కాంగ్రెస్ పాలనలో దళారులదే రాజ్యం
పాలమూరు బంగారు తునక
సిఎం కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు
ప్రజాపక్షం/నాగర్‌కర్నూల్ ప్రతినిధి పాలమూరు జిల్లా సిరులపంటలతో బంగారుతునకగా మారిందని, ధరణిపోర్టల్‌తో రాష్ట్రంలోని పల్లెలు ప్రశాంతంగా ఉన్నాయని రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు అన్నారు. నాగర్‌కర్నూల్ జిల్లాకేంద్రంలో నిర్మించిన నూతన కలెక్టర్ భవనాన్ని, జిల్లా పోలీసు కార్యాలయాన్ని, మెడికల్ కళాశాలను ముఖ్యమంత్రి కెసిఆర్ మంగళవారం ప్రారంభించారు. ఈ కార్యక్రమాల్లో రాష్ట్ర మంత్రులు వేముల ప్రశాంత్‌రెడ్డి, మహ్మద్ మహమూద్ ఆలీ, సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి, వి.శ్రీనివాస్‌గౌడ్, స్థానిక ఎంఎల్‌ఎ మర్రి జనార్దన్‌రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వప్రధాన కార్యదర్శి శాంతకుమారితో పాటు ఎంపి, ఎంఎల్‌సిల తదితరులు పాల్గొన్నారు. అంతకు ముందు భారత రాష్ట్ర సమితి (బిఆర్‌ఎస్) పార్టీ జిల్లా కార్యాలయాన్ని సిఎం కెసిఆర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సిఎం కెసిఆర్ ప్రసంగిస్తూ ఇండ్లులేని పేదలకు గృహాలక్ష్మిపేరుతో ఈనెల నుండే నియోజకవర్గానికి 3వేల ఇండ్లను రాష్ట్రవ్యాప్తంగా మంజూరు చేస్తున్నామని, ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఎంఎల్‌ఎల కోరిక మేరకు నియోజకవర్గానికి 4వేల గృహాలక్ష్మి ఇండ్లను మంజూరు చేస్తామని సిఎంకెసిఆర్ హామీ ఇచ్చారు. త్వరలోనే గిరిజనులకు పోడుభూముల పట్టాలు అందిస్తామన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినప్పుడూ పాలమూరు ఎంపిగా ఉన్నానని పాలమూరు జిల్లా రుణం ఎప్పటికీ తీర్చుకోలేనని ఉమ్మడి జిల్లాకు రుణపడి ఉంటానన్నారు. రూ.2 వేల కోట్లతో నిర్మించనున్న ఉమామహ్వేర ప్రాజెక్టు త్వరలోనే పూర్తిచేస్తామని సిఎం కెసిఆర్ చెప్పారు. రైతుభూమి మారాలంటే అధికారుల పెత్తనంలేకుండా రైతుల వేలిముద్రతోనే భూమి మారే విధంగా రైతులకే అధికారం ఇచ్చామన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో ఉమ్మడి పాలమూరు జిల్లా మంచినీళ్లకు, కరెంటుకు, విద్య, వైద్యానికి నోచుకోలేని పరిపాలన చేశారని, తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అనంతరం 24గంటలు విద్యుత్ అందించడంతోపాటు విద్య, వైద్యం, రవాణ మౌలిక సదుపాయాలను కల్పించామని, అనేక సంక్షేమ పథకాలు పేదలకు అందిస్తున్నట్లు చెప్పారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు కాకుంటే, నాగర్‌కర్నూల్ జిల్లా ఏర్పాటు కాకపోతే జిల్లా సమీకృత సముదాయ భవనం, జిల్లా పోలీసు కార్యాలయం, మెడికల్ కాలేజీ తదితర అనేక నూతన సదుపాయాలు అందేవి కాదన్నారు. రాష్ట్రం ఏర్పాటుతోనే రాష్ట్రంలోని ప్రధాన సమస్యలైన సాగునీరు, తాగునీరు, విద్యుత్, విద్య, వైద్యరంగాలలో రాష్ట్ర ఉద్యోగుల నిరంతరశ్రమతో దేశంలోనే అన్నిరంగాలలో ప్రథమ స్థానంలో నిలబెట్టిన ఘనత ఉద్యోగులదేనని అభినందించారు. కాకతీయులు పరిపాలించిన కాలంలో 75వేల చెరువులు నిర్మించడం జరిగిందని అట్టి చెరువులలో కాంగ్రెస్ పాలకులు కంపచెట్లతో ఉన్న వాటిని పట్టించుకున్నపాపాన పోలేదని సిఎం కెసిఆర్ విమర్శించారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు అనంతరం మిషన్‌కాకతీయ పథకంతో రాష్ట్రంలో గల చెరువులను పునరుద్దరించడం జరిగిందని, గతంలో ఉమ్మడి పాలనలో మహిళలు నీళ్ల కోసం బిందెలు పట్టుకుని బావుల వెంట వెళ్లేవారని ప్రస్తుతం మిషన్‌భగీరథ పథకంతో ఇంటింటికి నల్లారావడంతో మహిళల ముఖాలలో చిరునవ్వు చిగురించిందని సిఎం కెసిఆర్ అన్నారు. ఉమ్మడిజిల్లాలో నార్లాపూర్, ఏదుల, వట్టెం, కరివేన, ఉదండాపూర్ రిజర్వాయర్లను పూర్తితోనే పాలమూరు పచ్చగా మారిందన్నారు. తెలంగాణ మోడల్ కావాలని దేశ ప్రజలు కోరుకుంటున్నారని, దేశానికి వెళ్లాలా వద్దా అని ప్రజలను అడిగారు. దీంతోప్రజలు దేశానికి వెళ్లేందుకు సంపూర్ణ మద్దతు ఇస్తామని మద్దతు తెలిపారు. స్థానిక ఎంఎల్‌ఎ మర్రిజనార్దన్‌రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రాభివృద్ధి మాదిరిగానే దేశాభివృద్ధి చెందాలని, కెసిఆర్ దేశానికి నేత కావాలని, రాష్ట్ర ప్రజలు సంతోషంగా జీవిస్తున్నారని, రాష్ట్రంలో అందుతున్న అనేక సంక్షేమ పథకాలు దేశ ప్రజలకు కూడా అందాలంటే కెసిఆర్‌కు సంపూర్ణ మద్దతు ఇవ్వాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపిలు రాములు, మన్నెం శ్రీనివాస్‌రెడ్డి, ఎంఎల్‌ఎలు బీరంహర్షవర్దన్‌రెడ్డి, గువ్వల బాల్‌రాజు, జైపాల్‌యాదవ్, లక్ష్మారెడ్డి, ఆల వెంకటేశ్వర్‌రెడ్డి, బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి, అబ్రహం, ఎంఎల్‌సిలు కూచుకుళ్ల దామోదర్‌రెడ్డి, గోరటి వెంకన్న, కసిరెడ్డి నారాయణరెడ్డి, చల్లా వెంకట్రామ్‌రెడ్డి, జిల్లా కలెక్టర్ పి.ఉదయ్‌కుమార్, ఎస్‌పి కె.మనోహర్, డిసిసిబి డైరెక్టర్ జక్కా రఘునందన్‌రెడ్డి, జెడ్‌పి వైస్ చైర్మన్ బాలాజీసింగ్, డిజిపి ఎం.అంజనీకుమార్, ప్రభుత్వచీఫ్ ఇంజనీర్ గణపతి, ప్రభుత్వ అధికారులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.
ధరణితో పల్లెలు ప్రశాంతం
RELATED ARTICLES