అమెరికాకు పారిపోతూ శంషాబాద్‌లో చిక్కిన వైనం
11న మరోసారి విచారణకు హాజరుకావాలని పోలీసుల ఆదేశం
ప్రజాపక్షం/హైదరాబాద్: టివి 9 షేర్ల కొనుగోలు వ్య వహారంలో తప్పుడు పత్రా లు సృష్టించిన కేసులో నిం దితుడిగా ఉన్న నటుడు శివాజీని సైబరాబాద్ పోలీసులు ఎట్టకేలకు అదుపులోకి తీసుకున్నారు. బుధవారం శివాజీ అమెరికా వెళ్లేందుకు శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్నాడు. అక్కడ అతని పాస్‌పోర్టును పరిశీలించిన ఇమ్మిగ్రేషన్ అధికారులు వెంటనే సైబరాబాద్ పోలీసులకు సమాచారం అందించారు. ఆర్‌జిఐ పోలీసులు అక్కడికి చేరుకుని శివాజీని అదుపులోకి తీసుకున్నారు. నెల రోజుల క్రితమే అతడిపై లుక్‌ఔట్ నోటీసు జారీ చేసిన విష యం తెలిసిందే. సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసు స్టేషన్ అధికారులు శివాజీని అదుపులోకి తీసుకుని రెండు గంటల పాటు విచారించారు. ఈ నెల 11న మరోసారి విచారణకు రావాల్సిందిగా పోలీసులు నోటీసులు జారీ చేశారు. అతని పాస్‌పోర్టును మాత్రం సీజ్ చేశారు. అనంతరం శివాజీని వదిలిపెట్టారు. దీంతో తన కారులో శివాజీ ఇంటికి వెళ్లిపోయారు. గతంలో ఆయనకు నాలుగు నోటీసులు జారీ చేసినా విచారణ కోసం అధికారుల ముందు హాజరు కాలేని విషయం తెలిసిందే.