24 గంటల్లో 37,724 కేసులు, 648 మరణాలు
11,92,915కు చేరిన పాజిటివ్ కేసుల సంఖ్య
న్యూఢిల్లీ: భారత్‌లో కరోనా వైరస్ ఉధృతి కొనసాగుతూనే ఉంది. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 37,724 తాజా కేసులు వెలుగుచూశాయి. దీంతో ఇప్పటివరకూ నమోదైన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 11,92,915కు చేరింది. ఈ వైరస్‌తో గడిచిన 24 గంటల్లో 648 మంది మరణించడంతో కరోనా మరణాల సంఖ్య 28,732కి చేరిందని ఆరోగ్య మంత్రిత్వ శాఖ బుధవారం తెలిపింది. కొవిడ్ బారినపడి కోలుకున్న వారి సంఖ్య 7,53,050కి పెరగడం ఊరట ఇస్తోంది. దేశంలో మొత్తం ప్రస్తుతం 4,11,133 యాక్టివ్ కేసులున్నాయి. ఈనెల 21 వరకూ 1,47,24,546 శాంపిళ్లను పరీక్షించినట్టు ఐసిఎంఆర్ వెల్లడించింది. ఇక కరోనా హాట్‌స్పాట్‌గా మారిన మహారాష్ట్రలో అత్యధికంగా కరోనా వైరస్ కేసుల సంఖ్య మూడు లక్షల మార్క్ దాటింది. వైరస్ విస్తృతితో పలు రాష్ట్రాలు కరోనా కట్టడికి లాక్‌డౌన్‌ను కఠినంగా అమలుచేస్తున్నాయి. వారం రోజుల పాటు పూర్తిగా లాక్‌డౌన్‌లో ఉన్న బెంగళూర్ నగరంలో బుధవారం నుంచి సాధారణ కార్యకలాపాలకు అనుమతించనున్నారు.
కశ్మీర్‌లో ఆరు రోజులు సంపూర్ణ లాక్‌డౌన్ రోజుల పాటు ఏకధాటి గా కశ్మీర్ లోయలో పూర్తి లాక్‌డౌన్ విధించారు. కరోనా కేసులు పెరిగిపోతున్న నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నామని అధికారులు బుధవారం ప్రకటించారు. బందిపొర జిల్లాలో మాత్రం లాక్‌డౌన్ విధించలేదు. ఈ లా క్‌డౌన్ బుధవారం సాయంత్రం 6 గంటల నుంచి అమలులోకి రానుందని అధికారులు ప్రకటించారు. జులై 27 వరకూ సంపూర్ణ లాక్‌డౌన్ అమలులో ఉంటుందని అధికారులు ప్రకటించారు. నిత్యావసర సరకుల రవాణా విషయంలో మాత్రం మినహాయింపు ఉంటుందని ,అలాగే వ్యవసాయం దాని అనుబంధ రంగాలకు కూడా వర్తించదని అధికారులు ప్రకటించారు.
బీహార్‌లో కరోనాతో ఎంఎల్‌సి మృతి బిజెపి ఎంఎల్‌సి సునీల్‌కుమార్ సింగ్ (69) కరోనాతో మంగళవారం రాత్రి మృతిచెందారు. కొద్ది రోజుల క్రితం ఆయనకు కరోనా పాజిటివ్ అని నిర్దారణ కావడంతో ఎయిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. సునీల్‌కుమార్ మృతికి ముఖ్యమంత్రి నితీష్ కుమార్ సంతాపం తెలిపారు. ఆయన మరణం తీరని లోటని, ఆయన ఆత్మకు శాంతి కలగాలని ఉప ముఖ్యమంత్రి సుశీల్ కుమార్ అన్నారు.
దేశంలోకరోనా ఉధృతి
RELATED ARTICLES