HomeNewsBreaking Newsదేశంలో బిఆర్‌ఎస్‌ అధికారంలోకి వస్తే ఫ్రీ కరెంట్‌, ‘అగ్నిపథ్‌' రద్దు

దేశంలో బిఆర్‌ఎస్‌ అధికారంలోకి వస్తే ఫ్రీ కరెంట్‌, ‘అగ్నిపథ్‌’ రద్దు

ప్రైవేటీకరించిన ప్రభుత్వ సంస్థలన్నింటినీ తిరిగి జాతీయం చేస్తాం
ఖమ్మం సభలో ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు
ప్రజాపక్షం/ ఖమ్మం
దేశంలో ప్రధాని మోడీ కార్పొరేట్‌ అనుకూల పాలన చేస్తూ ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటుపరం చేస్తున్నారని, బిఆర్‌ఎస్‌ అధికారంలోకి వస్తే ప్రైవేటీకరణ జరిగిన అన్ని సంస్థలను తిరిగి జాతీయం చేస్తామని, దేశమంతా ఉచిత విద్యుత్‌ ఇస్తామని, ‘అగ్నిపథ్‌’ పథకాన్ని రద్దు చేస్తామని బిఆర్‌ఎస్‌ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ప్రకటించారు. త్వరలో బిజెపి ఇంటికి పోవడం కేంద్రంలో బిఆర్‌ఎస్‌ అధికారంలోకి రావడం జరుగుతుందని అన్నారు. ఖమ్మంలో బుధవారం జరిగిన బిఆర్‌ఎస్‌ ఆవిర్భావ సభలో అశేష ప్రజానీకాన్ని ఉద్దేశించి ముఖ్యమంత్రి కెసిఆర్‌ మాట్లాడుతూ కాం గ్రెస్‌, బిజెపి దొందూ దొందేనని విమర్శించారు. ఎన్నికల్లో గెలుపొటములు సహాజమని, గెలిచే వాడు, ఓడేవాడు ఉంటాడని కానీ దేశం కోసం ఆలోచన చేయాల్సిన పరిస్థితి ఇప్పుడు ఆసన్నమైందన్నారు. దారితప్పిన దేశాన్ని బిత్తరపోయి గత్తరపడుతున్న పరిస్థితులలో ఎంతో ఆవేదన చెందిన తర్వాత తీవ్రంగా ఆలోచించి ప్రజలను చైతన్యం చేయడానికి బిఆర్‌ఎస్‌ ఏర్పాటు చేశామన్నారు. స్వయం సమృద్ధి భారత్‌ను నిర్మించడమే బిఆర్‌ఎస్‌ లక్ష్యమన్నారు. దేశ సంపదను సద్వినియోగం చేయడంతో పాటు ఉచిత విద్యుత్‌, రైతుబంధు, ఇతర పథకాలను దేశ వ్యాప్తంగా అమలు చేస్తామని చెప్పారు. దాదాపు 4.10 లక్షల మెగావాట్ల విద్యుత్‌ తయారయ్యే అవకాశం ఉందని, కానీ 2.10 లక్షల మెగావాట్లను కూడా వాడుకోలేక పోతున్నామని, బిఆర్‌ఎస్‌కు అధికారమిస్తే దేశ వ్యాప్తంగా 24 గంటలు ఉచిత విద్యుత్‌ ఇవ్వడంతో పాటు రెండేళ్లలోనే వెలుగుజిలుగుల భారత్‌ను నిర్మిస్తామని కెసిఆర్‌ హామీ ఇచ్చారు. కాళేశ్వరాన్ని నిర్మించుకున్నామని, పాలమూరు, సీతారామ లాంటి ప్రాజెక్టుల నిర్మాణం జరుగుతుందని దేశంలో ఇటువంటి ప్రాజెక్టుల నిర్మాణం చేసి నదీ జలాలను పొలాలకు మళ్లిస్తామని కెసిఆర్‌ తెలిపారు. బిజెపి కేంద్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రాల హక్కులను హరిస్తూ ఫెడరల్‌ స్ఫూర్తిగా విరుద్దంగా వ్యవహరిస్తుందన్నారు. ప్రతిపక్ష పాలిత రాష్ట్రాలలో గవర్నర్లను ఉసిగొల్పి పాలనకు ఇబ్బందులు కలిగిస్తుందని కెసిఆర్‌ ఆగ్రహం వ్యక్తం ఆరోపించారు. బిజెపి నేతలు లొడలొడ మాట్లాడడం తప్ప పాలనపై దృష్టి లేదని, మన దేశంలో ఇప్పటికీ రాష్ట్రాల మధ్య నీటి పంపకాలపై పోరాటాలు జరుగుతున్నాయన్నారు. గోదావరి జలాల విషయంలో మహారాష్ట్ర, కర్నాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ల మధ్య కావేరి విషయంలో కర్నాటక, తమిళనాడుల మధ్య ఇలా దేశంలో అనేక రాష్ట్రాల మధ్య నీటి పంచాయతీలు ఉన్నాయని, కానీ వీటిని పరిష్కరించేందుకు బిజెపి ప్రభుత్వం ఏనాడు చొరవ చూపలేదన్నారు. మోడీ చెప్పిన ‘మేక్‌ ఇన్‌ ఇండియా’ ఇప్పుడు దేశంలో ‘జోక్‌ ఇన్‌ ఇండియా’ మాదిరిగా