మళ్లించేందుకు కమ్యూనిస్టులుగా మనమంతా కృషిచేయాలి
ఇది కీలక ఏడాది
సిపిఐ జాతీయ సమితి సమావేశాల్లో పార్టీ ప్రధాన కార్యదర్శి డి.రాజా
పుదుచ్చేరి : ప్రస్తుత సంవత్సరం దేశ రాజకీయాలకు కీలక సంవత్సరమని సిపిఐ ప్రధాన కార్యదర్శి డి.రాజా చెప్పారు. మూడురోజులపాటు పుదుచ్చేరీలో జరుగుతున్న పార్టీ జాతీయ సమితి సమావేశాలలో మొదటిరోజు ఆదివారం డి.రాజా రాజకీయ నివేదిను ప్రవేశపెడుతూ, దేశ రాజకీయాలను సెంటర్ ఆఫ్ లెఫ్ట్ (మధ్యేవాద వామపక్ష మార్గానికి) వైపు మళ్లించడానికి కమ్యూనిస్టులుగా మనం కృషి చేయాలని చెప్పారు. ఈ సమావేశాలకు పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యులు ఎ.వనజ, బంత్ సింగ్ బ్రార్, సలీమ్ అధ్యవర్గంగా వ్యవహరిస్తున్నారు. త్రిపురతోపాటు
నాగాలాండ్‌లో కమ్యూనిస్టుపార్టీ మొదటిసారిగా శాసనసభకు పోటీ చేసిన విషయాన్ని వివరించారు. కర్ణాటక, చత్తీస్‌గఢ్, తెలంగాణ, రాజస్థాన్ నాలుగు రాష్ట్రాల శాసనసభలకు కూడా ఎన్నికలు జరగబోతున్న విషయాన్ని డి.రాజా ప్రస్తావించి, విజయవాడలో జరిగిన పార్టీ 24వ జాతీయ మహాసభలు రూపొందించిన మార్గదర్శకాల ప్రకారం మన ఎన్నికల ఎత్తుగడలు ఉండాలని చెప్పారు. పల్లబ్‌సేన్ గుప్తా మాట్లాడుతూ, బ్రెజిల్, పెరూ, నేపాల్, చైనా తదితర దేశాలలో జరుగుతున్న అంతర్జాతీయ పరిణామాలను వివరించారు. దేశంలోని వివిధ ప్రాంతాల నుండి పార్టీ జాతీయ సమితి సభ్యులు ఈ సమావేశాలకు హాజరయ్యారు. అంతకుముందు జాతీయ కార్యవర్గ సమావేశం జరిగింది. అంబేద్కర్ జయంతి ఏప్రిల్ 14 నుండి కార్మిక దినోత్సవం మే 1 వ తేదీ వరకూ ప్రజా సమస్యలపై పాదయాత్రలు నిర్వహించాలని కార్య్దవర్గం తరపున డి.రాజా ప్రతిపాదించారు. రానున్న ఎన్నికలను ఎదుర్కోవడానికి, పార్టీ నిర్మాణాన్ని పటిష్టపరచుకోవడానికి అవసరమైన నిధి సేకరణకు ప్రత్యేక కార్యక్రమాన్ని చేపట్టాలని ఆయన తెలియజేశారు.