ప్రజాపక్షం / హైదరాబాద్: దేశభక్తి గురించి గొప్పలు చెప్పుకునే కేంద్ర ప్రభుత్వం తమ అనుయాయులైన కార్పోరేట్ శక్తులు, దిగ్గజాలకు ప్రభుత్వ రంగ సంస్థలను, గనులు, ఖనిజ వనరులను కట్టబెట్టేందుకు నిర్ణయాలు తీసుకున్నదని అఖిలపక్ష సమావేశం విమర్శించింది. స్వాంతంత్య్రానంతరం దేశ స్వాలంభన కోసం ప్రైవేటు సంస్థల జాతీయకరణ చేస్తే నేడు బిజెపి ప్రభు త్వం తిరోగమన చర్యలకు పాల్పడుతూ ప్రభుత్వ సంస్థలను, కీలకమైన రక్షణ రంగంలోకి కూడా ప్రైవేటు సంస్థలకు అనుమతులిస్తోందని మండిపడింది. ప్రైవేటీకరణ, కార్పోరేటీకరణ చర్యలను, నిర్ణయాలను ఉపసంహరించుకుని ప్రభుత్వ రంగ సంస్థలను కాపాడాలని కోరుతూ ప్రధానమంత్రికి లేఖ రాయాలని సమావేశం తీర్మానించింది. కేంద్ర ప్రభుత్వం ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరించడానికి వ్యతిరేకంగా సిపిఐ ఆధ్వర్యంలో అఖిలపక్ష రౌండ్ టేండ్ సమావేశం బుధవారం మఖ్ధూంభవన్ లో జరిగింది. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి అ ధ్యక్షతన జరిగిన సమావేశంలో సిపిఐ జాతీయ కార్యదర్శి డాక్టర్ కె.నారాయణ, టిపిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ పొన్నం ప్రభాకర్, ఎఐసిసి కార్యదర్శి ఎస్.ఎ.సంపత్ కు మార్, టిజెఎస్ అధ్యక్షులు ప్రొఫెసర్ ఎం.కోదండరామ్, టిడిపి రాష్ట్ర అధ్యక్షులు ఎల్.రమణ, సిపిఐ(ఎంఎల్) న్యూడెమాక్రసీ కార్యదర్శివర్గ సభ్యులు కె.గోవర్ధన్, సిపిఐ ఎంఎల్ రాష్ట్ర కార్యదర్శి భూతం వీరన్న, ఎఐటియుసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి.ఎస్.బోస్, తెలంగాణ రాష్ట్ర రై తు సంఘం ప్రధాన కార్యదర్శి పశ్య పద్మ, సిపిఐఎంఎల్ నేత ప్రసాద్, సిపిఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు ఎన్. బాలమల్లేశ్, టిజెఎస్ నేత శ్రీశైల్‌రెడ్డి తదితరులు ప్రసంగించారు. ఒక వైపు దేశ ప్రజలు కరోనాతో అష్టకష్టాలు పడుతుంటే కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం తన రహస్య ఎజెండాను అమలు చేస్తుందని వక్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫెడరల్ వ్యవస్థకు విఘాతం కలిగించే, రాష్ట్రాల హక్కులను హరించే విధంగా కేంద్ర విద్యుత్ సవరణ బి ల్లు, వ్యవసాయ రంగాన్ని విచ్చిన్నం చేసే ఆర్డినెన్స్‌లు, రై ల్వే ఆదాయాన్ని కొల్లగొట్టే రైల్వే ప్రైవేటీకరణ చర్యలు ఉ న్నాయని విమర్శించారు. చివరకు రక్షణ రంగంలో కూ డా ప్రైవేటీకరణ నిర్ణయాలతో చర్యలు దేశ భధ్రతకు ముప్పు తెస్తాయని హెచ్చరించారు. ప్రభుత్వ రంగ సం స్థల ప్రైవేటీకరణ నిర్ణయాలకు వ్యతిరేకంగా మరింత ఉధృతమైన పోరాటాలను చేపట్టాలని నిర్ణయించారు.
ఆదాయమిచ్చే సంస్థలనూ కోదండరామ్
సమావేశంలో ప్రొఫెసర్ కోదండరామ్ మాట్లాడుతూ ప్రభుత్వానికి ఆదాయాన్ని అందించే ప్రభుత్వ రంగ సంస్థలను కూడా ప్రైవేటీకరిస్తే భవిష్యత్‌లో ప్రభుత్వం దేశాన్ని ఎలా పరిపాలిస్తుందని ప్రశ్నించారు. ప్రభుత్వం ప్రజలను విస్మరించే ఆర్థిక విధానాలను అమలు కొత్త సమస్యలు ఉత్పన్నమౌతాయని హెచ్చరించారు. కరోనా సమయంలో ప్రజలకు ఉద్దీపన ప్యాకేజీల పేరుతో ప్రజావ్యతిరేక ఆర్డినెన్స్‌లు తీసుకువస్తుందని అర్ధరహితమన్నారు. విద్యుత్ సవరణ బిల్లు పేరుతో రాజ్యాంగం రా ష్ట్రాలకు కల్పించిన పాత్రను తొలగించే చర్యలను కేంద్రం చేపట్టడం గర్హనీయమన్నారు.
