పట్టుబడిన నలుగురిని ఇంకా విచారిస్తున్న అధికారులు
అరెస్టు చేసే అవకాశం
హైదరాబాద్ : అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థ ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ సిరియా (ఐఎస్‌ఐఎస్) కద లికలపై జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఎ) హైద రాబాద్‌పై మరింత దృష్టి సారించింది. రెండు రోజుల క్రితం ఎన్‌ఐఎ అధికారులు పాత బస్తీ లోని షాహీన్‌నగర్, శాస్త్రీపురం, మైలా ర్ దేవులపల్లిలో దాడులు నిర్వహించి జీషాన్, మసూద్ తాహాజ్, షిబ్లీ బిలాలను అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. దీంతో పాటు మహారాష్ట్రలోని వార్ధాలో సైతం దాడులు నిర్వహించి ఉగ్ర వాది అబ్దుల్లా బాసిత్ (ప్రస్తుతం ఢిల్లీ జైలులో ఉన్నాడు) భార్య మోమినాను సైతం అదుపులోకి తీసుకు న్నారు. రెండు నెలల క్రితం మోమినా, జైలులో ఉన్న తన భర్త బాసిత్‌ను కలిసి ఉగ్రవాద కార్య కలాపాల విస్తరణ కోసం చర్చించినట్లు ఎన్‌ఐఎ అధికారులు గుర్తించారు. మోమినాతో హైదరా బాద్‌కు చెందిన జీషాన్, మసూద్ తాహాజ్, షిబ్లీ బిలాల్‌లకు సంబంధాలు ఉన్నట్లు ఎన్‌ఐఎ గుర్తిం చింది. ఈ నలుగురు తరచు టెలి గ్రామ్, ఫేస్‌బుక్ ద్వారా సంప్ర దింపులు జరిపేవారని, అందుకు తగిన ఆధారాలను సైతం ఎన్‌ఐఎ సేకరించింది. బాసిత్ అరెస్టు తరు వాత మోమినా మాడ్యుల్ బాధ్యతలను స్వీకరించింది. ఆమె పలువురు యువకులను ఐఎస్ ఐఎస్ ఉగ్రవాద సంస్థ వైపు మళ్లిం చింది. ఇందులో భాగంగానే పైముగ్గురు కూడా చేరారు. భారత్‌లో ఇస్లామిక్ రాజ్యం స్థాపిచడమే తమ ధ్యేయంగా ఐఎస్‌ఐఎస్‌తో చేతులు కలిపి ఇక్కడ కార్యకలాపాలను విస్తరించేందుకు ఈ మాడ్యుల్ పని చేస్తున్నట్లు తమ దృష్టికి వచ్చినట్లు ఎన్‌ఐఎ అధికారులు వాపోతున్నట్లు తెలిసింది. బండ్ల గూడలో ఉన్న జథార్ మండిలో వీరు ఒక సమావేశాన్ని కూడా నిర్వహించినట్లు ఎన్‌ఐఎ తన రెండు రోజుల విచారణలో గుర్తించింది. ఈ సమావేశంలో ఈ ముగ్గు రు యువకులతో పాటు మరికొందరు యువకులు కూడా హాజరైనట్లు తెలి సింది. వీరిని కూడా త్వరలో విచారించే అవకా శాలు ఉన్నాయి. ఇక శ్రీలంకలో ఆదివారం జరిగిన వరుస బాంబు పేలుళ్ల నేపథ్యంలో హైదరాబాద్‌పై ఎన్‌ఐఎ ప్రత్యేక నిఘా కొనసాగిస్తుంది. దీంతో పాటు స్థానిక పోలీసులను కూడా అప్రమత్తం చేసింది. పాత బస్తీలోని పలు అనుమానిత ప్రాంతాలపై నిరంతర నిఘా కొనసాగించాలని సూచిం చింది. పై నలుగురిని రెండు రోజుల పాటు విచారించిన ఎన్‌ఐఎ అధికా రులు సోమవారం కూడా వీరిని విచారించింది. వీరి వద్ద స్వాధీనం చేసు కున్న కంప్యూట్లు, ల్యాప్‌టాప్‌లు, సెల్‌ఫోన్‌లలో ఉన్న మరికొన్ని కీలక సమాచారాన్ని ఎన్‌ఐఎ అధికారులు రాబడుతున్నారు. ఇందులో ఉన్న కొన్ని హార్డ్‌డెస్క్‌లను ఢీకోడ్ చేసేందుకు ఎఫ్‌ఎస్‌ఎల్‌కు పంపించారు. ఎఫ్‌ఎస్‌ఎల్ రిపోర్టు వచ్చిన తరవుత పక్కా ఆధారాలతో వీరిని అరెస్టు చేసే అవకాశాలు లేకపోలేదని అధికారులు అంటున్నారు. హైదరాబాద్‌లో చివరి సారిగా 2013 ఫిబ్రవరి 19న దిల్‌సుఖ్‌నగర్ జంట బాబు పేలుళ్లు జరిగాయి. ఆ తరువాత ఉగ్ర కార్యకలాపాలు పూర్తిగా తగ్గాయి. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎలాంటి బాంబు పేలుళ్లు జరగలేదు. ఆరేళ్ల నుంచి ప్రశాంతంగా ఉన్న హైదరాబాద్‌లో తిరిగి ఉగ్ర కార్యకలాపాలు నిర్వహిం చేందుకు మోమినా ప్రయత్నించినట్లు తెలియగానే పాతబస్తీలో ఎన్‌ఐఎ విస్తృత దాడులు నిర్వహించి పై ముగ్గురిని అదుపులోకి తీసుకుంది. వీరిలో జీషాన్ ఆటోడ్రైవర్‌గా, మసూద్ తహాజ్, షిబ్లీ బిలాల్‌లు సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లుగా పనిచేస్తున్నారు. ఎన్‌ఐఎ విచారణ పూర్తయిన తరువాత వీరి ని అరెస్టు చేసే అవకాశాలు ఉన్నాయి. మూడు రోజులుగా సాగుతున్న విచారణను ఎన్‌ఐఎ అధికారులు వీడియోలో రికార్డింగ్ చేసినట్లు తెలి సింది. ఢిల్లీ, హైదరాబాద్ ఎన్‌ఐఎ అధికారులు ఈ విచారణ తంతు కొనసా గిస్తున్నారు.
నగరంపై ఎన్‌ఐఎ నిఘా
RELATED ARTICLES