ప్రజాపక్షం / హైదరాబాద్ రాష్ట్ర ప్రభుత్వ అధికార భాషా సంఘం అధ్యక్షుడు దేవులపల్లి ప్రభాకర్‌రావు(84) కన్నుమూశారు. గత కొంతకాలం నుంచి అనారోగ్యంతో బాధపడుతున్న ప్రభాకర్‌రావు హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గురువారం తుది శ్వాస విడిచారు. దేవులపల్లి ప్రభాకర్‌రావు 2016 ఏప్రిల్ 29 నుంచి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ అధికార భాషా సంఘం చైర్మన్‌గా కొనసాగుతున్నారు. వరంగల్ పట్టణంలో ఆండాళమ్మ, వేంకట చలపతిరావు దంపతులకు దేవులపల్లి ప్రభాకర్ రావు జన్మించారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి డిగ్రీ అందుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వ సమాచార-పౌర సంబంధ శాఖలో, రాష్ట్ర ప్రభుత్వ కుటుంబ సంక్షేమ శాఖ మాస్ మీడియా విభాగంలో సంపాదకులుగా పని చేశారు. ఈనాడు, ఆంధ్రభూమి, వార్త, ప్రజాతంత్ర, నమస్తే తెలంగాణతో పాటు పలు పత్రికల్లో ఆయన వ్యాసాలు ప్రచురితం అయ్యాయి.
సిఎం సంతాపం
దేవులపల్లి మృతి పట్ల ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు సంతాపం ప్రకటించారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. అధికార భాషా సంఘం చైర్మన్గాదేవులపల్లి ప్రభాకర్‌రావు అందిచిన సేవలను సిఎం కెసిఆర్ ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు.
దేవులపల్లి ప్రభాకర్‌రావు కన్నుమూత
RELATED ARTICLES