ప్రైవేటీకరణతో బిజెపికి ప్రతిపక్షమే నారాయణ
డాక్టర్ కె.నారాయణ మాట్లాడుతూ ప్రపంచమంతా కరోనా భయంతో పరుగులుతీస్తుంటే దేశంలో బిజెపి మాత్రం ప్రైవేటీకరణ పరుగుపందెం వైపు చర్యలు చేపడుతున్నదని విమర్శించారు. పార్లమెంట్, మంత్రివర్గం ఆమోదం పొందకుండానే ప్రభుత్వం ఏకపక్షంగా ఆర్డినెన్స్ లు తెస్తుందని, ప్రైవేటీకరణ నిర్ణయాలు అమలు చే స్తుందని, బిజెపి ప్రభుత్వ చర్యలు ఇదే విధంగా కొనసాగించి ప్రతిపక్షంలో కూర్చుంటామంటే త మకు అభ్యంతరం లేదన్నారు. ప్రైవేటీకరణ చే యాలని చూస్తున్న ఎయిర్ ఇండియా, రైల్వే తదితర సంస్థలే కరోనా కష్ట కాలంలో ప్రజలను, ప్ర భుత్వాన్ని ఆదుకుంటున్నాయనే విషయాన్ని గు ర్తుంచుకోవాలన్నారు. కేంద్ర విద్యుత్ సవరణ బిల్లు ఫెడరల్ స్ఫూర్తికి విరుద్దమన్నారు. రాష్ట్ర హ క్కులను, ప్రయోజనాలను కూడా కాపాడుకోలేని సిఎం కెసిఆ ర్ సిఎంగా ఎలా ఉంటారని ఆయన ప్రశ్నించారు. రాజకీయాలకు అతీతంగా కేంద్ర ప్రభుత్వ ప్రైవేటీకరణ, కార్పోరేటీకరణ చర్యలకు వ్యతిరేకంగా ప్రజల్లోకి వెళ్ళాలని, అవసరమైతే కరోనా పిపిఇ కిట్లు వేసుకునైనా పెద్ద సంఖ్యలో ప్రజాఉద్యమాలు చేపట్టాలన్నారు.
ఆత్మనిర్భర్ కాదు ఆత్మగౌరవం తాకట్టు చాడ
చాడ వెంకట్‌రెడ్డి మాట్లాడుతూ ఆత్మనిర్భర్ పేరుతో కేంద్ర ప్రభుత్వం దేశ స్వావలంబనను, ఆత్మ గౌరవాన్ని తాకట్టు పెడుతుందని, స హజ వనరులను కొల్లగొడుతున్నదని, వ్యవసాయ రంగ ఆర్డినెన్స్‌లతో రైతుల పరిస్థితి మరింత దయనీయంగా మారే ప్రమాదముందన్నారు. న ష్టాలు వస్తున్నాయని ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరిస్తున్న ప్రభుత్వం కార్పోరేట్ సంస్థలకు దాదాపు 10.54 లక్షల కోట్ల రుణాలను మాఫీ చేసిందని, ఈ చర్య దేశాన్ని లూటీ చేయడమేనని ఆగ్రహం వ్యక్తం చేశారు. బిజెపి ప్రైవేటీకరణ చర్యలను స హిస్తే భవిష్యత్‌లో ప్రభుత్వ రంగ సంస్థలు లేకుండాపోయే ప్రమాదముందని, రాజకీయపార్టీలు, కార్మిక, ఉద్యోగ వర్గాలు, ప్రజలు ఐక్యంగా వాటిని కాపాడుకుందామన్నారు. విద్యుత్ సవరణ బిల్లు, బొగ్గు గనుల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా టిఆర్‌ఎస్ ప్రభుత్వం ప్రకటనలు చేసినప్పటికీ కేంద్రంపై వత్తిడి తెచ్చేందుకు ఉద్యమ కార్యాచరణకు కలిసి రావాలని చేసిన విజ్ఞప్తిపై టిఆర్‌ఎస్ నుంచి స్పంద న రాలేదన్నారు.
