HomeNewsBreaking Newsధాన్యం కొనుగోళ్లపై స్పష్టత కోసం యత్నాలు

ధాన్యం కొనుగోళ్లపై స్పష్టత కోసం యత్నాలు

న్యూఢిల్లీ: యాసంగిలో రాష్ట్రం నుంచి ఎంత ధా న్యాన్ని కొంటామనే విషయంలో కేంద్రం నుంచి స్పష్టమైన వివరణ కోసం తెలంగాణ మంత్రులు ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. ముఖ్యమంత్రి కెసిఆర్‌, మంత్రులు ఇదే విషయంపై ఢిల్లీకి వెళ్లిన విషయం తెలిసిందే. హైదరాబాద్‌ ఇందిరా పార్క్‌ వద్ద మహాధర్నా చేసిన టిఆర్‌ఎస్‌ ఆతర్వాత కేంద్ర వైఖరిపై అమీతుమీ తేల్చుకోవాలన్న పట్టుదలతో ఉంది. దేశంలో ధాన్యం నిల్వలు ఉన్నాయ ని, కాబట్టి బాయిల్డ్‌ రైస్‌ను కొనబోమని కేంద్రం చేసిన ప్రకటనపై అభ్యంతరాలు వ్యక్తం చేసింది. అసలు ఏఏ రకమైన ధాన్యం, ఎంతెంత మొత్తం కొనుగోలు చేస్తారో స్పష్టం చేయాలని మహాధర్నాలోనే కెసిఆర్‌ కేంద్రాన్ని డిమాండ్‌ చేశారు. ఇప్పు డు ఢిల్లీలోనూ ఆయన ఆ దిశగానే ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. కాగా, మంగళవారం కేంద్ర వినియోగదారుల మంత్రిత్వ శాఖ కు చెందిన అధికారులతో తెలంగాణ మంత్రులు కెటిఆర్‌, నిరంజన్‌రెడ్డి, గంగుల కమలాకర్‌ భేటీ అయ్యా రు. ధాన్యం సేకరణ అంశాన్ని వారితో చర్చించారు. కొనుగోలు చేయబోయే ధాన్యం, పరిమాణాల గురించి ముందుగానే స్పష్టతనిస్తే, రైతులు ఏఏ పంటలను వేయాలనే విషయాన్ని ఆలోచించుకుంటారని కెసిఆర్‌ అంటున్నారు. ప్రభుత్వం కూడా ఈ వివరాల ఆధారంగా నిర్ణయాలు తీసుకునే అవకాశాలు ఉంటాయని ఢిల్లీకి బయలుదేరే ముందే ఆయన స్పష్టం చేశారు. ఈ అంశంపై కేంద్రం వివరణ ఇచ్చే వరకూ ఢిల్లీలోనే ఉంటామని కెసిఆర్‌ అంటున్నారు.

DO YOU LIKE THIS ARTICLE?
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments