24 గంటల్లో రికార్డుస్థాయిలో 13,586 కొత్త కేసులు
భారత్‌లో 3.80 లక్షలు దాటిన బాధితులు
తాజాగా 336 మంది మృతి, 12,573కు చేరిన మృతులు
న్యూఢిల్లీ : భారత్‌లో కరోనా మహమ్మారి విజృంభణ ఆగడం లేదు. మరోసారి రికార్టు స్థాయిలో కొత్త కేసులు నమోదయ్యాయి. వరుసగా 8వ రోజు కూడా 10 వేలకు పైగా మంది కరోనా బారిన పడ్డారు. గురువారం ఉదయం నుంచి శుక్రవారం ఉదయం వర కు 24 గంటల్లోనే అత్యధిక సంఖ్యలో 13,586 మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. దేశంలోకి వైరస్ ప్రవేశించినప్పటి నుంచి ఇంత పెద్ద మొత్తంలో కేసులు నమోదు కావడం ఇదే తొలిసారి. తాజా కేసులతో కలిపి భారత్‌లో ఇప్పటి వరకు మొత్తం 3,80,532 మందికి మహమ్మారి సోకింది. జూన్ 1 నుంచి 19వ తేదీ వరకు 1,89,997 మందికి కరోనా బారిన పడడం ఆందోళన కలిగిస్తోంది. బాధితల సంఖ్య పెరుగుతున్న టాప్ పది రాష్ట్రాల్లో మహారాష్ట్ర, తమిళనాడు, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్‌లు ఉన్నాయి. ఈ రాష్ట్రాల్లో నిత్యం తీవ్రస్థాయిలో కొత్త కేసులు వస్తున్నాయి. మరణాల సంఖ్య కూడా నిత్యం పెరుగుతూనే ఉంది. రోజుకు 300లకు పైగా మంది మృత్యువాత పడుతున్నారు. 24 గంటల్లో కొత్తగా 336 మంది కరోనా కాటుకు బలయ్యారు. దీంతో మొత్తం మృతుల సంఖ్య 12,573కు చేరినట్లు కేంద్ర వైద్య ఆరోగ్య మంత్రిత్వశాఖ పేర్కొంది. అయితే వైరస్ బారి నుంచి కోలుకున్న వారి సంఖ్య 2 లక్షలు దాటడం శుభపరిణామంగా భావిస్తున్నారు. శుక్రవారం ఉదయం నాటికి దేశంలో 1,63,248 యాక్టివ్ కేసులు ఉండగా, 2,04,710 మంది వైరస్ నుంచి కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. రికవరీ రేటు 53.79గా ఉన్నట్లు మంత్రిత్వశాఖకు చెందిన ఒక అధికారి చెప్పారు. ప్రపంచంలో కరోనా మరణాల సంఖ్య ఎక్కువగా ఉన్న దేశాల జాబితాలో భారత్ ప్రపంచంలోనే ఎనిమిదో స్థానంలో కొనసాగుతోంది. పాజిటివ్ కేసుల సంఖ్యలో మాత్రం భారత్ ప్రపంచంలో నాలుగో స్థానంలో ఉంది. రోజువారీగా చూస్తే, అమెరికా, బ్రెజిల్, భారత్‌లలోనే నిత్యం పదివేల చొప్పున పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. ఇదిలా ఉండగా, బుధవారం ఉదయం నుంచి మహారాష్ట్రలో కొత్తగా 114 మంది, ఢిల్లీలో 65 మంది, తమిళనాడులో 49 మంది, గుజరాత్‌లో 31, ఉత్తరప్రదేశ్‌లో 30, కర్నాటక, పశ్చిమ బెంగాల్‌లో 12 మంది చొప్నున, రాజస్థాన్‌లో 10 మంది, జమ్మూకశ్మీర్‌లో ఆరుగురు, పంజాబ్‌లో ఐదుగురు, హర్యానా, మధ్యప్రదేశ్‌లో నలుగురు చొప్పున, తెలంగాణలో ముగ్గురు, ఆంధ్రప్రదేశ్‌లో ఇద్దరు, అసోం, జార్ఖండ్, కేరళలో