వనరులు ప్రజలకు దూరం గోవర్ధన్
కె.గోవర్ధన్ మాట్లడుతూ గతంలో దేశ వనరు లు ప్రజలకు దక్కాలని పాలకులు అందు కు అనువైన విధానాలను అవలంభిస్తే ఇప్పుడు బిజెపి ప్ర భుత్వం వాటిని ప్రజలకు దూరం చేసే విధానాలను అమలు చేస్తుందన్నారు. వి.ఎస్. బోస్ మాట్లాడుతూ తాము అధికారంలోకి వస్తే ప్రస్తుతం బిజెపి చేపడుతున్న ప్రైవేటీకరణ ఒప్పందాలను రద్దు చేస్తామని, ప్రభుత్వ సంస్థలన్నింటి నీ స్వాధీనం చేసుకుంటామని ప్రకటించే ప్రత్యామ్నాయ రాజకీయ శక్తి కోసం కార్మిక వర్గం ఎదురుచూస్తుందని, అలాంటి శక్తితో కార్మికవర్గం కలిసి పోరాటాలు చేస్తుందన్నారు. కేంద్ర ప్రభు త్వ కార్మిక వ్యతిరేక చర్యలపై ఇప్పటికే కార్మిక వర్గం తీవ్ర నిరసన తెలిపిందని, తిరిగి మరోసారి ఆగస్టు 9న దేశవ్యాప్త నిరసన కార్యక్రమాన్ని పడుతున్నట్లు వెల్లడించారు.పశ్యపద్మ మాట్లాడు తూ చేస్తూ కేంద్ర ప్రభుత్వం రైతులను కార్పోరేట్లకు ఊడిగం చేయించేందుకు వ్యవసాయ రంగ ఆర్ధినెన్స్‌ను తీసుకువచ్చిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి చర్యలపై ఛత్తీస్‌ఘడ్ హైకోర్టులో రైతులు కేసు దాఖలు చేయగా కోర్టు ప్రభుత్వానికి నోటీసు లు జారీచేసిందని తెలిపారు. ప్రభుత్వ సంస్థల ప్రైవేటీకరణను ఉపసంహరించుకోవాలని ప్రజా పోరాటాలు చేస్తూనే న్యాయపోరాటాన్ని కూడా చేపట్టాలని, ప్రధానితో పాటు రాష్ట్రపతికి లేఖ రాయాలని, అదే విధంగా విద్యుత్ సవరణ బిల్లు, బొగ్గు గనుల ప్రైవేటీరణపై నిలదీసే విధంగా సిఎం కెసిఆర్‌కు కూడా లేఖ రాయాలని ఆమె సూచించారు.
కేంద్రం, దొందు దొందే : సంపత్, పొన్నం
సంపత్ మాట్లాడుతూ బిజెపి ప్రభుత్వానికి వత్తాసు పలికే సంస్థలకు ప్రభుత్వరంగ సంస్థలను కట్టబెట్టేందుకు ప్ర యత్నిస్తున్నారని విమర్శించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వా లు రెండూ దొంగలేనని కేంద్రం వ్యవసాయ ఆర్డినెన్స్ తీసుకురాగా, రాష్ట్రంలో కావేరీ సీడ్స్ లాంటి సంస్థలకు లాభం చేకూర్చేందుకు టిఆర్‌ఎస్ ప్రభుత్వం నిర్భంధ సాగు, ఒప్పంద సాగు విధానాలను అమలు చేస్తున్నదన్నారు. విద్యుత్ సవరణ బిల్లు పేరుతో రాష్ట్రల విద్యుత్ సంస్థలను కేంద్రం చేతుల్లోకి తీసుకునేందుకు ప్రయత్నిస్తుందన్నారు. పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ బిజెపి ప్ర భుత్వం స్వావలంబన స్ఫూర్తిని దెబ్బతీస్తూ దేశానికి వన్నె తెచ్చిన ఎల్‌ఐసి మొదలు ఎయిర్ ఇండియా సంస్థ ల వరకు అన్నింటినీ ప్రైవేటీకరణ పాల్పడడం సిగ్గుచేటన్నారు. కేంద్ర ప్రభుత్వంలోని ఎక్కువ మంది మంత్రు లు వ్యాపారవేత్తలైనందున ఆ దృష్టితోనే ప్రభుత్వ విధానాలను ఆలోచిస్తున్నారని విమర్శించారు.
బొగ్గుగని కార్మికులను చీకట్లోకి ఎల్.రమణ
ఎల్.రమణ మాట్లాడుతూ పేదలు ఇబ్బందిపడే విధంగా కేంద్ర ప్రభుత్వ విధానాలున్నాయని, అందుకు తగిన ప్రతిఘటన తప్పదని, తెలంగాణ ఉద్యమం సందర్భంగా బొగ్గుగని కార్మికులకు వెలుగులు చూపిస్తామని చెప్పిన టిఆర్‌ఎస్ నేతలు ఇప్పుడు వారి బతుకుల్లో చీకట్లు కమ్ముకుంటున్నా స్పందించడం లేదన్నారు.