24 గంటల్లో 45,720 కరోనా పాజిటివ్‌లు, 1129 మరణాలు
12,38,635కు చేరిన కేసుల సంఖ్య
న్యూఢిల్లీ: భారత్‌లో కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతూనే ఉన్నాయి. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా అత్యధికంగా 45,720 తాజా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 12 లక్షలు దాటింది. మహమ్మారి బారినపడి 1129 మంది మరణించడంతో కరోనా మరణాల సంఖ్య 30,000కు చేరుకుందని ఆరోగ్య మంత్రిత్వ శాఖ గురువారం వెల్లడించింది. ఇక దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 12,38,635 కు చేరగా వ్యాధి నుంచి 1129 కోలుకుని 7,82,606 మంది డిశ్చార్జి అయ్యారు. మొత్తం 4,26,167 యాక్టివ్ కేసులున్నాయని అధికారులు తెలిపారు. ఈనెల 22 వరకూ 1,50,75,369 శాంపిళ్లను పరీక్షించగా, బుధవారం ఒక్కరోజే 3,50,823 కరోనా పరీక్షలు జరిగాయని ఐసిఎంఆర్ వెల్లడించింది. మరోవైపు ప్రపంచవ్యాప్తంగా కరోనా వ్యాక్సిన్లపై నిర్వహిస్తున్న మానవ పరీక్షల్లో సానుకూల ఫలితాలు వెల్లడవుతుండటం ఆశలు రేకెత్తిస్తోంది.
తమిళనాడు రాజ్‌భవన్‌లో 84 మందికి పాజిటివ్
తమిళనాడు రాజ్‌భవన్‌లో గురువారంనాడు 84 మంది సిబ్బందికి కరోనా పాటిజివ్‌గా నిర్ధారణ అయింది. 147 మంది సిబ్బందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా 84 మందికి పాజిటివ్‌గా తేలింది. పాజిటివ్‌గా నిర్ధారణ అయిన వారిలో సెక్యూరిటీ, ఫైర్ సిబ్బంది ఉన్నారు. ఈ మేరకు రాజ్‌భవన్ అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు.
మధ్యప్రదేశ్ మంత్రికి కరోనా మంత్రి అరవింద్ భడోరియా కు కరోనా సోకింది. జలుబు, దగ్గు లాంటి కొవిడ్ లక్షణాలు బయటపడటంతో పరీక్షలు నిర్వహించగా కరోనా పాజిటివ్ అని తేలడంతో వెంటనే గురువారం భోపాల్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేరారు. ఆయన కుటుం బ సభ్యులకు అందరికీ కరోనా నెగెటివ్ అని తేలింది. అయితే మంత్రి అరవింద్ భడోరియా ఒకరోజు ముందే మంత్రివర్గ సమావేశానికి హాజరు కావడంతో ఇప్పుడు మంత్రులకు సైతం కరోనా భయం పట్టుకుంది. అంతకుముందు మంగళవారం గవర్నర్ లాల్జీ టాండన్ అంత్యక్రియల్లో కూడా అరవింద్ భడోరియా పాల్గొన్నారు. లాల్జీటాండన్ అంత్యక్రియల్లో, మంత్రివర్గ సమావేశంలో పలువురితో కలిసి పాల్గొన్న మంత్రికి కరోనా సోకడంతో ఆయా కార్యక్రమాల్లో పాల్గొన్న వారందరూ ఆందోళన చెందుతున్నారు.
చెన్నైలో ప్లాస్మా బ్యాంక్ ప్రారంభం రాజధాని ఢిల్లీ తరువాత, దేశంలోని రెండవ ప్లాస్మా బ్యాంక్ చెన్నైలో ప్రారంభం అయింది. చెన్నైలోని రా జీవ్ గాంధీ ప్రభుత్వ జనరల్ హాస్పిటల్ (ఆర్‌జిజిజిహెచ్)లో ఈ బ్యాం కును గురువారం ప్రారంభించారు, కరోనా రోగులకు చికిత్స చేయడానికి ప్లాస్మా థెరపీని ఉపయోగించడం మంచి ఫలితాలకు దారితీసిందని రాష్ట్ర ప్రధాన ఆరోగ్య కార్యదర్శి జె. రాధాకృష్ణన్ అన్నారు. ఈ దృష్ట్యా తమిళనా డు ప్రభుత్వం ఈ ప్లాస్మా బ్యాంకును సిద్ధం చేసింది. 2.34 కోట్ల రూపాయ ల వ్యయంతో స్థాపించిన ప్లాస్మా బ్యాంకును ఆరోగ్య మంత్రి డాక్టర్ సి విజయభాస్కర్ ప్రారంభించారు. 30 నిమిషాల్లో ఒకేసారి ఏడుగురు వ్యక్తుల నుండి 500 మి.లీ ప్లాస్మా తీయడానికి ఇక్కడ ఉండే మౌలిక సదుపాయా లు ఉపయోగపడతాయి. కాగా చెన్నైలో ఎఐఎడిఎంకె శాసనసభ్యుడు ఎన్ సతన్ ప్రభాకర్ ఈ సదుపాయంలో మొదటి దాతగా నిలిచారు. ఇక దేశంలోని మొదటి ప్లాస్మా బ్యాంక్ ఢిల్లీలో రెండు వారాల క్రితం ప్రారంభమైంది.
దేశంలో ఆల్‌టైమ్ రికార్డు కేసులు
RELATED ARTICLES