తయ్యేవరకూ వారిని సస్పెండ్ చేశారు. స్పీకర్ చర్య ప్రజాస్వామ్యానికి పెద్ద విఘాతమని ప్రతిపక్షాలు అభివర్ణించాయి. ప్రభుత్వం ప్రతిపక్షాలను భయపెట్టేందుకు ప్రయత్నం చేస్తోందని ప్రతిపక్ష ఎంపీ లు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. మాణిక్‌రామ్ టాగూర్, టిఎన్.ప్రతాపన్, జోథామని, రామ్యహరిదాస్‌లను సస్పెండ్ చేశారు. పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ పటేల్ ఈ సస్పెన్షన్ తీర్మానం
ప్రతిపాదించారు. ప్రజా సమస్యలపై చర్చించాలని కోరిన నలుగురు కాంగ్రెస్ ఎంపీలను సోమవారంనాడు లోక్‌సభ నుండి స్పీకర్ ఓం బిర్లా సస్పెండ్ చేశారు. తాము ఏం తప్పు చేశామని సస్పెండ్‌చేశారని అనంతరం సభ వెలుపల విలేకరులతో మాట్లాడుతూ లోకసభలో కాంగ్రెస్ ఉపనాయకుడు గౌరవ్ గొగోయ్ ప్రశ్నించారు. ప్రభుత్వం ఎంపీలను భయపెడుతోందని విమర్శించారు. ప్రజల సమస్యలను చర్చింమని అడిగితే సస్పెండ్ చేస్తున్నారని విమర్శించారు. ఆగస్టు 12 వరకూ వర్షాకాల సమావేశాలు జరుగుతాయి. ఈ సమావేశాలు పూర్తయ్యేవరకూ సభలోకి ఈ నలుగురు ఎంపీలను ప్రభుత్వం సస్పెండ్ చేసింది. ప్రజాసమస్యలపై చర్చించమని అడిగితే సభనుండి ప్రభుత్వం ప్రతిపక్ష ఎంపీలను సస్పెండ్ చేస్తోందని ప్రతిపక్షనాయకులు విమర్శించారు. ఈ ఘటనతో కాంగ్రెస్ ఎంపీలు ఆగ్రహంతో ఊగిపోయారు. ప్రజాసమస్యలపై చర్చించాల్సిందే అని లోక్‌సభలో పట్టుపట్టారు.
రాజ్యసభ సోమవారం ఒక్కరోజులోనే మూడుసార్లు వాయిదాపడింది. సాయంత్రం 5 గంటలవరకూ సభను వాయిదా వేశారు. ప్రజా సమస్యలపై చర్చించాల్సిందేననీ, దేశంలో ప్రజలు ధరల భారంతో కుంగిపోతున్నారని, నిరుద్యోగంతో అల్లాడిపోతున్నారని ప్రబుత్వం వెంటనే చర్చకు అనుమతించాలని ప్రతిపక్ష సభ్యులు పట్టుపడుతున్నప్పటికీ ప్రభుత్వం దిగిరావడం లేదు. జూన్ 18 నుండి ప్రారంభమైన పార్లమెంటు సమావేశాల్లో ఇప్పటివరకూ ఇదే తంతు కొనసాగుతూ ఉండటంతో విలువైన కాలాన్ని ప్రభుత్వం ప్రజాసమ్యలకు కేటాయించకుండా వృథాచేస్తోందని ప్రతిపక్ష ఎంపీలు విమర్శించారు. ‘ఆయుధాల ప్రతిపక్షాల గందరగోళం మధ్యే సామూహిక విధ్వంసం’ బిల్లుపై రాజ్యసభలో ప్రభుత్వం చర్చ చేపట్టింది. సభాపతిస్థానంలో సస్మిత్ పాత్రా ఉనారు. ప్రతిపక్షాలు సభలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్లకార్డులు ప్రదర్శించాయి. అయితే ప్లకార్డులు ప్రదర్శించవద్దని సభాపతి విజ్ఞప్తి చేసినప్పటికీ తృణమూల్ కాంగ్రెస్ సభ్యులు అభిర్ రంజన్ బిశ్వాస్ వినిపించుకోలేదు. దాంతో స్పీకర్ సభను వాయిదా వేశారు. అంతకుముందు రెండుసార్లు రాజ్యసభ వాయిదాపడింది. కాంగ్రెస్, టిఎంసి సభహా ప్రతిపక్షసభ్యులు పోడియంలోకి దూసుకువచ్చి సభాపతికి తమ డిమాండ్లు వినిపించారు. నినాదాలు చేశారు. ప్లకార్లు ప్రదర్శించారు. అయినాప్రభుత్వం పట్టించుకోలేదు. ఎన్‌సిపి సభ్యుడు ఫౌజియా ఖాన్ మాట్లాడుతూ, సభ సక్రమంగా లేదని, ఈ పరిస్థితుల్లో తాము మాట్లాడలేమని అన్నారు. టిఎంసి సభ్యుడు డెరిక్ ఓ బ్రెయిన్ మాట్లాడుతూ, తాము అనవసరంగా సభకు విఘాతం కలిగించడంలేదని, ప్రజాసమస్యలు చర్చించాలని కోరుతున్నామని సభాపతిని అడిగారు. 267వ నిబంధన కింద చర్చ జరగాలని కోరారు. జులై 18 నుండి ఇప్పటివరకూ సభా కార్యకలాపాలు జరగలేదు.
ఇళయరాజా ప్రమాణ స్వీకారం
కాగా ప్రముఖ సంగీత దర్శకుడు, రాజ్యసభకు రాష్ట్రపతి కోటాలో నామినేట్ అయిన ఇళయరాజా సోమవారంనాడు సభ్యుడుగా పదవీ ప్రమాణస్వీకారం చేశారు. కాగా జావళిన్ త్రోలో గొప్ప ప్రతిభ కనబరిచిన హర్యానా అథ్లెట్ నీరజ్ చోప్రాకు తొలుత రాజ్యసభ అభినందనలు తెలియజేసింది. ఇది గొప్ప విజయమని వారు కొనియాడారు. ఉదయం 11 గంటలకు సమావేశం కావాల్సిన రాజ్యసభ సోమవారంనాడు మధ్యాహ్నం 2 గంటలకు సమావేశమైంది. ఉదయం అంతా ముర్ముప్రమాణ స్వీకారోత్సవం జరిగింది. దాంతో ఉభయసభలను వాయిదా వేశారు.
నలుగురు కాంగ్రెస్ ఎంపిల సస్పెన్షన్
RELATED ARTICLES