ఢిల్లీ: భారత మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీకి ఎవరూ సరితూగలేరని భారత క్రికెటర్ సురేశ్ రైనా అన్నాడు. ధోనీ బ్యాటింగ్ స్టయిల్ డిఫ్రెంట్‌గా ఉంటుందని, చివర్లో బ్యాటింగ్‌కు వచ్చి మ్యాచ్‌ను విజయవంతంగా ముంగిస్తాడు. తన సత్తా ఎంటో ఇప్పటికే ఎన్నో సార్లు ధోనీ నిరూపించుకున్నాడని రైనా పేర్కొన్నాడు. మిడిల్ ఆర్డర్‌లో ధోనీ కీలక ఆటగాడని, ఒత్తిడిలోనూ చాలా బాగ ఆడుతూ జట్టుకు అండగా ఉంటాడు. కొంత కాలం ఫామ్‌లేమితో బాధపడ్డ అతను తిరిగి ఫామ్‌ను అందుకోవడం సంతోషంగా ఉందని రైనా అన్నాడు. కఠిన సమయాల్లో తెలివిగా ఆడి జట్టును ఒంటి చేత్తో గెలిపించే సత్తా ధోనీకి ఉంది. మిడిల్ ఆర్డర్‌లో ధోనీ కీలమైన బ్యాట్స్‌మన్‌తో పాటు మంచి ఫినీషియర్ కూడా. అతను క్రీజులో ఉన్నంతసేపు భారత్ విజయ అవకాశాలు సజీవంగా ఉంటాయనడంలో సందేహంలేదని టి20 స్పెషలిస్ట్ బ్యాట్స్‌మన్ సురేశ్ రైనా పేర్కొన్నాడు. ప్రపంచకప్‌లో ధోనీ భారత జట్టులో కీలక ఆటగాడి పాత్ర పోషిస్తాడని రైనా ధీమా వ్యక్తం చేశాడు.
ధోనీయే బెస్ట్ : సురేశ్ రైనా
RELATED ARTICLES