200 మందికిపైగా ప్రసిద్ధ రచయితల సంయుక్త ప్రకటన
పనాజి: “ద్వేష రాజకీయాలకు వ్యతిరేకంగా మనం ఓటు చేద్దాం. సమానమైన, భిన్నత్వంతో కూడిన భారత్ కొరకు ఓటు చేద్దాం.” ఇది వి విధ రాష్ట్రాలకు చెందిన 200 మందికిపైగా ప్ర సిద్ధ రచయితలు ఓటర్లకు చేసిన విజ్ఞప్తి. ఇండియన్ రైటర్స్ ఫోరం తరఫున కె.సచ్చిదానందన్, గీతా హరిహరన్ సోమవారంనాడు ఇ మెయిల్ ద్వారా ఈ ప్రకటన విడుదల చేశారు. దానిపై సంతకందారుల్లో ఘోష్, రొమిల్లా థాపర్, అరుంధతిరాయ్, జెర్రీ పింటో, కెకి దా రువాలా, హర్ష మందిర్, రంజత్ హోస్కెటె, ఆర్.ఉన్ని, ఆనంద్ టెల్‌టుండ్డె, జోయా హసన్, గిరీష్ కర్నాడ్ ఉన్నారు. హిందీ, ఇంగ్లీషు, పం జాబీ, మరాఠీ, గుజరాతీ, బంగ్లా, మళయాళం, కన్నడ, తెలుగు, తమిళ్, ఉర్దూ, కశ్మీరీ, కొంకణి భాషా రచయితలు వారిలో ఉన్నారు.
ఆ ప్రకటన ఇలా తెలిపింది
“రానున్న ఎన్నికలకు మన దేశం నాలుగు రోడ్ల కూడలిలో ఉంది. మన రాజ్యాంగం తన పౌరులందరికీ సమాన హక్కులు హామీ ఇచ్చింది; ఇష్టమైనది భుజించే స్వేచ్ఛ, ప్రార్థనా స్వేచ్ఛ, ఎంచుకున్న మార్గంలో జీవించే స్వేచ్ఛ, భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ, అసమ్మతి తెలిపే హక్కు ఇచ్చింది. అయితే మతం, కులం, లింగం కారణంతో లేదా వారు ఏ ప్రాంతం నుండి వచ్చార న్న కారణంతో పౌరులను గుంపులు హత్య చే యటం లేదా దాడిచేయటం లేదా వివక్షకు గురిచేయటం గత నాలుగేళ్లలో మనం చూస్తు న్నాం.“దేశాన్ని విభజించటానికి, భయోత్పాతం సృష్టించటానికి, పూర్తిస్థాయి పౌరులుగా జీవించటాన్నుండి రానురాను ఎక్కువమంది ప్రజల ను మినహాయించటానికి ద్వేష రాజకీయాలు ఉపయోగించబడుతున్నాయి. రచయితలు, కళాకారులు, చిత్రదర్శకులు, సంగీతకారులు ఇతర సాంస్కృతిక ప్రతిభులను వేటాడుతున్నారు, బెదిరింపులకు గురిచేస్తున్నారు, సెన్సార్‌కు గురిచేస్తున్నారు. అధికారంలో ఉన్న వారిని ప్రశ్నించే వారు వేధింపులు, తప్పుడు, బూటకపు ఆరోపణలపై అరెస్టు ప్రమాదం ఎదుర్కొంటున్నారు. “ఇది మారాలని మేమంతా కోరుకుంటునాన. హేతువాదులు, రచయితలు, హక్కుల కార్యకర్తలను వేధించటాన్ని , హత్యచేయటాన్ని మేము కోరుకోవటం లేదు. మహిళలు, దళితులు, ఆదివాసీలు, మైనారిటీ సముదాయాలపై వాచా లేక చర్యరూపంలో హింసపై కఠిన చర్యలను మేము కోరుతున్నాం. అందరికీ ఉద్యోగాలు, విద్య, రీసెర్చి, ఆరోగ్య సంరక్షణ, సమానావకాశాల కొరకు నిధులు, చర్యలను మేము కోరుతున్నాం.. మన ప్రజలను విభజించేవారిని ఓడించడం, అసమానతను ఓడించండి, హింస, బెదిరింపు, సెనార్‌కు వ్యతిరేంగా ఓటు చేయండి; మన రాజ్యాంగం ఇచ్చిన హామీలను పునరుద్ధరించే భారతదేశం కొరకు మనం ఓటు చేయాల్సిన మార్గం ఇదొక్కటే. అందువల్ల, భిన్నత్వంతో కూడిన, సమాన భారత్ కొరకు ఓటు చేయాలని పౌరులందరికీ మేము విజ్ఞప్తుచేస్తున్నాం.” గత నెలలో 103 మంది భారతీయ సినీ దర్శకులు కూడా భారత ఓటర్లకు ఈ తరహా విజ్ఞప్తినే చేశారు. 2019 ఎన్నికల్లో ఫాసిజాన్ని ఓడించాల్సిందిగా వారంతా కోరారు. వారిలో ఆనంద్ పట్వర్ధన్, సనత్‌కుమార్ శశిధరన్, దేవాశిష్ మంజీజా తదితరులు ఉన్నారు.
దేశ రాజకీయాలకు వ్యతిరేకంగా ఓటు చేయండి
RELATED ARTICLES