HomeNewsBreaking Newsధరల పెంపు నిరసిస్తూ కదంతొక్కిన కాంగ్రెస్‌

ధరల పెంపు నిరసిస్తూ కదంతొక్కిన కాంగ్రెస్‌

అన్ని నియోజకవర్గాల్లో ధర్నాలు, రాస్తారోకోలు
ప్రజాపక్షం / హైదరాబాద్‌ యాసంగి ధాన్యం కొనుగోలు చేయాలని, పెంచిన పెట్రోల్‌, డీజిల్‌, గ్యాస్‌ ధరలు, విద్యుత్‌ చార్జీలు తగ్గించాలని డిమాండ్‌ చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో కాంగ్రెస్‌ పార్టీ మంగళవారం నాడు ధర్నాలు, రాస్తారోకోలు, నిరసన కార్యక్రమాలను నిర్వహించింది. 24 గంటల్లో ప్రభుత్వం వడ్లు కొనుగోలు ప్రారంభించాలని లేకపోతే మంత్రులు, ఎమ్మెల్యేలు, టిఆర్‌ఎస్‌ నేతలను అడ్డుకుంటామని కాంగ్రెస్‌ నేతలు హెచ్చరించారు. రాష్ర్ట వ్యాప్తంగా నిరసన కార్యక్రమాల్లో భాగంగా కాంగ్రెస్‌ కార్యకర్తలు, నాయకులకు, పోలీసులకు మధ్య ఉద్రిక్తత నెలకొన్నది. ఖమ్మం జిల్లాలో సీఎల్‌పి నేత మల్లు భట్టి విక్రమార్క, మంథని లో ఎమ్మెల్యే దుద్దిళ్ళ శ్రీధర్‌ బాబు, జగిత్యాలలో ఎంఎల్‌సి టి.జీవన్‌ రెడ్డి, కరీంనగర్‌ లో మాజీ ఎంపి పొన్నం ప్రభాకర్‌, హైదరాబాద్‌ లో అంజన్‌ కుమార్‌ యాదవ్‌లు పాల్గొన్నారు. సీఎం కేసీఆర్‌ నియోజక వర్గ కేంద్రం గజ్వేల్‌ లో కాంగ్రెస్‌ కార్యకర్తలు, రైతులు ఎడ్ల బండ్లపై వచ్చి ప్రజ్ఞాపూర్‌ వద్ద జాతీయ రహదారిని దిగ్బంధం చేశారు.డీసీసీ అధ్యక్షులు, నియోజక వర్గ బాధ్యులు, నియోజక వర్గ కో ఆరినేటర్లు, మాజీ మంత్రులు, ముఖ్య నాయకులు ధర్నాలలో పాల్గొన్నారు.కాంగ్రెస్‌ ఇచ్చిన పిలుపుతో రైతులు పెద్దఎత్తున స్పందించి ధర్నాలలో పాల్గొనడంతో రాస్తా రోకోలతో అనేక ప్రాంతాలలో రోడ్లు పై వాహనాలు కిలోమీటర్లు మేర నిలిచిపోయాయి.
కరీంనగర్‌ డిసిసి ఛీప్‌కు గాయాలు:కరీంనగర్‌ మానకొండూరు వద్ద జరిగిన ధర్నాలో పోలీసులకు కాంగ్రెస్‌ నాయకులకు మధ్య జరిగిన తోపులాటలో డీసీసీ అధ్యక్షులు కవ్వంపల్లి సత్యనారాయణ కు గాయాలు కావడం తో సమీప ఆసుపత్రికి తరలించారు. కాగా ఆసుపత్రికి వెళ్ళి కవ్వంపల్లిని పొన్నం ప్రభాకర్‌ పరామర్శించారు. రైతుల పక్షాన పోరాటం చేస్తున్న కరీంనగర్‌డీసీసీ అధ్యక్షులు కవ్వంపల్లి సత్యనారాయణపై పోలీసులతో దాడులు చేయించడం కేసీఆర్‌ రాక్షస పాలనకు నిదర్శనమని, అధికారం శాశ్వతం కాదని, ఈ దారుణాలకు మూల్యం తప్పదని టీపీసీసీ ఛీఫ్‌ రేవంత్‌రెడ్డి ట్వీట్‌ చేశారు.

DO YOU LIKE THIS ARTICLE?
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments