కూరగాయల వ్యాపారులు సిండికేట్
ధరల పెరుగుదలతో వినియోగదారులు గుండెలు గుబేల్
సూర్యాపేటబ్యూరో : కరోనా వైరస్ మరణ మృదంగం మోగిస్తుంటే… కూరగాయల వ్యాపారులు ఇదే అదునుగా భావించి ధరలను అమాంతం పెంచి వినియోగదారులతో ఆడుకుంటున్నారు. నిత్యావసరమైన కూరగాయాల ధరలను ఏన్నడు లేని విధంగా అమాంతం పెంచేశారు. రవాణా వ్యవస్ధ స్థంభించిందని అబద్ధ్దాలు అడుతూ వ్యాపారులంతా సిండికేట్‌గా మారి ధరలు పెంచడంతో పాటు అందరు ఒకే రేటుకు అమ్ముతున్నారు. కరోనా పేరుతో రెండు రోజుల వ్యవధిలోనే వ్యాపారులు ఇలా దోచుకుంటే ప్రభుత్వం ప్రకటించిన విధం గా ఈనెల 31వరకు లాక్‌డౌన్ పేరుతో మరో వారం రోజుల్లో వ్యాపారులు ఇకేంతా ధరలు పెంచుతారో అంతు చిక్కడం లేదు. కూరగాయల ధరలు ఎప్పుడు లేనివిధంగా ఒక్కసారిగా పెరగడంతో వినియోదారుల గుండెలు గుబేల్ మంటున్నాయి.
కరోనా ప్రభావంతో రెండు రోజులోనే జిల్లా వ్యాప్తంగా ఉన్న అన్ని కూరగాయల మార్కెట్‌లలో వ్యాపారులు ధరలను పెంచేశారు. గతం లో హైదరాబాద్‌తో పాటు ఇతర జిల్లాల నుండి సూర్యాపేట జిల్లాకు పెద్ద ఎత్తున కూరగాయలు నిత్యం టన్నుల కొద్ది కూరగాయలను దిగుమతి చేసుకొని వ్యాపారులు విక్రయించేవారు. కూరగాయల సాగు లాభాసాటిగా ఉండటంతో ఈ ప్రాంత రైతాంగం గత కొన్నేళ్ల్లుగా కూరగాయల సాగును విస్తృతంగా చేస్తున్నారు.వారు పండించిన కూరగాయలను తమ సమీపంలో ఉన్న మార్కెట్లకు తరలించి అక్కడి హోల్ సెల్ వ్యాపారులకు అమ్ముకుంటున్నారు. అనంతరం వారు చిల్లర వ్యాపారులకు తిరిగి విక్రయించడం జరుగుతుంది. జిల్లాలో గత కొంతకాలంగా రైతులు టమాట, మిర్చి, వంకాయ, గోకర, బెండ,దొండ, దోసతో పాటు క్యాలిఫ్లవర్ కూడా పండిస్తున్నారు. కేవలం హైదరాబాద్‌లో పాటు ఇతర ప్రాంతాల నుండి ఆలు, క్యారేట్, బిట్‌రూట్, క్యాఫ్సికం లాంటివి మాత్రమే దిగుమతి చేసుకుంటున్నారు. స్ధానికంగా రైతులు కూరగాయల సాగును పెద్ద ఎత్తున చేయడంతో కూరగాయలు చౌకగా దోరుకుతున్నాయి. రైతులు తమ కూరగాయలను అమ్ముకునేందుకు ఉదయం 5గంటలలోపే మార్కెట్‌కు వాహనాల్లో తీసుకోస్తున్నారు. హోల్ సెల్ వ్యాపారులు రైతుల నుండి రోజులాగే తక్కువ ధరలకు కొనుగోలు చేస్తున్నారు. ఇక్కడ ఏలాంటి వడుదోడుకులు లేకున్న హోల్ సెల్ వ్యాపారులు మాత్రం కరోనా వైరస్ పేరుతో కూరగాయలు దిగుమతి పడిపోయిందని… రైతులు పండించిన పంటను తెపేందుకు కూలీలు దోరకడం లేదని అభూతకల్పనలు చెబుతూ ధరలను అమాంతం పెంచేశారు. ఈ నెల 22 తేదీన జనతా కర్యూతో మార్కెట్‌లు బంద్ కాగా సీఎం కేసీఆర్ కేంద్ర ప్రభుత్వ సూచనల మేరకు కరోనా వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు ఈ నెల 31వ తేదీ వరకు లాక్‌డౌన్‌ను ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో ప్రజలు కర్ప్యూ అయిపోగానే రోజులా కూరగాయలు కొనుకునేందుకు మార్కెట్‌కు వెళ్లడంతో కూరగాయను కొనుగోలు చేసేందుక ముట్టుకున్న రేటు మాత్రం మండిపోయింది.
గత రెండు రోజుల క్రితం ఉన్న ధరలు నేటి ధరను పోలిస్తే రెట్టింపు అయింది. ధరలు ఒక్కసారిగా అమాంతం పెరగడంతో వినియోగాదారులు గుండెలు గుబేలుమన్నాయి.
‘ధరా’ఘాతం
RELATED ARTICLES