గడువును జనవరి 30 వరకు పెంచాలి
సిపిఐ డిమాండ్
సిఎం కెసిఆర్‌కు చాడ వెంకట్‌రెడ్డి లేఖ
ప్రజాపక్షం/హైదరాబాద్‌ధరణి వెబ్‌సైట్‌లో పొందుపరిచేందుకు మున్సిపల్ కార్పోరేషన్‌లు, మున్సిపాలిటీలు, గ్రామపంచాయతీలలో ఆస్తుల సమాచారాన్ని ఆదరాబాదరాగా కాకుండా నిదానంగా చేపట్టాలని, అందుకు విధించిన గడువును 2021 జనవరి మాసంతం వరకు పొడిగించాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావుకు శుక్రవారం లేఖ రాశారు. మున్సిపల్, కార్పోరేషన్, గ్రామపంచాయతీలలో ఇండ్లు, ఖాళీస్థలాల వివరాలు సేకరించడం మంచి పరిణామమేనని పేర్కొన్నారు. అయితే మనకున్న సిబ్బందితో ఈ నెల 15వ తేదీ వరకే ఈ సేకరణ జరిగే అవకాశం లేదన్నారు. కొన్నిచోట్ల ధరణి పోర్టల్‌లో సాంకేతిక ఇబ్బందులు తలెత్తుతున్నట్లు తెలుస్తున్నదన్నారు. హైదరాబాద్ కార్పోరేషన్‌కు ఎన్నికలు దగ్గరల్లో ఉన్నాయని, ఆ బాధ్యతలను సిబ్బంది నిర్వర్తిస్తున్నందున గడువులోగా నూరు శాతం వాస్తవ సమాచారాన్ని సేకరించడం ఇబ్బందికరంగా ఉంటుందని తెలిపారు. ఇంటి డాక్యుమెంట్స్ బ్యాంక్‌లో కుదువపెట్టడం, బ్యాంక్ లాకర్‌లలో భద్రపర్చడం, కొంతమంది వద్ద జిరాక్స్ కాపీలు లేకపోవడం మూలంగా డాక్యుమెంట్స్ చూపించడానికి ఇంటి యజమానులు ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని సిఎంకు రాసిన లేఖలో పేర్కొన్నారు. ఎన్‌ఆర్‌ఐలు ఇతర దేశల్లో వుండటం, కరోనా మూలంగా రవాణా సదుపాయం లేకపోవడంతో రాలేకపోతున్నారని వివరించారు. ఇలాంటి సందర్భంలో గడువును పొడిగిస్తూ సమాచారం నిధానంగా సేకరించడమే సమంజసమన్నారు. సంకల్పం మంచిదైనప్పటికీ ఆగమేఘాల మీద సమాచారం సేకరిస్తే తప్పులు దొర్లే అవకాశం మెండుగా ఉంటుందన్నారు. గడువు తేదీపై పునరాలోచించి జనవరి ఆఖరు వరకు పొడిగించాలని, వాస్తవ ఆధారిత సమాచారాన్ని సేకరించి ధరణి రికార్డ్‌లలో పొందుపర్చాలని చాడ వెంకట్‌రెడ్డి సిఎంను కోరారు.
‘ధరణి’పై దూకుడేల?‘ధరణి’పై దూకుడేల?
RELATED ARTICLES