సిడ్నీ: భారత స్టార్ బ్యాట్స్‌మన్ మహేంద్ర సింగ్ ధోనీ మరో రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. వరుసవైఫల్యాలతో సతమతమవుతున్న ధోనీ తొలి వన్డేలో సత్తా చా టాడు. తనపై వస్తున్న విమర్శలను తన బ్యాట్‌తో తిప్పి కొట్టాడు. నాలుగు పరుగులకే మూడు వికెట్లు కోల్పోయినా భారత్‌ను హాఫ్ సెంచరీతో ఆదుకున్నాడు. రో హిత్ శర్మతో కలిసి నాలుగో వికెట్ గొప్ప భాగస్వామ్యా న్ని ఏర్పరిచాడు. ఈ మ్యాచ్‌లో (51) పరుగులు చేసిన ధోనీ 68వ హాఫ్ సెంచరీతో పాటు వన్డేల్లో భారత్ తరఫున 10వేల పరుగులు చేసిన వారి జాబితాలో చేరాడు. వన్డేల్లో ఈ ఫీట్‌ను అందుకున్న ఐదో బ్యాట్స్‌మన్‌గా ధోనీ అరుదైన రికార్డును సొంతం చేసుకున్నాడు. ధోనీ కంటే ముందు సచిన్ టెం డూల్కర్, సౌరభ్ గంగూలీ, రాహుల్ ద్రవిడ్, విరాట్ కోహ్లీ ఈ జాబితాలో ఉ న్నారు. తాజాగా ధోనీ 10వేల పరుగులు చేసిన బ్యాట్స్‌మన్ల జాబితాలో చోటు దక్కించుకున్నాడు. ఇక ప్రపంచ వన్డే క్రికెట్ చరిత్రలో ఇప్పటి వరకు మొత్తం 13 మంది ఆటగాళ్లు ఈ 10వేల పరుగుల మార్కును దాటారు.
ధోనీ మరో రికార్డు..
RELATED ARTICLES