సఫారీలతో టి20 సిరీస్‌కు తుది జట్టులో స్థానం ఇవ్వని సెలెక్టర్లు
ముంబై: అందరూ ఊహించినట్టుగానే సఫారీతో తలపడే జట్టులో ధోనీకి చోటుదక్కలేదు. గురువారం దక్షిణాఫ్రికా సిరీస్‌కు భారత క్రికెట్ జట్టును బిసిసిఐ ప్రకటించింది. ఈ జట్ల మధ్య మూడు టీ20 మ్యాచ్‌లకు గాను జట్టును సెలక్టర్లు ఎంపిక చేశారు. సెప్టెంబర్ 15నుంచి మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్ ప్రారంభం కానుంది. 15 ధర్మశాల, 18 మొహాలీ, 22న బెంగళూరులో ఈ మ్యాచ్‌లు జరగనున్నాయి. దీంతో పాటు రెండు జట్లు మూడు టెస్ట్ మ్యాచ్‌ల సిరీస్ తలపడనున్నాయి. విశాఖపట్టణంలో అక్టోబర్ రెండు నుంచి టెస్ట్ సిరీస్ ప్రారంభం కానుంది. అక్టోబర్ 23న రాంచీలో చివరి టెస్ట్ జరగనుంది.
భారత జట్టు ఇదే..
కోహ్లీ( కెప్టెన్), రోహిత్ శర్మ(వైస్ కెప్టెన్), కేఎల్ రాహుల్, శిఖర్ ధావన్, శ్రేయస్, మనీశ్ పాండే, రిషబ్ పంత్ ( వికెట్ కీపర్), హార్ధిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, కృనాల్ పాండ్యా, వాషింగ్టన్ సుందర్, రాహుల్ చహర్, ఖలీల్ అహ్మద్, దీపక్ చహర్, నవ్‌దీప్ సైనీ.
ధోనీకి మొండిచెయ్యి
RELATED ARTICLES