ప్రజాపక్షం/ వనపర్తి బ్యూరో వనపర్తి జిల్లా రేవల్లి మండలం నాగపూర్ గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు అనుమానాస్పదంగా మృతి చెందటం కలకలం రేపింది. పోలీసులకథనం ప్రకారం.. ఆజీరాం బి(63,) ఆమె కుమార్తె ఆస్మా బేగం (35), అల్లుడు ఖాజా పాషా (42), మనుమరాలు హసీనా (10) మృతదేహాలు ఇంట్లో వేర్వేరు చోట్ల పడిఉన్నాయి. వంట గదిలో అజీరాం బి, డైనింగ్ హాలులో ఆస్మా బేగం, ఇంటి వెనుక గుంత వద్ద అల్లుడు, హాలులో హసీనా మృతదేహాలు ఉన్నాయి. శుక్రవారం ఉదయం 7 గంటల దాటినా ఇంట్లో నుంచి ఎవరూ బయటకు రాకపోవడంతో అనుమానం వచ్చిన స్థానికులు ఇంట్లోకి వెళ్లి చూడగా… నలుగురూ విగత జీవులై పడి ఉన్నారు. వెంటనే పోలీసులు, మృతుల బంధువులకు సమాచారమందించారు. ఖాజా మృతదేహం పక్కన కొబ్బరికాయ, నిమ్మకాయలు కనిపించాయి. అక్కడే ఓ గొయ్యి తీసి ఉంది. ఏం జరిగి ఉంటుందన్న దానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు. ఇంట్లో ఉన్న వాళ్లంతా ఒకేసారి ప్రాణాలు కోల్పోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. జరిగింది హత్యా, ఆత్మహత్యా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నిమ్మకాయలు, కొబ్బరి కాయలు, ఆగర్బత్తీలు ఉండటంతో క్షుద్రపూజలేమైనా జరిగాయా అని గ్రామస్థులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మరణించడంతో నాగపూర్‌లో విషాద ఛాయలు అలముకున్నాయి.
నలుగురు అనుమానాస్పద మృతి
RELATED ARTICLES