తొలిసారి ఆస్ట్రేలియా ఓపెన్ టైటిల్ కైవసం
ఫైనల్లో క్విటోవాపై విజయం
నేడు పురుషుల ఫైనల్స్
ఆస్ట్రేలియా ఓపెన్ టెన్నిస్
మెల్‌బోర్న్: జపాన్ యువ సంచలనం నయోమి ఒసాకా ప్రతిష్టాత్మక ఆస్ట్రేలియా ఓపెన్ గ్రాండ్‌శ్లామ్ టైటిల్‌ను కైవసం చేసుకుంది. గత ఏడాది చివరి టోర్నీ యూఏస్ ఓపెన్ గెలుచుకున్న ఒసాకా తాజాగా ఈ ఏడాది ఆరంభపు గ్రాండ్‌శ్లామ్ టైటిల్ ఆస్ట్రేలియా ఓపెన్‌ను గెలుచుకొని కొత్త చరిత్ర సృష్టించింది. ఈ విజయంతో తొలి సారి ఆస్ట్రేలియా ఓపెన్ టైటిల్‌ను తన ఖాతాలో వేసుకుంది. ఓవరాల్‌గా తన ఖాతలో రెండో గ్రాండ్‌శ్లామ్ టైటిల్ వేసుకుంది. మరోవైపు మహిళల టాప్ సీడ్‌ను కూడా దక్కించుకుంది. ఈ ఘనత సాధించి తొలి ఆసియా క్రీడాకారిణిగా ఒసాకా నిలిచింది. ఇప్పటివరకు ఏషియాలో ఎవరు కూడా మహిళల టాప్ సీడ్‌ను సాధించలేదు. ఒసాకాకు జపాన్ ప్రధాని షిన్‌జో అబె అభినందించారు. సోషల్ మీడియాలో ఒసాకాకు ప్రశంసల వర్షం కురుస్తోంది. జపాన్ పురుషుల స్టార్ నిషీ కోరీ కూడా ట్విట్టర్ ద్వారా ఓసాకాకు అభినందించాడు. శనివారం జరిగిన మహిళల సింగిల్స్ ఫైనల్లో నాలుగో సీడ్ జపాన్ క్రీడాకారిణి నయోమి ఒసాకా 7 5 6 తేడాతో ఎనిమిదో సీడ్ పెట్రా క్విటోవా (చెక్ రిపబ్లిక్)పై గెలిచి తన కెరీర్ తొలి ఆస్ట్రేలియా ఓపెన్‌ను సొంతం చేసుకంది. టోర్నీ ఆరంభం నుంచే దూకుడును కనబర్చిన ఈ జపాన్ సంచలనం వరుస విజయాలతో ఆకట్టుకుంది. నాలుగో రౌండ్‌లో 13వ సీడ్ అనస్టాసిజ సెవస్టోవా(లాట్వియా)ను ఓడించిన ఒసాకాక్వార్టర్ ఫైనల్లో ఆరో సీడ్ ఎలినా స్విటోలినా (ఉక్రెయిన్)ను వరుస సెట్లలో చిత్తు చేసింది. తర్వాత సెమీఫైనల్లో ఏడో సీడ్ కారోలినా ప్లిస్కోవా (చెక్ రిపబ్లిక్)పై గెలిచి ఫైనల్లో అడుగుపెట్టింది. తాజాగా ఫైనల్లో చెక్ రిపబ్లిక్‌కే చెందిన ఎనిమిదో సీడ్ రెండు సార్లు వింబుల్డన్ విజేతగా నిలిచిన పెట్రా క్విటోవాను ఓడించి సంచలనం సృష్టించింది. శనివారం జరిగిన ఫైనల్లో ఒసాకా, క్విటోవా హోరాహోరీగా తలపడ్డారు. ఆరంభం నుంచే ఇద్దరూ ఒకరిపై మరోకరు ఎదురుదాడులు చేసుకున్నారు. దీంతో తొలి సెట్ ఉత్కంఠంగా సాగింది. చివరికి ఈ సెట్‌ను ఒసాకా టై బ్రేకర్‌లో గెలుచుకుంది. తర్వాత రెండో సెట్‌లో కూడా ఇద్దరూ హోరాహోరీగా తలపడ్డారు. కానీ ఈ సెట్‌లో క్విటోవా దూకుడును కనబర్చుతూ ఒసాకాపై ఆధిపత్యం కనబర్చింది. దీంతో ఈ సెట్‌ను ఓసాకా 5 కోల్పోయింది. ఇక ఇద్దరూ చెరో సెట్ గెలిచి సమంగా నిలవడంతో ఆఖరి సెట్ ఇద్దరికి కీలకంగా మారింది. కొత్త చాంపియన్ ఎవరో తేల్చే ఈ చివరిదైన నిర్ణయాత్మక సెట్‌లో ఇద్దరూ మరోసారి హోరాహోరీగా తలపడ్డారు. నువ్వా..నేనా.. అన్నట్టు ఇద్దరూ ఒకొక్క పాయింట్ చేస్తూ మ్యాచ్‌ను మరింతగా ఉత్కంఠంలో నెట్టారు. కాగా చివర్లో దూకుడును పెంచిన జపాన్ స్టార్ క్విటోవాపై ఆధిక్యాన్ని సాధించి 6 ఆఖరి సెట్‌తో పాటు మ్యాచ్‌ను కూడా గెలిచి టైటిల్ సొంతం చేసుకుంది. ఇక చివరి వరకు చెమటోడ్చిన చెక్‌రిపబ్లిక్ క్రీడాకారిణి ఆఖరికి రన్నరప్‌తో సరిపెట్టుకోవాల్సి వచ్చింది.
జొకోవిచ్-నాదల్ అమీతుమీ..
ఈ రోజు (ఆదివారం) జరిగే పురుషుల సింగిల్స్ ఫైనల్లో దిగ్గజాలు టాప్ సీడ్ నొవాక్ జొకోవిచ్ (సెర్బియా), రెండో సీడ్ స్పెయిన్ బుల్ రాఫెల్ నాదల్ తలపడనున్నారు. గత ఏడాది వరుసగా చివరి రెండు గ్రాండ్‌శ్లామ్‌లు వింబుల్డన్, యూఏస్ ఓపెన్ టైటిళ్లను గెలుచుకొని జోరుమీదున్న టాప్ సీడ్ జొకోవిచ్ ఇక మూడో టైటిల్‌పై కన్నేశాడు. మరోవైపు గాయాలతో సతమతమవుతున్న స్పెయిన్ స్టార్ నాదల్ గత ఏడాది ఫ్రెంచ్ ఓపెన్ ఒక టైటిల్ మాత్రమే గెలిచాడు. కానీ, ఈ ఏడాది అద్భుతమైన ప్రదర్శనలు చేస్తున్న నాదల్ ఈ సీజన్ తొలి గ్రాండ్‌శ్లామ్‌ను తన ఖాతాలో వేసుకోవాలని పట్టుదలతో కనిపిస్తున్నాడు. ఇక ఇద్దరి మధ్య జరిగే టైటిల్ పోరు కోసం ప్రపంచ వ్యప్తంగా క్రీడా అభిమానులు అతృతగా వేచిచూస్తున్నారు. ఇద్దరి మధ్య ఈ మ్యాచ్ హోరాహోరీగా జరగడం ఖాయం.
నయా క్వీన్ ఒసాకా
RELATED ARTICLES