ఒకరు చొప్పున కరోనా కాటుకు బలయ్యారు. ఇప్పటి వరకు సంభవించిన మొత్తం 12,573 మరణాల్లో మహారాష్ట్రలోనే అత్యధికంగా 5,751 మంది కరోనా వైరస్ సోకడం వల్ల ప్రాణాలు వదిలారు. దేశ రాజధాని ఢిల్లీలో 1,969 మంది, గుజరాత్‌లో 1,591 మంది మృతి చెందారు. తమిళనాడులో 625 మంది, పశ్చిమ బెంగాల్‌లో 518, మధ్యప్రదేశ్‌లో 486, ఉత్తరప్రదేశ్‌లో 465, రాజస్థాన్‌లో 323, తెలంగాణలో 195, హర్యానాలో 134, కర్నాటకలో 114, ఆంధ్రప్రదేశ్‌లో 92, పంజాబ్‌లో 83, జమ్మూకశ్మీర్‌లో 71, బీహార్‌లో 44 మంది, ఉత్తరాఖండ్‌లో 26 మంది, కేరళలో 21 మంది, ఒడిశాలో 11 మంది, జార్ఖండ్‌లో 11 మంది, ఛత్తీస్‌గఢ్‌లో 10 మంది, అసోంలో 9 మంది, హిమాచల్‌లో 8 మంది, పుదుచ్చేరిలో ఏడుగురు, చండీగఢ్‌లో ఆరుగురు, మేఘాలయ, త్రిపుర, లడఖ్‌లో ఒకరు చొప్పు మృతి చెందినట్లు మంత్రిత్వశాఖ తెలిపింది. ఇప్పటి వరకు నమోదైన మరణాల్లో 70 శాతం మంది ఇతర ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న వారేనని పేర్కొంది. ఇక రాష్ట్రాల వారీగా కేసులు చూస్తే అత్యధిక కేసులు మహారాష్ట్రలోనే నమోదయ్యాయి. 1,20,504 కేసులతో రాష్ట్రం దేశంలోనే తొలి స్థానంలో కొనసాగుతుంది. తమిళనాడులో 52,334 కేసులు నమోదయ్యాయి. ఇక ఢిల్లీలో 49,979, గుజరాత్‌లో 25,601, ఉత్తరప్రదేశ్‌లో 15,181, రాజస్థాన్‌లో 13,857, పశ్చిమ బెంగాల్‌లో 12,735, మధ్యప్రదేశ్‌లో 11,426, హర్యానాలో 9,218, కర్నాటకలో 7,944, ఆంధ్రప్రదేశ్‌లో 7,518, బీహార్‌లో 7,025, తెలంగాణలో 6,027, జమ్మూకశ్మీర్‌లో 5,555, అసోంలో 4,777, ఒడిశాలో 4,512, పంజాబ్‌లో 3,615, కేరళలో 2,794, ఉత్తరాఖండ్‌లో 2,102, ఛత్తీస్‌గఢ్‌లో 1,946, జార్ఖండ్‌లో 1,920, త్రిపురలో 1,155, గోవాలో 687 మంది, లడఖ్‌లో 687, మణిపూర్‌లో 606, హిమాచల్‌లో 595 మందికి కరోనా సోకింది. అదే విధంగా చండీగఢ్‌లో 374, పుదుచ్చేరిలో 271, నాగాలాండ్‌లో 193 కేసులు ఇప్పటి వరకు నమోదయ్యాయి. ఇక మిజోరాంలో 130, అరుణాచల్‌లో 103, సిక్కింలో 70, దాదర్ నగర్ హవేలీ, దామన్ డియోలో కలిపి 58, మేఘాలయ, అండమాన్ నికోబార్‌లో 44 కేసులు నమోదయ్యాయి. మరో 8,927 కేసులుకు సంబంధించి రాష్ట్రాలు వెల్లడిస్తాయని ఆరోగ్యమంత్రిత్వశాఖ వెల్లడించింది. ఇదిలా ఉండగా, ఈనెల 18వ తేదీ వరకు మొత్తం 64,26,627 శాంపిల్స్‌కు పరీక్షలు నిర్వహించినట్లు ఐసిఎంఆర్ వ్లెలడించింది. కేవలం గురువారం ఒక్క రోజే 1,76,959 మంది నమూనాలను పరీక్షించారు. ఒక్క రోజే ఇంత పెద్ద ఎత్తున పరీక్షలు నిర్వహించడం ఇదే ప్రథమం.
దేశంలో మహమ్మారి విజృంభణ
RELATED ARTICLES