ఒక్కరోజే 38,902 కేసులు
10,77,618కి చేరిన పాజిటివ్‌లు
తాజాగా 543 మరణాలు
న్యూఢిల్లీ: దేశంలో కరోనా వైరస్ విజృంభణ రోజురోజుకు పెరుగుతూనే ఉంది. గడిచిన 24 గంటల్లో 38,902 కొవిడ్- కొత్త కేసులు వెలుగుచూశాయి. దీంతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 10,77,618కి చేరుకోగా 6,77,422 మంది కోలుకున్నారు. ఇక ఈ వ్యాధితో తాజాగా 543 మంది మరణించారు. తాజా మరణాలతో దేశవ్యాప్తంగా కరోనా మరణాల సంఖ్య 26,816 కు చేరినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. గడిచిన 24 గంటల్లో కరోనా మహమ్మారి నుంచి 23,672 మంది కోలుకున్నారు. కరోనా వైరస్ కట్టడికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేపట్టిన చర్యలు సత్ఫలితాలు ఇచ్చాయని ఆరోగ్య మం త్రిత్వ శాఖ ఆదివారం పేర్కొంది. ప్రభుత్వాల చొరవతో కరోనా మరణాల రేటు ప్రపంచంలోనే అత్యల్పంగా 2.5శాతం దిగువకు పడిపోయిందని తెలిపింది. ప్రస్తుతం దేశంలో కరోనా బాధితుల రికవరీ రేటు 63శాతంగా ఉంది. కంటైన్మెంట్ వ్యూహాలను సమర్థంగా అమలు చేయడం, పెద్దసంఖ్యలో టెస్టులు నిర్వహించడం, మెరుగైన చికి త్సావిధానాలతో దేశంలో మరణాల సంఖ్య గణనీయంగా తగ్గిందని పేర్కొంది. భారత్‌లో కరోనా మరణాల రేటు క్రమంగా దిగివస్తూ ప్రస్తుతం 2.49 శాతానికి పడిపోయిందని, ఇది ప్రపంచంలోనే అత్యల్ప మరణాల రేట్లలో ఒకటని తెలిపింది.
వారంరోజుల్లో 4వేల మరణాలు
గడిచిన వారం రోజులుగా దేశంలో కరోనా మరణాల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. గత ఆదివారం దేశంలోకరోనా మరణాల సంఖ్య 22,674గా ఉండగా ప్రస్తుతం అది 26,816కు చేరింది. దేశవ్యాప్తంగా నిత్యం దాదాపు 500మందికి పైగా కొవిడ్ రోగులు మృతిచెందుతున్నారు. దీంతో ఈ వారం రోజుల్లోనే 4142 మరణాలు సంభవించడం ఆందోళన కలిగిస్తోంది.
రోజువారీ కేసుల్లో రెండోస్థానంలో భారత్
రోజువారీగా నమోదవుతున్న పాజిటివ్ కేసుల్లో భారత్ రెండో స్థానంలో ఉంది. ప్రపంచంలో అత్యధికంగా అమెరికాలో కేసులు నమోదవుతున్నాయి. తాజాగా నిత్యం అక్కడ 70వేల పాజిటివ్ కేసులు బయటపడుతున్నాయి. అమెరికా తర్వాతి స్థానంలో ప్రస్తుతం భారత్ కొనసాగుతోంది. భారత్‌లో రోజువారీ కేసుల సంఖ్య 39వేలకు చేరువవడం ఆందోళన కలిగిస్తోంది. ఇక అత్యధిక కరోనా కేసుల జాబితాలో 37లక్షలతో అమెరికా తొలిస్థానంలో ఉండగా భారత్ మూడోస్థానంలో కొనసాగుతోంది. మరణాల్లో మాత్రం భారత్ ఎనిమిదో స్థానంలో ఉంది.
కరోనాతో కన్నడ నటుడు మృతి మహమ్మారిన బడి అనేక మంది సినీ సెలబ్రిటీలు మృత్యువాత పడుతున్న సంగతి తెలిసిందే. తాజాగా కన్నడ సీనియర్ నటుడు హల్వానా గంగాధరయ్య(70) కరోనాతో కన్నుమూశారు. శ్వాస సమస్య ఇబ్బంది పెడుతుండడంతో బెంగళూరులోని బిజిఎస్ ప్రైవేటు ఆసుపత్రిలో చేరిన ఆయన శనివారం రాత్రి కన్నుమూశారు. ఆయనకు భార్య, ముగ్గురు కూతుళ్లు, ఒక కొడుకు ఉన్నారు.
పంజాబ్ మరో ఇద్దరు కాంగ్రెస్ ఎంఎల్‌ఎలకు కొవిడ్
పంజాబ్‌లో మరో ఇద్దరు కాంగ్రెస్ ఎంఎల్‌ఎలు కరోనా బారిన పడ్డారని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్ ఆదివారం ట్వీట్ చేశారు. ‘నా సహచర ఎంఎల్‌ఎలు బల్వీందర్ ధలీవాల్, ధరంబీర్ అగ్నిహోత్రీకి కరోనా సోకినట్టు పరీక్షలో తేలింది. వారిద్దరూ త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నా’ అని సిఎం ట్వీట్ చేశారు. ప్రస్తుతం కరోనా బారిన పడ్డ కాంగ్రెస్ ఎంఎల్‌ఎల సంఖ్య 3కు చేరుకుంది. మరోవైపు..మంత్రి బజ్వా భార్య, కుమారుడికి కూడా కరోనా సోకినట్టు ఇటీవల వెల్లడైంది. అయితే వారిద్దరిలో కరోనా రోగ లక్షణాలు లేకపోవడంతో వారిరువురూ హోం క్వారంటైన్‌కే పరిమితమయ్యారు.
దేశంలో కొవిడ్ విజృంభణ
RELATED ARTICLES