HomeNewsLatest Newsధాన్యం కేటాయించం

ధాన్యం కేటాయించం

డి ఫాల్టర్‌ రైస్‌ మిల్లర్లకు ధాన్యం కేటాయించం

డిప్యూటీ సిఎం భట్టి, మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి

ప్రజాపక్షం/హైదరాబాద్‌
ఈ ఖరీప్‌ సీజన్‌లో డి ఫాల్టర్‌ రైస్‌ మిల్లర్లకు ఎట్టి పరిస్థితుల్లో ధాన్యం కేటాయించబోమని డిప్యూటీ సిఎం భట్టి విక్రమార్కమల్లు, పౌర సరఫరా శాఖ మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డిలు స్పష్టం చేశారు. బుధవారం డాక్టర్‌ బి.ఆర్‌ అంబేద్కర్‌ సచివాలయంలో ధాన్యం కొనుగోలుపై మంత్రివర్గ సబ్‌ కమిటీ రెండవ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఉపముఖ్యమంత్రి భట్లి విక్రమార్క, మంత్రి ఉత్తమ్‌ కుమార్‌రెడ్డిలు మాట్లాడుతూ డిఫాల్టరు జాబితాలో ఉన్న రైస్‌ మిల్లర్లు మొత్తం బియ్యాన్ని త్వరితగతన ప్రభుత్వానికి అందజేయాలని ఆదేశించారు. డి ఫాల్టర్ల విషయంలో కఠిన వైఖరి అవలంబించాలని నిర్ణయించినట్టు వారు వెల్లడించారు. సన్న బియ్యం 100 కేజీలు బిల్లింగ్‌ చేస్తే 58 కిలోల బియ్యం వస్తుందని, 100 కేజీల దొడ్డు ధాన్యాన్ని మిల్లింగ్‌ చేస్తే 67 కేజీల బియ్యం వస్తుందని ఆమేరకు బియ్యాన్ని అందజేయాల్సిందేనన్నారు. గత ప్రభుత్వం రవాణా, కస్టడీ, మిల్లింగ్‌ చార్జీల విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిందని మిల్లర్లు సబ్‌ కమిటీ దృష్టికి తీసుకువచ్చారు. కమిటీ సభ్యులు మంత్రులు తుమ్మల నాగేశ్వర రావు, శ్రీధర్‌ బాబులు ఆన్‌లైన్‌లో సమావేశంలో పాల్గొన్నారు. ఈసమావేశంలో స్పెషల్‌ సిఎస్‌ రామకృష్ణారావు, వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శి రఘునందన్‌ రావు, పౌరసరఫరాల శాఖ కమిషనర్‌ డిఎస్‌ చౌహన్‌, జిఎం నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

 

DO YOU LIKE THIS ARTICLE?
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments