నాలుగేళ్లలోనే రాష్ట్రం అద్భుత ప్రగతి సాధించింది
వర్షాకాలంలోగా కాళేశ్వరం ప్రాజెక్ట్ పూర్తి
టింబర్ స్మగర్లను ఉక్కుపాదంతో అణచివేస్తాం
గణతంత్ర దినోత్సవ వేడుకల్లో గవర్నర్ నరసింహన్
హైదరాబాద్: దేశ నిర్మాణంలో తెలంగాణ క్రియాశీల పాత్ర పోషిస్తుందని రాష్ట్ర గవర్నర్ ఇఎస్‌ఎల్ నరసింహన్ అన్నారు. రాష్ట్రం ఏర్పడిన నాలుగేళ్లలోనే రా ష్ట్రం అద్భుత ప్రగతి సాధించిందని, అనేక రాష్ట్రాలకు తెలంగాణ రోల్‌మాడల్‌గా మారిందని చెప్పారు. ప్రజా ఆరోగ్య విషయంలో అత్యున్నత ప్రమాణాలను పాటించడంలో దేశంలోని మూడు రాష్ట్రాలలో తెలంగాణ రాష్ట్రం ఒకటని నీతి అయోగ్ తెలిపిందన్నారు. రాష్ట్ర వృద్ధి రేటు నవంబర్ వరకు 29.93 వృద్ధిని సాధించడం దేశంలోనే మొదటిసారి అని అన్నారు. ప్రభుత్వ పనితీరు, అవినీతి నిర్మూలనకు ఇది అద్దం పడుతుందన్నారు. ఎన్నికల సం దర్భంగా ప్రజలకు ఇచ్చిన అనేక హామీల అమలుకు కా ర్యాచరణను రూపొందిస్తామన్నారు. సిఎం కెసిఆర్ పాలనలో అన్ని రంగాల్లో రాష్ట్రం ప్రగతి పథంలో దూసుకుపోతుందన్నారు. ‘70వ గణతంత్ర’ వేడుకల్లో భాగంగా పరేడ్‌గ్రౌండ్‌లో శనివారం గవర్నర్ నరసింహన్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం ఆయన సాయు ధ బలగాల నుంచి గౌరవవందనం స్వీకరించారు. వేడుకలలో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు, శాసనసభ స్పీ కర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి, శాసనమండలి చైర్మన్ కె. స్వామిగౌడ్, హోంమంత్రి మహమూద్‌అలీ, టిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె.తారకరామారావు, మాజీ మంత్రు లు జి.జగదీశ్‌రెడ్డి, ఎంపిలు ఎ.పి.జితేందర్‌రెడ్డి, బండా రు దత్తాత్రేయ, ఎంఎల్‌సి పొంగులేటి సుధాకర్‌రెడ్డి, ప్ర భుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్‌శర్మ, ప్రభుత్వ ప్రధా న కార్యదర్శి ఎస్.కె. జోషి, డిజిపి మహేందర్‌రెడ్డి, తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా గవర్నర్ ప్రసంగిస్తూ స్వాతంత్య్రం కోసం పోరాడిన ఎందరో మహానీయులను, త్యాగమూర్తులను, రాజ్యంగ నిర్మాతలను స్మ రించుకోవడం మన విధి అని, వారి త్యాగాల ఫలితంగా నే వేడుకలను జరుపుకుంటున్నామని, వారి ఆశయాల మేరకు రాష్ట్ర సమగ్ర అభివృద్ధికి ప్రభుత్వం అనేక కార్యక్రమాలను చేపడుతుందన్నారు. సంక్షేమ, అభివృద్ధి పథకాలు రాష్ట్ర ప్రజల హృదయాలను గెలుచుకున్నాయని, అందుకే ఇటీవల జరిగిన ఎన్నికల్లో ప్రజలు మరోసారి కెసిఆర్ ప్రభుత్వానికి పట్టం కట్టారని తెలిపారు. ప్రజానుకూల విధానాలను ప్రవేశపెట్టారన్నారు. సంక్షేమ పథకాలు, అద్భుతంగా ఉన్నాయన్నారు. గత నాలుగున్నరేళ్ల కాలంలో రాష్ట్ర నిర్మాణానికి మంచి అడుగులుపడ్డాయ ని, వినూత్న ఆలోచనలలతో సిఎం కెసిఆర్ అన్ని రంగా ల్లో అభివృద్ధి దిశగా రాష్ట్ర పునర్‌నిర్మాణ చర్యలు చేపట్టారన్నారు. బలమైన నాయకత్వం వల్ల సానుకూలత చేకూరిం దన్నారు. ప్రతి ఏటా రూ. 40వేల కోట్లతో రాష్ట్రంలో సంక్షేమ పథకాలను అమలు చేస్తుందన్నారు. ఇటీవల జ రిగిన ఎన్నికల్లో ఆసరా పెన్షన్ లబ్ధిదారుల వయసును 57ఏళ్లకు కుదించడంతో పాటు రెట్టింపు పెన్షన్ ఇస్తానని చెప్పిన హామీని అమలు చేయబోతున్నట్లు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం మానవ అభివృద్ఢికి అధిక ప్రాధాన్యతనిస్తుందని, విద్య, వైద్యం, మౌలిక సదుపాయాల కల్పనకు అనేక చర్యలు తీసుకుంటుందన్నారు. పరిపాలనా సౌల భ్యం కోసం 31 జిల్లాలకు తోడుగా త్వరలో మరో రెండు నారాయణపేట, ములుగు జిల్లాలను ఏర్పాటు చేయబోతున్నామని తెలిపారు. తండాలను గ్రామ పంచాయతీలు గా మార్చామన్నారు. తద్వారా 3,146 ఎస్‌సి అభ్యర్థులు గ్రామ సర్పంచ్‌లుగా ఎన్నికకానున్నారని తెలిపారు. స మగ్ర ప్రణాళికతో రవాణారంగాన్ని అభివృద్ధి చేస్తున్నామని, ప్రస్తుతం తెలంగాణలో 5,677 కిలోమీటర్ల జా తీయ రహదారులు ఉన్నాయన్నారు. హైదరాబాద్ శివా రు చుట్టూ 340 కిలోమీటర్ల వరకు రీజినల్ రింగ్ రోడ్ ఏర్పాటు చేయాలని నిర్ణయించిందన్నారు. యుద్ధప్రాతిపదికన అన్ని రహదారులకు మరమ్మతులు చేపట్టాలని, 12,751 గ్రామాల్లో బిటి రోడ్లు ఏర్పాటుచేయాలని ప్ర భుత్వం నిర్ణయించిందని పేర్కొన్నారు. మూసీనది పరివాహకం చుట్టూ అందమైన గార్డెన్‌లను ఏర్పాటు చేస్తామని, దీనిని ఒక పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేస్తామన్నారు. ఉస్మాన్, హిమాయత్ సాగర్ రిజర్వాయర్లను కాళేశ్వరంతో అనుసంధానం చేస్తామన్నారు.
దేశనిర్మాణంలో తెలంగాణ క్రియాశీలపాత్ర
RELATED ARTICLES