ఒకేసారి 26 స్థానాలు ఎగబాకి భారత టెన్నిస్ స్టార్
ఎటిపి ర్యాంకింగ్స్ విడుదల
న్యూ ఢిల్లీ : భారత టెన్నిస్ యువసంచలనం సుమిత్ నగల్ ఎటిపి ర్యాంకింగ్స్‌లో కెరీర్ అత్యుత్తమ ర్యాంక్ 135 సాధించాడు. అర్జెంటీనాలోని బ్యూనోస్ ఎయిర్స్లో ఆదివారం జరిగిన పురుషుల సింగిల్స్ ఫైనల్లో ఏటీపీ ఛాలెంజర్ ఫకుండో బోగ్నిస్ను ఓడించిన సుమిత్ ఒకేసారి 26 స్థానాలు ఎకబాకడం విశేషం. ఆదివారం జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో సుమిత్ ఒక గంట 37 నిమిషాల్లో 6-4, 6-2 తేడాతో బోగ్నిస్పై సునాయాస విజయం సాధించాడు. ఈ నేపథ్యంలో సోమవారం ప్రకటించిన తాజా ర్యాంకింగ్స్‌లో భారత టెన్నిస్ స్టార్ మెరుగైన ర్యాంక్ సాధించాడు. ఇదిలా ఉండగా యూఎస్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్‌లో టెన్నిస్ దిగ్గజం రోజర్ ఫెదరర్‌పై అరంగేట్రం చేసిన 22 ఏళ్ల సుమిత్ వార్తల్లో నిలిచాడు. ఆ మ్యాచ్‌లో తొలి సెట్లోనే ఫెదరర్‌పై 6-4తో ఆధిపత్యం చెలాయించడం విశేషం. కాగా గ్రాండ్‌స్లామ్‌లో టెన్నిస్ దిగ్గజంపై ఒక సెట్లో విజయం సాధించిన తొలి భారతీయుడిగా సుమిత్ రికార్డు సృష్టించాడు. ఆ మ్యాచ్‌లో ఫెదరర్ 6-4, 1-6, 2-6, 4-6తేడాతో సుమిత్‌పై విజయం సాధించాడు.
నగల్‌కు కెరీర్ బెస్ట్ ర్యాంకు
RELATED ARTICLES