రాంచీ: దేవధర్ ట్రోఫీ ఫైన ల్లో ఇండియా- విజేతగా నిలిచింది. శుభ్‌మన్‌గిల్ నాయకత్వంలోని ఇండియా జట్టుపై 51 పరుగుల తేడాతో విజయం సా ధించింది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన పార్థివ్ పటేల్ సారథ్యంలోని ఇండియా-బి జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 283 పరుగులు చేసింది. ఇండియా-బి జట్టులో కేదార్ జాదవ్ (86; 94 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్సులు), యశస్వి జైశ్వాల్ (54; 79 బంతుల్లో 5 ఫోర్లు, సిక్స్) హాఫ్ సెంచరీలతో రాణించారు. ఇక, ఇండియా-సి జట్టు బౌలర్ ఇషాన్ పోరెల్ 10 ఓవర్లు వేసి 5 వికెట్లు తీసి 43 పరుగులిచ్చాడు. లిస్ట్-ఎ క్రికెట్‌లో ఇషాన్ పోరెల్‌కు ఇది రెండో ఐదు వికెట్లు హాల్ కావడం విశేషం. అనంతరం 284 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన ఇండియా-సి జట్టుకు ఆరంభంలోనే మహ్మద్ సిరాజ్ షాకిచ్చాడు. జట్టు స్కోరు 2 పరుగుల వద్ద ఇండియా-సి కెప్టెన్ శుభమాన్ గిల్(1)ను పెవిలియన్‌కు చేర్చాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన ప్రియమ్ గార్గ్ (74; 77 బంతుల్లో 8 ఫోర్లు, సిక్స్) హాఫ్ సెంచరీతో ఆకట్టుకున్నాడు. మరో ఓపెనర్ మయాంక్ అగర్వాల్ (28; 31 బంతుల్లో 3 ఫోర్లు) దూకుడు ఆడే క్రమంలో జట్టు స్కోరు 56 పరుగుల వద్ద షాబాజ్ నదీమ్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. ఆ తర్వాత వరుసగా వికెట్లు కోల్పోయి ఇండియా-సి కష్టాల్లో పడింది. ఈ క్రమంలో ఇండియా-సి జట్టు 77 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయింది. చివర్లో అక్షర్ పటేల్ (38), మయాంక్ మార్కండె (27), జలజ్ సక్సేన (37 నాటౌట్) ఫరవాలేదనిపించినప్పటికీ సాధించిన స్కోరు ఎక్కువగా ఉండటంతో ఒత్తిడికి లోనై 232/9 పరుగులకే పరిమితమైంది. కాగా, ఈ మ్యాచ్‌లో స్పిన్నర్ షాబాజ్ నదీమ్ ఆకట్టుకున్నాడు. సొంత మైదానం కాడవంతో చెలరేగాడు. మొత్తం 32 పరుగులిచ్చి 4 వికెట్లు పడగొట్టాడు.
దేవధర్ ట్రోఫీ విజేత భారత్-బి
RELATED ARTICLES