మారిపోయిందన్నారు. ఎవరిని అప్పు అడగాల్సిన పరిస్థితి లేకుండా, అమెరికా లేదా ప్రపంచ బ్యాంకు కాళ్లు మొక్కాల్సిన అవసరం లేనివిధంగా దేశంలో సహాజ సంపద ఉన్నా యాచకులుగా నిలవాల్సిన పరిస్థితి ఎందుకు ఏర్పడిందని ఎసిఆర్‌ ప్రశ్నించారు. సుమారు 19 ఏళ్ల క్రితం బ్రిజేష్‌కుమార్‌ ట్రిబ్యునల్‌ను ఏర్పాటు చేశారని ఇంత వరకు హరిలేదు శివా లేదని, ఎంకెప్పుడు తీర్పు వస్తుందని కెసిఆర్‌ నిలదీశారు. ప్రజలకు సాగునీరు, తాగునీరు అందెదెప్పుడని దీనికి అంతర్జాతీయ న్యాయస్థానాన్ని ఆశ్రయించాలా అని ఆయన విరుచుకుపడ్డారు. దేశ ం వెనకబాటుతనం, సద్వినియోగం కానీ సహాజ సంపద బిజెపి, కాంగ్రెస్‌ రాజకీయ విధానాలు తదితర అంశాలపై ఉపన్యసించారు. బిఆర్‌ఎస్‌ ఏర్పాటు వెనక ఉన్న లక్ష్యాలను ఆయన వివరించారు. సహాజ సంపద ఈ దేశం సొత్తు అని, కానీ అవి సద్వినియోగం జరగకపోవడం వల్లే ఏడున్నర దశాబ్దాల స్వాతంత్య్ర భారతం వెనకబాటుకు గురైందన్నారు. భారతదేశంలో 83 కోట్ల ఎకరాలు సాగుకు లాకి అయినా భూమి ఉందని ఇది ప్రపంచంలో మరే దేశంలో లేదని 1.40 లక్షల టిఎంసిల వర్షపాతం ఉందని 70 నుంచి 75 వేల టిఎంసిలను వాడుకునే అవకాశం ఉన్నా వాడుకోలేని పరిస్థితి దేశంలో ఉందన్నారు. జీవనదులు అనేకం ఉన్న దేశ ప్రజలు విషపు నీళ్లు తాగి జీవించాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. జింబాబ్వే, కెనడా, ఘన, చైనా, అమెరికా మొదలైన దేశాలలో వేల టిఎంసిల నీటిని నిల్వ చేసే రిజర్వాయర్ల నిర్మాణం జరిగినా భారతదేశంలో అటువంటి ప్రాజెక్టు ఏది నిర్మించబడలేదన్నారు. స్వాతంత్య్రం వచ్చిన తొలినాళ్లలో అక్కడక్కడ కొన్ని ప్రాజెక్టుల నిర్మాణం జరిగినా ఆ తర్వాత ఆ దిశగా ఆలోచనలు సాగలేదన్నారు. సుసంపన్నమైన భారతదేశంలో కల్తీ నీరు, మెక్‌డోనాల్డ్‌ పిజ్జాలు, బర్గర్లు తిని బతకాల్సిన పరిస్థితి ఏర్పడిందని మంచి ఆహారం దొరకాల్సిన చోట కల్తీలు రాజ్యమేలుతున్నాయని కెసిఆర్‌ ఆవేదన వ్యక్తం చేశారు. అశేష ప్రజలు హాజరైన ఈ సభలో కేరళ, ఢిల్లీ, పంజాబ్‌ ముఖ్యమంత్రులు పినరయ్‌ విజయన్‌, అరవింద్‌ కేజ్రీవాల్‌, భగవంత్‌ మాన్‌, సిపిఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి.రాజా, సమాజ్‌వాది పార్టీ అధ్యక్షులు అఖిలేష్‌ యాదవ్‌, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు, సీనియర్‌ నాయకులు పువ్వాడ నాగేశ్వరరావు, సిపిఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, బిఆర్‌ఎస్‌ జాతీయ నాయకులు వినీత్‌ నారాయణ్‌, గుర్నాం సింగ్‌, బిఆర్‌ఎస్‌ పార్లమెంటరీ పక్ష నాయకుడు డాక్టర్‌ కె.కేశవరావు, బిఆర్‌ఎస్‌ లోక్‌సభ పక్ష నాయకుడు నామా నాగేశ్వర్‌ రావు, రాష్ట్ర మంత్రులు పువ్వాడ అజయ్‌కుమార్‌, టి.హరీష్‌రావు, ఎంపిలు వద్దిరాజు రవిచంద్ర, పార్థసారధి రెడ్డి, మాలోత్‌ కవిత, పలువురు శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులు, వివిధ కార్పొరేషన్ల ఛైర్మన్లు పాల్గొన్నారు. బిఆర్‌ఎస్‌ సాంస్కృతిక దళం అలపించిన గేయాలు ప్రజలను ఆలోచింపజేశాయి. చరిత్రలో నిలిచిపోయేలా ఖమ్మంలో బిఆర్‌ఎస్‌ ఆవిర్భావ సభను నిర్వహించార

DO YOU LIKE THIS ARTICLE?
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments